తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mango With Dosa: మామిడిపండు రసంతో.. గోదుమ పిండి అట్లు.. ఎప్పుడైనా తిన్నారా?

mango with dosa: మామిడిపండు రసంతో.. గోదుమ పిండి అట్లు.. ఎప్పుడైనా తిన్నారా?

05 May 2023, 6:30 IST

google News
  • mango with whear flour dosa: గోదుమ పిండి అట్లతో మామిడి రసం తినే అలవాటు కొద్ది ప్రాంతాల్లో మాత్రమే ఉంటుంది. అవి ఎలా చేసుకోవాలో చూసేయండి. 

మామిడిపండ్లు
మామిడిపండ్లు (unsplash)

మామిడిపండ్లు

కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వేసవిలో ఎక్కువగా తినే ఈ స్పెషల్ కాంబినేషన్ గురించి తెలుస్తుంది. గోదుమ పిండి అట్లతో మామిడి పండు రసం నంచుకుని తినడమంటే చాలా ఇష్టపడతారు. మీకు తెలీకపోతే ఒకసారి ప్రయత్నించండి. మీకు కూడా నచ్చుతుంది.

గోదుమపిండి అట్లు తయారీ విధానం:

కావాల్సిన పదార్థాలు:

గోదుమ పిండి - సగం కప్పు

బియ్యం పిండి - సగం కప్పు

ఉప్పు - టీస్పూను

నీళ్లు - రెండు కప్పులు

తయారీ విధానం:

step 1: ముందుగా పెద్ద పాత్రలో గోదుమపిండి, బియ్యంపిండి, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసకుంటూ దోసెల పిండి కన్నా కాస్త చిక్కగా ఉండేలా చూసుకుని నీళ్లు పోసుకోవాలి. పిండిలో ఉండలు లేకుండా కలుపుకోవాలి.

step 2: నీళ్లు సరిపోవనిపిస్తే ఇంకొన్ని నీళ్లు పోసుకోవచ్చు. పెనం తీసుకుని వేడెక్కాక నూనెతో రుద్ది, దోసె పోసుకోవడమే. అయితే ఒక గరిటెతో పిండి పోసుకుని కాస్త సమంగా అయ్యేలా అనాలంతే. దోసెలాగా సన్నగా చేయకూడదు.

step 3: కాసేపయ్యాక గాలి బుడగల వల్ల మధ్య మధ్యలో రంద్రాల్లాగా అవుతాయి. కాస్త రంగు మారనట్టు అనిపించగానే మరోవైపు కాల్చుకోండి. నూనె వేయాల్సిన అవసరం లేదు. వీటిని మామిడి పండు రసంతో తింటే రుచి చాలా బాగుంటుంది.

మామిడి పండు రసం తయారీ:

బాగాపండిన మామిడి పండ్ల తొక్కతీసి, ముక్కలుగా కోసుకుని మిక్సీలో వేసి పట్టుకోవాలి. అవసరమనుకుంటే తీపి కోసం కాస్త పంచదార వేసుకోవచ్చు. పంచదార కలుపుకున్నాక కొన్ని పాలు కూడా కలుపుకుంటే ప్రత్యేక రుచి వస్తుంది. దీన్ని గోదుమ పిండి అట్లతో తింటే అమోఘంగా ఉంటుంది. వేసవిలో చక్కని అల్పాహారమిది.

తదుపరి వ్యాసం