తెలుగు న్యూస్  /  Lifestyle  /  The Benefits And Ways Of Worshipping Surya Dev

ఆదివారం సూర్యదేవున్ని ఇలా ప్రార్థిస్తే మీకు ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది!

HT Telugu Desk HT Telugu

21 May 2022, 21:00 IST

    • సనాతన ధర్మంలో ఒక్కొ రోజుకు ఒక్కొ ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఆదివారం సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. ఆ రోజున సూర్యుడిని ప్రార్థించడం ద్వారా ఆర్థిక, సామాజిక, అనేక ఇతర సమస్యల నుండి బయటపడతారని జ్యోతిష్కులు సలహా ఇస్తున్నారు.
Sunday Upay
Sunday Upay

Sunday Upay

జీవితంలో ఆర్థిక కష్టాలు తొలగాలంటే గ్రహాలకు అధిపతి అయిన సూర్యభగవానుణ్ణి ప్రసన్నం చేసుకోవాలని జోతిష్య శాస్త్రం చెబుతుంది. సూర్య భగవానుడిని పూజించడం వల్ల మనిషి కోరికలన్నీ నేరవేరుతాయని శాస్త్రం వివరిస్తోంది. ముఖ్యంగా ఆదివారం సూర్య భగవానునికి ప్రత్యేకంగా ప్రార్థించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ రోజున శ్రీ సూర్య చాలీసా పఠించాలి. సూర్య చాలీసా పఠించడం ద్వారా, సూర్య భగవానుడి నుండి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది.  అనుగ్రహం పొందిన వ్యక్తి సిరిసంపదలతో పాటు గౌరవం, వైభవం పొందుతారని జోతిష్యులు నిపుణులు చెబుతున్నారు. సూర్యుడి కరుణ వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడి గౌరవం పెరుగుతుందని నమ్ముతున్నారు. విశ్వాసాల ప్రకారం, ఆదివారం రోజున సూర్య భగవానుని పూజించడం వల్ల మనిషి జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు. ఈ రోజు ఉపవాసం ఉండడం వల్ల దోషాలు దూరమవుతాయి. అలాగే ఉదయాన్నే సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించండి.

సూర్యభగవానుడికి ఆదివారం ప్రత్యేక పూజలు

సూర్యభగవానుడి అనుగ్రహం పొందాలంటే ఆదివారం శుభ ప్రదమైన రోజు. సూర్యుడిని ఆదివారం నాడు ప్రత్యేకంగా పూజిస్తే ఫలితం ఉంటుంది. సూర్యున్ని వెంటనే ప్రసన్నం చేసుకోవచ్చు. ఆదివారం సూర్య చాలీసా పఠించడం పూజలు చేయడం వల్ల ఫలితాల ప్రభావం కనిపిస్తుంది. వ్యాపారం కలిసి వస్తుంది. ధన ప్రాప్తి కలుగుతుంది.

సూర్యదేవుణ్ణి ప్రార్థించే విధానం

ఆదివారం రోజున ఉదయాన్నే నిద్ర లేచి. కాలకృత్యాల తర్వాత స్నానం చేసి శుభ్రమైన బట్టలను ధరించి. సూర్య భగవానుడికి సంబంధించిన పూజా కార్యక్రమాన్ని ప్రారంభించాలి. దీని కోసం ముందుగా ఓ రాగి పాత్రలో నీరును తీసుకొని.. ఎర్రటి పూలు, బెల్లం, నీరు, అక్షతలు అందులో కలపి భగవానుడి దగ్గర ఉంచి పూజాను చేయాలి. బయట సూర్యున్ని దేవున్ని కొలిచే సమయంలో రెండు చేతుల్లో ఆ నీటిని తీసుకొని సూర్యుడి వైపుగా మూడు సార్లు పోస్తుండాలి. సూర్యుడికి ఇలా పూజాలు చేయడం వల్ల జాతకంపై వెంటనే పడుతుంది. ఇలా పూజించే సమయంలో ప్రత్మేక మంత్రాన్ని చదివాలి