Strawberry Ice Tea | సమ్మర్లో కూల్ కూల్‌గా.. స్ట్రాబెర్రీ ఐస్ టీ
04 March 2022, 17:37 IST
- స్ట్రాబెర్రీ ఐస్ టీ గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది సమ్మర్లో వేసవి తాపం నుంచి మనకి ఉపశమనం అందించే చక్కటి లిక్విడ్. ఈ ఐస్ టీ ఓ చక్కని కూల్‌డ్రింక్ ఫీలింగ్‌ని ఇచ్చి.. ఒక రిఫ్రెష్మెంట్ కచ్చితంగా ఇస్తుంది. పైగా దీనిని ఇంట్లో తయారు చేసుకోవడం కూడా చాలా సులువు.
స్ట్రాబెర్రీ ఐస్ టీ
Strawberry Ice Tea | వచ్చేది వేసవి కాలం. ఇప్పటికే ఎండలు దుమ్మురేపుతున్నాయి. ఈ ఎండలను తట్టుకునేందుకు అందరూ శీతల పానీయాలను ఆశ్రయిస్తారు. ఎండ నుంచి కాస్త ఉపశమనం వాటినుంచే లభిస్తుందని భావిస్తుంటారు. వేసవిలో లభించే పండ్లతో జ్యూస్‌లను తయారు చేసుకుని తాగుతారు. ఇవి హెల్త్‌ని ఇవ్వడంతో పాటు.. వేడి నుంచి ఉపశమనం అందిస్తాయి. కానీ ఈసారి సమ్మర్‌ను చల్లని టీతో ప్రారంభించి చూడండి.
టీతో ఏంటి వేడి తగ్గడం అనుకోవద్దు. ఇది స్ట్రాబెర్రీ ఐస్ టీ. పేరుకు తగ్గట్టుగానే దానిని చూసినప్పుడు, తాగినప్పుడు కూడా ఓ చక్కని ఫీల్ వస్తుంది. దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
తయారీ విధానం
ఓ గిన్నేలో లీటర్ నీళ్లు తీసుకుని బాయిల్ చేయాలి. అది మరుగుతున్నప్పుడు టీ పౌడర్ వేసి.. 5 నుంచి 6 నిముషాలు మరగనివ్వాలి. ఈ బ్లాక్ టీని వడపోసి.. చల్లార్చి పక్కకు పెట్టుకోవాలి.ఇప్పుడు బ్లెండర్లో కొన్ని స్ట్రాబెర్రీలను తీసుకోవాలి. మంచి ప్యూరీగా దానిని బ్లెండ్ చేసుకోవాలి. ఈ ప్యూరీ చూసేందుకు చాలా బాగుంటుంది.
స్ట్రాబెర్రీ ప్యూరీ రెడీ అయిన తర్వాత.. ఓ గ్లాసులో ఐసు ముక్కలను తీసుకోవాలి. దానిలో 5 లేదా 6 స్పూన్ల స్ట్రాబెర్రీ ప్యూరీని వెయ్యాలి. అనంతరం దానిలో తేనే, నిమ్మకాయరసం, కొంచెం సాల్ట్, కాస్త బ్లాక్ టీ వేసుకోవాలి. వెంటనే పుదీనా ఆకులు వేసి.. క్లోజ్ చేసి బాగా కలపాలి.
ఇప్పుడు మరో గ్లాస్ తీసుకుని దానిలో మళ్లీ ఐస్ క్యూబ్స్ వేసుకుని.. కొంచెం పుదీనా తరుగు, స్ట్రాబెర్రీ ముక్కలు వేసుకుని... ఈ ఐస్‌టీని వేసుకోవాలి. మంచిగా గార్నిష్ చేసుకుని తాగుతుంటే.. మీరు ఎండలో పడిన శ్రమనంతా మరిచిపోవడం ఖాయం.