తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Inancial Goals: ఈ చిట్కాలతో మీ ఆర్థిక లక్ష్యాలు మరింత సులభతరం

inancial Goals: ఈ చిట్కాలతో మీ ఆర్థిక లక్ష్యాలు మరింత సులభతరం

28 February 2022, 16:59 IST

google News
    • అధిక మొత్తంలో చెల్లింపులతో పెట్టుబడుల కోసం వెతకడం కంటే సరైన ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. మీ లక్ష్యాలకు అనుగుణంగా మీకు ఏం కావాలో ప్రణాళిక రూపొందించుకోవాలి. ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎంత పెట్టాలి, అంచనాలను సరిగ్గా అందుకోగలమా లాంటి విషయాలను పునరాలోచించుకోవాలి.
ఆర్థిక లక్ష్యాలు
ఆర్థిక లక్ష్యాలు (Hindustan Times)

ఆర్థిక లక్ష్యాలు

Financial Goals.. ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉండాలంటే ఈ రోజుల్లో బహుళ ఆదాయమార్గాలు కలిగి ఉండాలి. ఇందుకోసం ఏదైనా ఆర్థిక సాధనాల్లో పెట్టుబడులు పెట్టాలి. అయితే ప్రతి పెట్టుబడిదారు మదిలో మెదిలే ప్రాథమిక ప్రశ్న.. ఇన్వెస్ట్ చేస్తే గరిష్ఠ రాబడి వస్తుందా?. అయితే ఈ ప్రశ్నను అడిగేముందు ఒక్కసారి ఎవరికివారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. అధిక మొత్తంలో చెల్లింపులతో పెట్టుబడుల కోసం వెతకడం కంటే సరైన ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. మీ లక్ష్యాలకు అనుగుణంగా మీకు ఏం కావాలో ప్రణాళిక రూపొందించుకోవాలి. ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎంత పెట్టాలి, అంచనాలను సరిగ్గా అందుకోగలమా లాంటి విషయాలను పునరాలోచించుకోవాలి. ఈ నేపథ్యంలో మీ ఫైనాన్షియల్ గోల్స్​ను సాధించడానికి ఉపయోగపడే స్మార్ట్ టిప్స్ గురించి ఇప్పుడు చూద్దాం.

మీ లక్ష్యాలు నిర్దిష్టంగా ఉండాలి(Specific)..

మీ ఆర్థిక లక్ష్యాలు ఎప్పుడూ నిర్దిష్టంగా, స్పష్టంగా ఉండాలి. ఇల్లు కొనుగోలు చేయాలనుకోవడం అస్పష్టమైన లక్ష్యం. మీరు ఎక్కడ, ఎలాంటి హౌస్ తీసుకోవాలనుకుంటున్నారో స్పష్టతను కలిగి ఉండాలి. ఉదాహరణకు ముంబయిలోని సబ్ అర్బన్​ గేటెడ్ కమ్యూనిటీలో ఒక బెడ్​రూం, కిచెన్, హాల్​తో(1BHK) కూడిన ఇల్లు తీసుకోవాలనుకోవడం అర్థవంతమైన లక్ష్యం. ఎందుకంటే మీ లక్ష్యం నిర్దిష్టంగా ఉంటే ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. ఫలితంగా దాన్ని సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ప్రమాణాలకు తగినట్లు ఉండాలి(Measurable)..

లక్ష్యానికి ఇతర అంశాలతో పాటు డబ్బు విలువ కూడా ఉండాలి. అప్పుడే మీరు ఏం చేయాలనుకుంటున్నారో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. పై ఉదాహరణను పరిశీలిస్తే ఆ ఇల్లు కొనుగోలు చేయాలంటే రూ.70 లక్షల ఖర్చవుతుంది. 20 శాతం డౌన్ పేమెంట్ కోసం​ రూ.14 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి మీ ఆర్థిక లక్ష్యం మీరు పొదుపు చేసిన మొత్తంపై ఆధారపడి ఉంటుంది. అంటే మీరు రూ.14 లక్షలు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అయితే ధరలు మీ అంచనాల కంటే ఎక్కువగానే ఉంటాయి. అప్పుడు అదే మీ ఆర్థిక ప్రణాళికకు కారకంగా మారుతుంది.

లక్ష్యాలు సాధించేలా ఉండాలి(Achievable)..

మీ ఆర్థిక లక్ష్యాలు ఎప్పుడూ సాధించేటట్లు ఉండాలి. కొన్నిసార్లు మీ సమీప భవిష్యత్తులో వాటిని సాధించలేకపోవచ్చు. తక్కువ రిస్క్ ప్రొఫైల్ ను కలిగి ఉన్న వ్యక్తులకు సాధించలేని లక్ష్యాలు.. అధిక రాబడులను అందించే రిస్కీ ఆస్తులకు కేటాయింపులు చేస్తే ఆ లక్ష్యాలను సాధించవచ్చు. పైఉదాహరణ ప్రకారం నెలకు లక్ష రూపాయలు జీతం కలిగిన వ్యక్తి నెలవారీగా రూ.30 వేలు పొదుపు చేస్తే అతడు అనుకున్న రూ.14 లక్షల లక్ష్యాన్ని ఏడాది చివరకు అందుకోలేడు. అదే కొంచెం ఎక్కువ సమయాన్ని తీసుకుంటే ఆ లక్ష్యం నెరవేరుతుంది. అంటే ఇప్పటి నుంచి రూ.14 లక్షల కార్పస్​ను కూడగట్టాల్సి వస్తే ఐదేళ్లలో 12 రిటర్న్​ రేటుతో నెలకు రూ.17,150 పెట్టుబడి చెల్లిస్తే సరిపోతుంది.

వాస్తవికంగా ఉండాలి(Realistic)..

మీ లక్ష్యాలు వాస్తవికంగా ఉండాలి. నెలకు రూ.లక్ష జీతం కలిగిన వ్యక్తి ముంబయిలోని ఖరీదైన ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించాలని నిర్ణయించుకుంటే ఆ లక్ష్యం అవాస్తవికమే అవుతుంది. ఎందుకంటే ప్రాపర్టీ అధిక ధర, సరిపోని ఆదాయం వల్ల ఆ లక్ష్యం అసాధ్యమవుతుంది. అదే 1BHK ఇల్లు కొనుగోలు చేయాలనుకోవడం మీ లక్ష్యానికి దగ్గరగా ఉంటుంది. అలా కాకుండా విదేశీ విహారయాత్రలు, లగ్జరీ స్పోర్ట్స్ కారు కోసం డౌన్ పేమెంట్ చెల్లించడం లాంటివి అవాస్తవంగా మారుతాయి.

నిర్ణీత కాలం(Time-bound)..

ఆర్థిక లక్ష్యాన్ని కాలానుగుణంగా వ్యక్తీకరించాలి. ధరల పెరుగుదలతో ప్రైస్ ట్యాగ్ కూడా మారుతుంది. పైన పేర్కొన్న ఉదాహరణలో మనం ద్రవ్యోల్బణాన్ని 5 శాతంగా పరిగణించినట్లయితే అదే ఇల్లు ఐదేళ్ల తర్వాత 89.34 లక్షలకు చేరుతుంది. ఏడేళ్లకు 98.5 లక్షలకు వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ముంబయి సబ్ అర్బన్​లో 1బీహెచ్​కే ఇల్లును 19.7 లక్షల డౌన్​పేమెంట్ చెల్లిస్తే ఏడేళ్ల తర్వాత దాని విలువ రూ.98.5 లక్షలు ఉంటుంది.

దీన్ని బట్టి ఆర్థిక లక్ష్యాన్ని స్పష్టంగా నిర్వచించడం ఆర్థిక ప్రణాళికను సులభతరం చేస్తుంది. వ్యక్తులు తమకు ఏం కావాలో తెలుసుకుంటే మరింత స్పష్టతతో పొదుపు చేయవచ్చు. అందుకు తగినట్లుగా పెట్టుబడి పెట్టవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం