తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Saturday Motivation : ప్రేమిస్తే పోయేదేముంది.. ప్రతిరోజూ ప్రేమించండి

Saturday Motivation : ప్రేమిస్తే పోయేదేముంది.. ప్రతిరోజూ ప్రేమించండి

HT Telugu Desk HT Telugu

11 March 2023, 4:30 IST

google News
    • Saturday Vibes : ఈ కాలంలో బంధం అనేది నీటిపై బుడగ లాంటిది. బుడగ ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు. ప్రేమ పుట్టుకొచ్చిన వెంటనే, కొన్నిరోజులకే సంబంధం విచ్ఛిన్నమవుతుంది. ఏ బంధంలోనైనా.. ఎటువంటి చీలిక లేకుండా, సంతోషకరంగా ఉండాలి.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సంబంధాలు అనేవి.. ఈరోజు పుట్టి రేపు చనిపోవు. బంధాలు ఎప్పటికీ కొనసాగుతాయి. అయితే వాటిని మనం ఎలా చూస్తాం అనేదాని మీదే ఆధారపడి ఉంటుంది. పెళ్లయ్యాక భార్యాభర్తల మధ్య అనుబంధం, ప్రేమికుల మధ్య సంబంధం ఎప్పుడూ ఉల్లాసంగా ఉండాలి. ఒక్కసారి రిలేషన్ షిప్ లో విసుగు పుట్టిస్తే దాన్ని సరిదిద్దుకోవడం కష్టం.

ఇటీవల వివాహం చేసుకున్న జంటలు నెలలు లేదా సంవత్సరంలోనే విడిపోతున్నారు. మేం ఒకరినొకరు అర్థం చేసుకున్నాం, కష్టంగా ఉంది, సంబంధానికి వీడ్కోలు పలుకుతాం అని సమాధానం ఇస్తున్నారు. అయితే రిలేషన్ షిప్ ఎక్కువ కాలం కొనసాగాలంటే కొన్ని నియమాలు పాటించాలి.

చాలా మంది భారతీయ జంటలు పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టే వరకు బాగానే ఉన్నారు. కానీ పిల్లలు పెరుగుతున్న సమయంలో వారు ఒకరిమీద ఒకరు ఆసక్తిని కోల్పోతారు. అందుకే పిల్లలతో కలిసి సమయం గడపాలి. డేట్ నైట్, డిన్నర్ పార్టీలకు కలిసి వెళ్లండి. భార్యాభర్తలు ఒకరికొకరు ప్రాధాన్యతనివ్వాలి. ఇద్దరి మధ్య ఏం చేసినా ప్రేమ పెరుగుతుందని తెలుసుకుని అందుకు తగ్గట్టుగా చేయాలి. ఒకరి భావాలకు, విలువలకు విలువ ఇవ్వడం నేర్చుకోవాలి.

కుటుంబం, భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం సహజం. ఇలాంటి వాదనను కొనసాగించి పెద్ద గొడవ వరకూ తీసుకెళ్లవద్దు. ఎవరైనా వాదించినట్లయితే, మీ భాగస్వామి శాంతించే వరకు వేచి ఉండండి. ఆపై ఏది సరైనది మరియు ఏది తప్పు అని వారికి వివరించండి. స్నేహం అనేది శాశ్వతమైనది. కాబట్టి భార్యాభర్తలు జంటగా మారకముందే స్నేహితులుగా ఉండాలి. ఇది చాలా కాలం పాటు సంబంధాన్ని పచ్చగా ఉంచుతుంది.

బంధం అనేది ఒకరినొకరు సంతోషపెట్టి ముందుకు సాగడమే. మీ భాగస్వామి మెచ్చుకునే అలవాట్లను స్వీకరించండి. వారు అభినందిస్తున్న విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టండి. మీ భాగస్వామిని గర్వపడేలా చేయండి. దీంతో మీపై వారికి ప్రేమ, అభిమానం పెరుగుతుంది. చాలా మంది వివాహిత జంటలు చేసే పొరపాటు ఏమిటంటే, మొదట్లో అతిగా ప్రేమించి, క్రమంగా ప్రేమను తగ్గించుకోవడం. ఇది పెద్ద తప్పు. పెళ్లయిన 40 ఏళ్ల తర్వాత కూడా ప్రేమ భావన ఎప్పుడూ సమానంగా ఉండాలి. తొలిరోజు ప్రేమ ఎలా ఉందో.. తర్వాత కూడా అదే కొనసాగించాలి. ప్రేమిస్తే పోయేదేముంది.. ప్రతిరోజూ ప్రేమించండి. ఇలాగే ఉండేలా చూసుకుంటే దాంపత్యంలో బోర్ కొట్టడం అసాధ్యం.

తదుపరి వ్యాసం