తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Thursday Motivation: గతం గురించి బాధపడుతూ కూర్చోకండి, గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తును నిర్మించుకోండి

Thursday Motivation: గతం గురించి బాధపడుతూ కూర్చోకండి, గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తును నిర్మించుకోండి

Haritha Chappa HT Telugu

29 August 2024, 5:00 IST

google News
    • Thursday Motivation: గతాన్ని తలుచుకుంటూ ఉంటే గతంలోనే ఆగిపోతారు. ఆ గతాన్ని మరిచిపోయి అడుగు ముందుకు వేయండి. జీవితంలో ఎంతో సాధిస్తారు.
మోటివేషనల్ స్టోరీ
మోటివేషనల్ స్టోరీ (Pixabay)

మోటివేషనల్ స్టోరీ

Thursday Motivation: ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితంలో ఏదో ఒక తప్పు చేసినవాడే, ఆ తప్పునే తలుచుకుంటూ గతంలోనే ఆగిపోతే భవిష్యత్తును నిర్ణయించుకోవడం కష్టమైపోతుంది. గతం అంటే అర్థం ఏమిటి? గతించిపోయినది అని అర్థం. అంటే జరిగిపోయినది. జరిగిపోయిన గతాన్ని మార్చలేము. కానీ భవిష్యత్తును మాత్రం బంగారంలా నిర్మించుకోగలము. భవిష్యత్తు బాగుండాలంటే వర్తమానంలో పనిచేయాలి.

గతంలో మీరు ఏదో ఒక తక్కువ చేసి ఉండవచ్చు. ఎన్నో చేదు అనుభవాలు ఉండొచ్చు. అయితే ప్రతి సూర్యోదయం మీకు కొత్త జీవితాన్ని ఆరంభించే అవకాశాన్ని ఇస్తుంది. గతం కేవలం మీ ఆలోచనల్లో మాత్రమే ఉంటుంది. ఆలోచనల నుంచి తీసేస్తే గతం అనేది ఉండదు. మీలో ప్రతికూల ఆలోచనలు పెరిగిపోతాయి. పరిష్కార మార్గాలు మాత్రం కనిపించవు.

గతించిపోయిన గతాన్ని మరిచి, నేటి వర్తమానాన్ని, రాబోయే భవిష్యత్తును ఎలా జీవించాలో ఆలోచించండి. జీవితంలో ఆనందాన్ని, విజయాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే, మరో తలుపు తెరుచుకునేందుకు సిద్ధంగా ఉంటుంది. కానీ మనం మూసిన తలుపు వైపే చూస్తూ ఉంటే మన కోసం తెరిచి ఉన్న తలుపులను గుర్తించలేం. మీరు గతం గురించి ఆలోచిస్తూ ఉంటే ఆ మూసి ఉన్నా తలుపును చూస్తున్నట్టే.

గతంలోని మీరు చేసుకున్న తప్పులను ఒప్పులను గుర్తు తెచ్చుకోండి. ఆ తప్పుల నుండి మీరు ఎంతో నేర్చుకోవాలి. అప్పుడే మీరు తెలివైనవారుగా మారతారు. ఆ తప్పులని మెట్లుగా భావించి భవిష్యత్తుకు పునాదులు వేయండి. జరిగిపోయిన గతం గురించి బాధపడే కన్నా తర్వాత ఏం చేయాలో ఆలోచించడం మంచిది.

గతాన్ని గురువుగా భావించండి, ఆ గురువు నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. అలాగని గతం తవ్వుకుంటూ కూర్చుంటే వర్తమానంలో జీవించడం మర్చిపోతాము. గతం గురించి ఆలోచిస్తూ ఉంటే... అది వేధిస్తూనే ఉంటుంది. భవిష్యత్తును కూడా భయాందోళనతో ముంచేస్తుంది.

గతం అనేది ఇంకిపోయిన బావి లాంటిది. ఆ బావిలో నుంచి ఎంత తోడినా ఏమీ రాదు. గతించిన గాయానికి మందు రాద్దాం అనుకుంటే... అది మానలేని గాయమై జీవితాన్ని దహించి వేస్తుంది. గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటే అది మోయలేని బరువుగా మారిపోతుంది. భవిష్యత్తు చేరలేని గమ్యంగా మారుతుంది. కాబట్టి గతాన్ని గురించి ఆలోచించడం మానేయండి. గతాన్నివదిలేసి వర్తమానం, భవిష్యత్తులో ఏం చేయాలో ఆలోచించండి.

తదుపరి వ్యాసం