మెగాపవర్ బ్యాటరీతో Tecno Pova 3 స్మార్ట్‌ఫోన్ భారత్‌లో విడుదల, ధర కూడా తక్కువే!
20 June 2022, 14:10 IST
- చైనీస్ మొబైల్ కంపెనీ టెక్నో Tecno Pova 3 భారీ బ్యాటరీ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో బ్లూ కలర్ ఫోన్‌కు ఒక ప్రత్యేక ఆకర్షణ ఉంది. ఆ విశేషాలన్నీ ఈ స్టోరీలో చదవండి..
Tecno Pova 3
ట్రాన్షన్ టెక్నో ఇటీవల ఆవిష్కరించిన Tecno Pova 3 స్మార్ట్‌ఫోన్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో ఇప్పటివరకు వచ్చిన ఏ సాధారణ స్మార్ట్‌ఫోన్‌లలో లేని విధంగా 7,000mAh సామర్థ్యం కలిగిన మెగాపవర్ బ్యాటరీని ఇచ్చారు. మామూలుగా ఫోన్‌లలో 5000mAh సామర్థ్యం ఉంటేనే అది నాణ్యమైన బ్యాటరీగా చెప్తారు. ఇది సుమారు 2 రోజుల బ్యాకప్ ఇవ్వగలదు. దీనిని బట్టి Tecno Pova 3 స్మార్ట్‌ఫోన్ అంతకుమించి బ్యాటరీ బ్యాకప్ అందిస్తుందని చెప్పవచ్చు. ఈ ఫోన్ 50 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్, 20 గంటల యూట్యూబ్ వీడియో ప్లేబ్యాక్ అలాగే 8 గంటల గేమింగ్‌ను అందించగలదని కంపెనీ పేర్కొంది.
ఇప్పుడు ఈ Tecno Pova 3 భారత మార్కెట్లోనూ విడుదలైంది. జూన్ 27 నుండి అమెజాన్ ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. దీని అసలు ధర రూ. 13 వేల వరకు ఉండవచ్చు. అయితే లాంచింగ్ ఆఫర్ కింద ఈ ఫోన్‌ను రూ. 11,499/_ విక్రయించనున్నట్లు నివేదించారు. అలాగే ఈ ఫోన్ కొనుగోలుపై ICICI Amazon Pay క్రెడిట్ కార్డ్‌తో 5% వరకు అపరిమిత క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది.
Tecno Pova 3 స్మార్ట్‌ఫోన్ ఎలక్ట్రిక్ బ్లూ, టెక్ సిల్వర్, ఎకో బ్లాక్ అనే కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. అయితే ఇందులో బ్లూ కలర్ మోడల్ వెనుక ప్యానెల్ మీద ప్రత్యేకమైన పవర్ లైట్‌ను ఇచ్చారు. ఇన్‌కమింగ్ కాల్స్ వచ్చినపుడు, ఛార్జింగ్ అవుతున్నప్పుడు అలాగే గేమ్‌లకు నోటిఫికేషన్ల సమయంలో ఈ లైట్ వెలుగుతుంది. మిగతా మోడళ్లలో ఈ ఆప్షన్ లేదు.
ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన మరిన్ని ఫీచర్లు, స్పెసిఫికేషన్లను ఈ కింద పేర్కొన్నాము, చూడండి.
Tecno Pova 3 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
- 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.9 అంగుళాల IPS LCD ఫుల్ HD+ డిస్‌ప్లే
- 4GB/6GB RAM, 64 GB/ 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
- మీడియాటెక్ Helio G88 ప్రాసెసర్
- వెనకవైపు 50+2+2 మెగా పిక్సెల్ కెమెరా, ముందు భాగంలో 8 MP సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
- 7000 mAh బ్యాటరీ సామర్థ్యం, 33W ఛార్జర్
ఫోన్ హీటెక్కకుండా ఇందులో Z-యాక్సిస్ లీనియర్ మోటార్‌తో కూడిన గ్రాఫైట్ కూలింగ్ సిస్టమ్ ఉంది. DTS స్టీరియో సౌండ్‌తో డ్యూయల్ స్పీకర్లు, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్, హెడ్‌ఫోన్ జాక్ అలాగే FM రేడియో రిసీవర్, మృదువైన డిస్‌ప్లే, 4G చిప్‌సెట్ ఇతర ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి.
Tecno Pova 3 స్మార్ట్‌ఫోన్ 4GB RAM, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ కోసం ధర రూ. 11,499/- కాగా 128 GB వేరియంట్ ధరను కంపెనీ ఇంకా నిర్ణయించలేదు.