Summer Special Tea | వేసవితాపాన్ని తగ్గించే.. బ్లాక్‌బెర్రీ మింట్ ఐస్‌డ్ టీ
31 March 2022, 8:24 IST
- సమ్మర్ వచ్చేసింది. పగలు రాత్రి తేడా లేకుండా వేడితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ టైంలో టీ తాగడం అంటే కాస్త ఇబ్బందితో కూడుకున్న విషయమే. కానీ తాగకుండా ఉండలేము. కానీ ఈ టీని ఐస్‌డ్ టీతో రిప్లేస్ చేస్తే.. పైగా సమ్మర్‌లోని వేడి నుంచి విముక్తి నిచ్చే.. ఐస్‌డ్ టీ అయితే అబ్బా ఆ ఊహా ఎంత బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వేసవి వేడి నుంచి మీకు చల్లదనాన్ని ఇచ్చే ఐస్‌డ్ టీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చుద్దాం.
బ్లాక్‌బెర్రీ మింట్ ఐస్‌డ్
Blackberry Mint Iced Tea | చాలా మందికి టీ లేనిదే రోజు ప్రారంభం కాదు. పనిపై శ్రద్ధ వహించాలన్నా.. కాస్త విరామం కావాలన్నా.. ఒత్తిడి తగ్గించుకోవాలన్నా.. టీ వైపే పరుగులు తీస్తారు. కానీ వేసవి కాలంలో టీ తాగడమంటే సాహసమనే చెప్పాలి. అసలే మండే ఎండలు.. ఈ టైంలో టీ ఏమి తాగుతామనుకునే వారికి ఇక్కడ ఓ రెసిపీ ఉంది. ఇది మీకు టీ తాగాలనే కోరికను తీర్చడమే కాకుండా.. మిమ్మల్ని ఆ సూర్యుని వేడి నుంచి కాపాడుతుంది.
వేసవి కాలంలో ఐస్‌డ్ టీ అనేది ఓ గొప్ప ఎంపిక అని చెప్పవచ్చు. ఎందుకంటే చల్లగా తాగాలనే ఆశతో ఇతర కూల్‌డ్రింక్‌ల జోలికి పోకుండా మిమ్మల్ని అదుపు చేస్తుంది. పైగా ఇప్పుడు మనం తయారు చేసుకునే ఐస్‌డ్ టీలో కేలరీలు తక్కువగా ఉంటాయి. పైగా చక్కెర రహితం. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా కూడా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు, ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారు హ్యాపీగా దీనిని తయారు చేసుకుని తాగేయొచ్చు. మరి దీనిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావలసినవి:
* నీరు- 4-5 కప్పుల
* టీ బ్యాగులు- మీకు నచ్చినవి 4-5
* పుదీనా ఆకులు - కొన్ని (తాజాగా ఉండాలి)
* బ్లాక్ బెర్రీస్ - 5-6 తాజా
* తేనే- రుచికి తగినంత
తయారీ విధానం..
బ్లెండర్‌లో బ్లాక్‌బెర్రీస్, పుదీనా, తేనె [రుచి ప్రకారం], కొద్దిగా నీరు వేసి... ప్యూరీలా చేసుకోవాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని.. స్ట్రైనర్ ఉపయోగించి వడకట్టి పక్కన పెట్టాలి. అనంతరం 4 కప్పుల నీటిని మరిగించి, ఆపై టీ బ్యాగులు వేసి పది నిముషాలు ఉంచాలి.
టీ పూర్తయిన తర్వాత.. టీ బ్యాగ్‌లను తీసివేయాలి. దానిలో బ్లాక్‌బెర్రీ ప్యూరీని వేసి బాగా కలపాలి. రుచిని చూసి మరింత తేనే వేసుకోవచ్చు. అనంతరం దీనిని పూర్తిగా చల్లబడే వరకు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఐస్ క్యూబ్స్ వేసిన గ్లాసుల్లో దీనిని పోసి.. బ్లాక్ బెర్రీస్, పుదీనా ఆకులతో సర్వ్ చేసుకుంటే చాలు. వేసవి తాపాన్ని తగ్గించే బ్లాక్‌బెర్రీ మింట్ ఐస్‌డ్ టీ రెడీ అయినట్లే.
ఉపయోగాలు..
ఈ బ్లాక్‌బెర్రీ మింట్ ఐస్‌డ్ టీలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి హృదయనాళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతే కాకుండా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. విటమిన్ సి, విటమిన్ కె, ఫైబర్ ఈ టీలో అధికంగా ఉంటుంది.