తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Navratri Recipes: అమ్మవారికి ప్రసాదంగా రుచికరమైన బర్ఫీలు, హల్వా ఇలా చేసేయండి..

Navratri Recipes: అమ్మవారికి ప్రసాదంగా రుచికరమైన బర్ఫీలు, హల్వా ఇలా చేసేయండి..

Parmita Uniyal HT Telugu

22 October 2023, 13:00 IST

google News
  • Navratri Recipes: నవరాత్రుల్లో అమ్మవారిని నైవేద్యంగా రకరకాల తీపి పదార్థాలు పెడుతుంటారు. కాస్త ప్రత్యేకంగా ఉండే ప్రసాదాలు ఎలా చేయాలో మీరూ తెలుసుకోండి. 

అమ్మవారి ప్రసాదాలు
అమ్మవారి ప్రసాదాలు

అమ్మవారి ప్రసాదాలు

నవరాత్రుల్లో ప్రతిరోజూ ప్రత్యేక వంటలు ఉండాల్సిందే. అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలు పెట్టి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. మీరూ కాస్త ప్రత్యేకంగా ఏదైనా తీపిగా నైవేద్యాలు చేయాలనుకుంటే ఇవి ప్రయత్నించి చూడండి. పక్కా కొలతలతో చేస్తే చాలా రుచిగా వస్తాయి. మళ్లీ మళ్లీ తినాలంటారు.

1. గోదుమ తేనె హల్వా

కావాల్సిన పదార్థాలు:

నెయ్యి 4 చెంచాలు

1 కప్పు గోదుమపిండి

1 కప్పు తేనె

1 కప్పు నీళ్లు

తరిగిన బాదాం, పిస్తా ముక్కలు

కొద్దిగా యాలకుల పొడి

తయారీ విధానం:

  1. కడాయి పెట్టుకుని వేడెక్కాక నెయ్యి వేసుకోవాలి. అది వేడయ్యాక గోదుమపిండి వేసుకోవాలి. కాస్త రంగు మారి సువాసన వచ్చేవరకు దాన్ని వేయించాలి.
  2. బాగా వేగాక తేనె కూడా పోసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోనే 1 కప్పు నీళ్లు కూడా పోసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి.
  3. చివరగా తరిగిపెట్టుకున్న పిస్తా, బాదాం వేసుకుని కలపుకోవాలి. అంతే కాస్త చిక్కబడ్డాక దింపేసుకుంటే చాలు.

2. తేనె యాపిల్ హల్వా:

కావాల్సిన పదార్థాలు:

3 పెద్ద యాపిల్స్

2 చెంచాల నెయ్యి

డ్రై ఫ్రూట్స్

1 కప్పు చిక్కటి పాలు

సగం కప్పు తేనె

కొద్దిగా యాలకుల పొడి

తయారీ విధానం:

  1. ముందుగా యాపిల్స్ చెక్కుతీసి తురుముకొని పక్కన పెట్టుకోవాలి.
  2. కడాయిలో నెయ్యి వేడి చేసుకుని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. వేయించుకుని పక్కన పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు యాపిల్ తురుము కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. కాసేపయ్యాక ముద్దలాగా తయారవుతుంది. ఇప్పుడు పాలు లేదా కోవా కలుపుకోవాలి.
  4. కాస్త చిక్క బడ్డాక తేనె కలుపుకోవాలి. చివరగా తేనె, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ కలుపుకుని దింపేసుకుంటే సరిపోతుంది.

3. బేసన్ కీ బర్ఫీ:

కావాల్సిన పదార్థాలు:

4 కప్పుల శనగపిండి

ఒకటిన్నర కప్పుల నెయ్యి

చిటికెడు పసుపు

కొద్దిగా యాలకుల పొడి

6 కప్పుల పంచదారా

ముప్పావు కప్పు నీళ్లు

2 చెంచాల తరిగిన పిస్తా

తయారీ విధానం:

  1. కడాయిలో నెయ్యి వేడి చేసుకుని శనగపిండి వేసుకోవాలి. రంగు మారేంత వరకు పిండి వేయించుకోవాలి.
  2. రెండు నిమిషాలయ్యాక కొద్దిగా పసుపు, యాలకుల పొడి కలపుకోవాలి. పిండిని పక్కన పెట్టుకోవాలి.
  3. నీళ్లు, పంచదార వేసుకుని బాగా కలుపుకోవాలి. తీగపాకం వచ్చేదాకా మరగనవ్వాలి.
  4. స్టవ్ కట్టేసి ఈ పాకాన్ని శనగపిండి మిశ్రమంలో కలుపుకోవాలి. ఒక ట్రే లోకి ఈ మిశ్రమం తీసుకుని బర్ఫీ ఆకారంలో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే.

తదుపరి వ్యాసం