తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Love Obsession: ప్రేమ ముదిరితే పిచ్చే.. ఈ లక్షణాలుంటే ఆ పరిస్థితికి చేరువైనట్లే

Love Obsession: ప్రేమ ముదిరితే పిచ్చే.. ఈ లక్షణాలుంటే ఆ పరిస్థితికి చేరువైనట్లే

28 February 2022, 17:13 IST

    • మనసంతా ప్రేమించినవారినే పెట్టుకొని పిచ్చి ప్రేమను(Obsessive) చూపిస్తుంటే మాత్రం జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇలాంటి అబ్సెసివ్ లవ్ వల్ల ఎదుటివారికి భయానకంగా ఉంటుంది, వారిని ఊపిరాడనీయకుండా చేస్తుంది. దీన్నే అబ్సెసివ్ లవ్ డిజార్డర్(OLD) అని పిలుస్తారు. ఈ పరిస్థితికి సంబంధించిన లక్షణాలు చాలా మందిలో కనిపించవు.
ప్రేమ పిచ్చి ఆలోచనలు
ప్రేమ పిచ్చి ఆలోచనలు (Hindustan times)

ప్రేమ పిచ్చి ఆలోచనలు

Love Obsession.. ప్రేమ అనేది ప్రతి ఒక్కరూ అనుభూతి చెందాల్సిన భావన. ఎందుకంటే ఎదుటివారి భావాలను అర్థం చేసుకోవడం, మన భావాలను వారితో పంచుకోవడంతో పాటు ఇరువురు మధ్య నమ్మకానికి పునాదులు వేసే అద్భుత ప్రక్రియ. అయితే ఒకరితో ప్రేమలో ఉండటమనేది సహజం. కానీ మనసంతా వారినే పెట్టుకొని పిచ్చి ప్రేమను(Obsessive) చూపిస్తుంటే మాత్రం జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇలాంటి అబ్సెసివ్ లవ్ వల్ల ఎదుటివారికి భయానకంగా ఉంటుంది, వారిని ఊపిరాడనీయకుండా చేస్తుంది. దీన్నే అబ్సెసివ్ లవ్ డిజార్డర్(OLD) అని పిలుస్తారు. ఈ పరిస్థితికి సంబంధించిన లక్షణాలు చాలా మందిలో కనిపించవు. కానీ ఏదోక రోజు మాత్రం తప్పకుండా గ్రహిస్తారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరుగుతుంది. కాబట్టి అబ్సెసివ్ లవ్ డిజార్డర్​ను కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ట్రెండింగ్ వార్తలు

Chanakya Niti On Women : ఈ 5 గుణాలున్న స్త్రీని పెళ్లి చేసుకుంటే పురుషుల జీవితం స్వర్గమే

Oats vegetables khichdi: ఓట్స్ వెజిటబుల్స్ కిచిడి... ఇలా చేస్తే బరువు తగ్గడం సులువు, రుచి కూడా అదిరిపోతుంది

Men Skin Care Drinks : మెరిసే చర్మం కావాలంటే రోజూ ఉదయం వీటిలో ఏదో ఒకటి తాగండి

Sunday Motivation: ప్రపంచాన్ని గెలిచిన విజేతల విజయ రహస్యాలు ఇవే, ఫాలో అయిపోండి

మనసంతా వారి గురించే ఆలోచనలు..

మీరు ప్రేమిస్తున్న వ్యక్తి గురించే ఎప్పుడూ ఆలోచించడం, వారినే తలుచుకోవడం ఈ పరిస్థితిని సూచిస్తాయి. బాత్రూంలో ఉన్నా, తల్లిదండ్రులతో కలిసి భోజనం చేస్తున్నా అవతలి వ్యక్తి ఏం చేస్తున్నాడో అని ఆలోచిస్తుంటారు. సినిమాల్లో మాదిరిగా ఫాంటసీలా కనిపించినప్పటికీ ఈ పరిస్థితి అబ్సెషన్​ను సూచిస్తుంది. నిఘా కెమెరా మాదిరిగా ఎప్పుడూ వారి ఆలోచన మీ మదిలో ఉంటుంది. అంతేకాకుండా ఈ లక్షణాన్ని మీరు తప్పుగా భావించరు.

పొసెసివ్​నెస్(Possessiveness)..

ప్రేమలో ఉంటే కొంచెం పొసెసివ్​నెస్ కూడా ఉండాలి. అంటే మనం ప్రేమించేవారు తమకే సొంతమనే భావన కలిగి ఉండటం. ఇది కొంతవరకు కరెక్టే అయినప్పటికీ శ్రుతి మించితే మాత్రం ప్రమాదమే. ఎదుటివారు తమ బెస్ట్ ఫ్రెండ్స్​, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులతో కలిసి నవ్వుతున్నా, ఫీలింగ్స్ షేర్ చేసుకున్నా ఓర్వలేకపోవడం పొసెసివ్​నెస్​ను సూచిస్తుంది. మీకిష్టమైనవారు మీకు చెప్పకుండా మార్కెట్​కు వెళ్లినా అసూయ భావన మీలో కలుగుతుంది. కాబట్టి ఈ లక్షణం కూడా OLDకి కారణమవుతుంది.

నిరంతరం మెసేజ్ చేయడం..

మీకు OLD ఉన్నట్లయితే మీ భాగస్వామికి నిరంతరం సందేశాలను పంపిస్తూనే ఉంటారు. బయటకు వెళ్లినా, వేరే ప్రదేశంలో ఉన్నా వారికి మెసేజ్ చేస్తూనే ఉంటారు. ఈ విధంగా నిరంతరం వారితో టచ్​లో ఉండటం సాధారణమైన విషయం కాదు.

ప్రపంచాన్ని మైమర్చిపోవడం..

మీరు ప్రేమలో పీకల్లోతు మునిగిపోయి ఉన్నట్లయితే చుట్టూ ఎంత మంది ఉన్నా వారి గురించే ఆలోచన చేస్తారు. ప్రతి విషయాన్ని మర్చిపోతారు. స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉండలేరు. వారికి ఒక్కరోజు కూడా సాధారణంగా గడవదు. ప్రపంచాన్ని మైమర్చిపోయి తమ ప్రేమికుల ఆలోచనల్లో మునిగితేలుతుంటారు.

నియంత్రణ అవసరం..

OLD పరిస్థితి ఉన్నవారు కొన్ని విషయాల్లో నియంత్రణ కలిగి ఉండటం అవసరం. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావ్? ఫోన్​లో ఇంతసేపు ఎందుకు మాట్లాతున్నావ్? అతను లేదా ఆమెను ఎందుకు తరచుగా కలుస్తున్నావ్? లాంటి ప్రశ్నలు తరచూ అడుగుతుంటే అవతలి వ్యక్తి OLD బాధితులు అయినట్లే.

తదుపరి వ్యాసం