Sleeping Tips | మీకు ఇష్టమైన వారి పక్కన పడుకుంటే ఏమవుతుందో తెలుసా?
10 March 2022, 15:02 IST
- మీకు ఇష్టమైన వారి పక్కన పడుకున్నప్పుడు, లేదా మీరు ఒంటరిగా నిద్రపోయినప్పుడు మీరు పొందే అనుభూతి వేరుగా ఉంటుంది. దీని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? గమనించినట్లైతే మీరు కూడా దీనిని ఒప్పుకుంటారు. ఒంటరిగా పడుకున్నప్పుడు మీలో ఆందోళన పెరుగుతుందని మీకు తెలుసా? మరి ఇష్టమైనవారిని పక్కన పడుకుంటే ఏమవుతుందో తెలుసా?
మంచి నిద్ర కావాలంటే ఇలా చేయండి
Sleeping Tips | యూకేకు చెందిన సైకాలజీ స్పెషలిస్ట్ టిమ్ గ్రే అధ్యాయనాల ప్రకారం.. ప్రియమైన వ్యక్తి పక్కన పడుకుంటే.. వేగంగా నిద్ర వస్తుందని.. ఇది చాలా మంచిదని.. నిద్రసమస్యలు కూడా తక్కువగా ఉంటాయని వెల్లడించారు. నార్తుంబ్రియా విశ్వవిద్యాలయం చేసిన పరిశోధన ప్రకారం.. వాస్తవానికి నిద్రపోవడానికి పట్టేసమయానికి, మన మొత్తం నిద్రకు, ఆరోగ్యానికి మధ్య సంబంధం ఉంటుందని వెల్లడించిది.
ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాలు మొత్తం ఆరోగ్యలో నాణ్యత, నిద్ర పరిమాణంపై ఆధారపడి ఉంటుందని తేల్చాయి. సరైన నిద్రవల్ల మెదడు ఆరోగ్యం, గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడతాయని తేల్చి చెప్పాయి.
మీరు ఒంటరిగా పడుకున్నప్పుడు ఏమి జరుగుతుంది?
మీరు ఒంటరిగా పడుకున్నప్పుడు కొన్నిసార్లు స్లీప్ జెర్క్స్ మిమ్మల్ని మేల్కొల్పుతాయి. అలాగే గది యొక్క ప్రశాంతత, చీకటి మిమ్మల్ని ఆత్మపరిశీలన దశలోకి నెట్టవచ్చు. ఇది మీకు కచ్చితంగా జరిగే ఉంటుందని గ్రే చెప్పారు. ఒంటరిగా పడుకున్నప్పుడు మీకు చుట్టు జరిగే పరిస్థితుల గురించి ఆలోచించడం, లేక మీ సమస్యల గురించి ఎక్కువ ఆలోచించడం చేస్తారు. అప్పుడు మీకు నిద్రపోవడం కష్టంగా మారుతుంది.
గ్రే చెప్పినట్లుగా.. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ మనస్సు సంచరించడం ప్రారంభిస్తుంది. అలాంటపప్పుడు మీ సొంత ఆలోచనలలో చిక్కుకోవడం సర్వసాధారణం. ఆ సమయంలో మెదడు మరింత చురుగ్గా పనిచేసి.. ఎక్కువగా ఆలోచిస్తాము. కళ్లు మూసుకోవడం కూడ కష్టంగా మారుతుంది.
అందుకే మీరు ఇష్టపడే వారి పక్కన పడుకోవడం మీ నిద్రకు విజయాన్ని చేకూరుస్తుంది. వారు గురకపెట్టి మీ నిద్రను పాడు చేయనంత కాలం.. మంచి నిద్ర మీ సొంతం. ఎందుకంటే మీ పక్కన ఉన్నవారి వల్ల మీలో భద్రతా భావం పెరుగుతుంది కాబట్టి.. మీరు విశ్రాంతిగా పడుకుంటారు.
నిద్రను ఎలా మెరుగుపరచాలి? ప్రియమైన వారితో పడుకోవడం సహాయం చేయగలదా?
కచ్చితంగా మీ భాగస్వామితో నిద్రించడం వల్ల నిద్రను పెంచే కొన్ని రసాయనాలు విడుదలవుతాయని గ్రే పేర్కొన్నారు.
1. ఆక్సిటోసిన్
ఆక్సిటోసిన్ మిమ్మల్ని సంతోషంగా ఉంచే ప్రేమ హార్మోన్.
2. సెరోటోనిన్
ఈ హార్మోన్ శ్రేయస్సు మనసుకు ఆనందాన్ని ఇస్తుంది.
3. నోర్పైన్ఫ్రైన్
ఇది మీ స్నూజ్ సమయానికి స్నేహితుడు. ఇది నిద్రను నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఒత్తిడిని సమతుల్యం చేస్తుంది.
4. వాసోప్రెసిన్
ఇది నిద్ర నాణ్యతను పెంచుతుంది.. కార్టిసాల్‌ను తగ్గిస్తుంది.
5. ప్రొలాక్టిన్
ఈ హార్మోన్ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచి.. గొప్ప నిద్రను ఇస్తుంది.
యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కాలిఫోర్నియా కొన్నేళ్లక్రితం 59 మంది మహిళలపై నిద్ర, సాన్నిహిత్యంపై ప్రయోగం చేసింది. ఈ సర్వేలో పాల్గొన్నవారి ఆక్సిటోసిన్ స్థాయిలు, రక్తపోటును క్రమం తప్పకుండా తనిఖీ చేసింది.
ఫలితం ఏమిటి?
అత్యధిక ఆక్సిటోసిన్ ఉన్నవారికి తక్కువ రక్తపోటు ఉందని సర్వేలో తేలింది. అలాగే కార్టిసాల్ ఉత్పత్తిని ఆపడానికి మీ అడ్రినల్ గ్రంథులకు సంకేతాలను పంపుతుంది. దీని అర్థం ఒత్తిడిని తగ్గిస్తుంది. మంచి నిద్రను తగ్గిస్తుందని గ్రే వెల్లడించారు.
మీ ప్రియమైన వ్యక్తి పక్కన పడుకోవడం ఎందుకు గొప్పదో తెలిసింది కదా.. ఇప్పుడు మీరు కూడా హాయిగా పడుకోండి.