Foods to avoid with Prawns: రొయ్యలతో పాటు తినకూడని ఆహారాలు ఇవి, తింటే ఎలర్జీలు తప్పకపోవచ్చు
28 December 2023, 11:48 IST
- Foods to avoid with Prawns: రొయ్యలతో పాటు కలిపి తినకూడని ఆహారాల జాబితా మీకు తెలుసా? రొయ్యలు ఆరోగ్యానికి ప్రయోజనకరమైనా, వాటితో కొన్ని కాంబినేషన్ ఫుడ్స్ తీసుకంటే ఆరోగ్యం పాడవుతుంది.
రొయ్యలతో కలిపి తినకూడదని ఆహారా పదార్థాలు
Prawns: మాంసాహార ప్రియులు అత్యంతగా ఇష్టపడే సీఫుడ్ లలో రొయ్యలు కూడా ఒకటి. పచ్చి రొయ్యలతో ఎన్నో రకాల వంటకాలు వండుకోవచ్చు. రొయ్యల బిర్యానీ, రొయ్యల వేపుడు, రొయ్యల ఇగురు వంటివన్నీ కూడా నోరూరిస్తాయి. అయితే రొయ్యలు కొందరిలో అలెర్జీలను కలిగిస్తాయి. అలాంటివారు వీటికి పూర్తిగా దూరంగా ఉండాలి.
మరికొందరిలో కొన్ని రకాల ఫుడ్ కాంబినేషన్లు అలెర్జీకి గురిఅయ్యేలా చేస్తాయి. ముఖ్యంగా రొయ్యలతో పాటు కొన్నిరకాల పదార్థాలు తినడం వల్ల అలెర్జీలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రొయ్యలు తిన్నప్పుడు వెంటనే తినకూడని ఆహారాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
పాల పదార్థాలు
రొయ్యలతో చేసిన ఆహారం తిన్నప్పుడు పాలపదార్థాలకు దూరంగా ఉండాలి. ఈ కలయిక అలర్జీకి దారితీస్తుంది. పాల ఉత్పత్తుల్లోని కాల్షియం రొయ్యలలోని ప్రోటీన్లతో చర్య జరుపుతుంది. ఇది పొట్టలో ఎసిడిటీ పెరగడానికి దారితీస్తుంది. ఇది జీర్ణక్రియకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. దీనివల్ల కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రొయ్యలు తిన్న రోజు పెరుగు, పాలు వంటివి దూరం పెడితే మంచిది.
స్పైసీ ఫుడ్
రొయ్యలు కాస్త స్పైసీగా వండితే రుచిగానే ఉంటాయి. కానీ అధికంగా కారం, మసాలాలు వేసి వండడం వల్ల పొట్ట ఇబ్బందుల్లో పడుతుంది. రొయ్యలు అధికంగా కారం వేసి వండడం వల్ల పొట్టలోని లైనింగ్‌కు చికాకు కలుగుతుంది. ఇది ఇబ్బందిగా అనిపిస్తుంది. జీర్ణవ్యవస్థకు కూడా అసౌకర్యంగా అనిపిస్తుంది.
ఐరన్ ఆహారాలు
రొయ్యల్లో ఐరన్ ఎంతో కొంత మొత్తంలో ఉంటుంది. దీన్ని రెడ్ మీట్, పాలకూర వంటి ఐరన్ అధికంగా ఉండే ఆహారంతో తీసుకోవడం వల్ల ఐరన్ శోషణ పెరుగుతుంది. ఐరన్ లోపం ఉన్న వ్యక్తులకు ఇది ప్రయోజనకరమే. కానీ అదనంగా ఐరన్ అవసరం లేని వారు ఇలా తింటే మాత్రం శరీరంలో ఇనుము అధిక స్థాయిలో చేరిపోతుంది. దీని వల్ల కొన్ని రకాల సైడ్ ఎఫెక్టులు వస్తాయి.
పిండిపదార్థాలు
రొయ్యలు తిన్నప్పుడు పాస్తా, బ్రెడ్ వంటి పిండి పదార్థాలు అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. అలాగే బంగాళదుంపలు వంటివి కూడా తినకుండా ఉండాలి. వీటిలో ఉండే స్టార్చ్ శరీరంలో చేరి అధిక బరువుకు కారణం అవుతుంది. అలాగే పొట్ట ఉబ్బినట్టు అనిపిస్తుంది. రొయ్యలతో పాటు ఇతర కూరగాయలు వంటివి తినకపోవడం మంచిది.
సిట్రస్ పండ్లు
రొయ్యలు వేయించుకుని పైన నిమ్మకాయ పిండుకొని తినేవారు ఎంతోమంది. నిజానికి ఇది తప్పు. రొయ్యల్లో ఇలా పుల్లని పదార్థాన్ని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు రావచ్చు. సిట్రస్ పండ్లలో ఆమ్లత్వం ఉంటుంది. రొయ్యల్లో ప్రోటీన్లు ఉంటాయి. ఈ రెండూ కలిసి కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. రొయ్యలు తిన్నప్పుడు పైన నిమ్మకాయ చల్లుకోవడం మానేయడమే ఉత్తమం.
రొయ్యలను సాధారణంగా వండుకొని తింటే శరీరానికి ఎంతో మంచిది. దీనిలో ఉండే సెలీనియం క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. రొయ్యల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండెలోని రక్తనాళాలు పూడుకు పోకుండా కాపాడతాయి.
ఈ రొయ్యల్లో ప్రోటీన్, విటమిన్ బి3 పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరానికి కావాల్సిన అవసర పోషకాలు. ఖచ్చితంగా రొయ్యలను ప్రతి ఒక్కరు డైట్‌లో చేర్చుకోవాలి. ఇవి తినడం వల్ల బరువు పెరగరు.
పైగా శరీరంలో ఉన్న అదనపు కొవ్వును ఇది కరిగిస్తుంది. వారానికి ఒక్కసారైనా రొయ్యలు తినేలా ప్లాన్ చేసుకుంటే మంచిది. దంతాలు, ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం అవసరం.
రొయ్యల్లో మన శరీరానికి అవసరమైనంత కాల్షియం లభిస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో రొయ్యలు ముందుంటాయి. వీటిలో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని జుట్టును మెరిసేలా చేస్తుంది.
టాపిక్