Coconut water for men: పురుషులు, గుండె రోగులు కొబ్బరి నీళ్లు తాగకూడదా? ఎంత తాగితే హాని లేదు?
03 September 2024, 9:30 IST
Coconut water for men: కొబ్బరి నీరు రుచిలో చాలా తీపిగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. కానీ ఇది గుండె ఆరోగ్యానికి అలాగే పురుషులకు మంచిదా కాదా అనే సందేహాలను స్పష్టంగా చేసుకోండి.
కొబ్బరి నీళ్లు
కొబ్బరి నీళ్లను తాగగానే మన శీరీరానికి మంచి చేశామనే ఫీలింగ్ వచ్చేస్తుంది. చాలా సమస్యలకు కొబ్బరినీరు తాగితే ఉపశమనం దొరుకుతుంది. వేడిగా ఉన్నప్పుడు ముఖ్యంగా ఇది తాగితే దాహం తీరుతుంది. శరీరానికి శక్తి వస్తుంది. ఇది శరీరాన్ని క్యాన్సర్ బారినుంచి కాపాడుతుంది. కొబ్బరి ప్రోటీన్,ఆరోగ్యకర కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి, ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఆహారం ద్వారా లభించని పోషకాలు కొబ్బరి నీళ్లు తాగడం ద్వారా అందుతాయి.
అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవాళ్లు, పురుషులు వీటిని ఎక్కువగా తీసుకోకూడదని చెబుతారు. ఇది ఎంతవరకు వాస్తవమో తెల్సుకోండి.
కొబ్బరి నీరు గుండె రోగులకు మంచిదా?
కొబ్బరి నీరు గుండె రోగులకు సురక్షితమే. ఎందుకంటే ఇందులో కొవ్వు, కేలరీలు, చెడు కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటాయి. ఇది గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ నీటిలో పొటాషియం ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. రక్తపోటును కూడా నియంత్రిస్తుంది. హృద్రోగులు కొబ్బరినీళ్లు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే గుండెతో పాటు కిడ్నీ సమస్యలు ఉన్నవారు కొబ్బరినీళ్లు తాగకూడదు. డాక్టర్ సలహా తీసుకున్న తర్వాత తాగొచ్చు.
పురుషులు కొబ్బరి నీరు ఎక్కువగా తాగకూడదా?
పురుషులు కొబ్బరి నీరు ఎక్కువగా తాగడం మానుకోవాలి. ఎందుకంటే ఇది ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. వాస్తవానికి, కొబ్బరి నీరు ఎక్కువగా తాగడం వల్ల హైపర్కలేమియా వస్తుంది. ఇది రక్తంలో పొటాషియం ప్రమాదకరమైన స్థాయి పెంచుతుంది. ఇది క్రమరహిత హృదయ స్పందన లేదా మూత్రపిండాల సమస్యలకు దారితీస్తుంది. అదే సమయంలో, రక్తపోటు మందులు తీసుకుంటున్న లేదా రక్తపోటు తక్కువగా ఉన్న పురుషులు వారు కూడా కొబ్బరి నీరు తాగేముందు ఒకసారి వైద్య సలహా తీసుకోవాలి. కొబ్బరి నీరు ఎక్కువగా తాగితే, అది పురుషుల పునరుత్పత్తి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
శరీరానికి ఏ హాని జరగకుండా ఎంత తాగాలి అనేది ఇప్పుడు ప్రశ్న. కాబట్టి ఒక వ్యక్తి 1 లేదా 2 కప్పుల కొబ్బరి నీరు త్రాగటం సాధారణమైనదిగా పరిగణించబడుతుందని నివేదికలు చెబుతున్నాయి.
టాపిక్