తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Saturday Motivation : మంచి రోజులు రావాలంటే.. చెడు రోజులతో పోరాడాలి

Saturday Motivation : మంచి రోజులు రావాలంటే.. చెడు రోజులతో పోరాడాలి

HT Telugu Desk HT Telugu

25 February 2023, 4:30 IST

google News
    • Saturday Thoughts : ఎన్ని రోజులు కష్టపడినా.. అలానే ఉందని.. జీవితం మీద చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు. ఇంకా ఎప్పుడు మంచి రోజులు వస్తాయోనని ఎదురుచూస్తుంటారు. అయితే మంచి రోజులు రావాలంటే.. ప్రస్తుతంలోని చెడు రోజులతో పోరాటం చేయాలి.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unsplash)

ప్రతీకాత్మక చిత్రం

Saturday Vibes : మంచి రోజులు రావాలి.. ఇదే అందరూ కోరుకుంటారు. అయితే మంచి రోజులు రావాలంటే.. ప్రస్తుతం ఉన్న చెడ్డ రోజులతో పోరాడటం మాత్రం మరిచిపోతారు. ప్రస్తుతం పోరాడుతేనే కదా.. భవిష్యత్ లో మంచి రోజులు వస్తాయి. ఇప్పటికిప్పుడూ మంచి రోజులు రావాలంటే కుదరదు. పోరాడితే పోయేదేముంది.. ప్రస్తుతంలో ఉన్న సమస్యలు తప్ప.

జీవితం అందరికీ ఒకేలా ఉండదు. కొంతమందికి తొందరగానే కలిసి వస్తుంది. కానీ కొంతమందికి మాత్రం ఎంత ప్రయత్నం చేసినా.. మంచి రోజులు రావు. అయితే వారిలో ప్రయత్నం లోపం కావొచ్చు. పోరాడే విధానం కరెక్టులేకపోవచ్చు. అందుకే.. ప్రస్తుతంలోని చెడ్డ రోజులతో పోరాడితేనే.. భవిష్యత్ లో మంచి రోజులు వస్తాయి. ఎవరో వస్తారు.. ఏదో చేస్తారు.. అనేది వట్టి మాటలు.., నీ కోసం ఎవరు రారు.., ఏదీ చెయరు.. నీ కోసం నువ్వనుకున్నది నువ్వే చేయ్.. అది ప్రయత్నం అయినా.. పోరాటం అయినా..

అయితే ఏ విషయంపైనైనా.. ఆరాటం కాదు.. పోరాటం ఉండాలి. ఆరాటం ఆశను మాత్రమే ఇస్తుంది.. పోరాటం విజయం వరకూ తీసుకెళ్తుంది. మంచి రోజుల కోసం.. ఎదురుచూడటం కాదు.. ప్రస్తుతం పోరాటం చేస్తూ ఉండాలి. అప్పుడే అనుకున్నది సాధించొచ్చు. అంతేగానీ.. మంచిరోజులు రావట్లేదు అంటే.. ఎప్పటికీ రావు. ప్రయత్నాలే మంచి భవిష్యత్ కు పునాది. ప్రయత్నం లేని జీవితం.. గమ్యం లేని ప్రయాణం లాంటిది. ప్రయత్నించాలి.. పోరాడాలి.

మంచి రోజుల కోసం వేచి చూస్తూ.. నేటిని వృథా చేయోద్దు. ఎలా ఈరోజును ఉపయోగిస్తే.. రేపటి మంచి రోజు అవుతుందో ఆలోచించాలి. చీకటి తర్వాత వెలుగు ఎలానో.. చెడ్డ రోజుల తర్వాత మంచిరోజులు అలానే వస్తాయి. చేయాల్సిందల్లా.. మీ ప్రయత్నాలు ఆపకుండా దూసుకెళ్లడమే.

అవతలి వారు.. నీ గురించి ఏమనుకుంటున్నారో అని మాత్రమే ఆలోచిస్తూ.. కూర్చుంటే.., నీ గురించి నువ్వు కూడా ఆలోచించుకోవడమే మర్చిపోతావ్.. ఇది నీ జీవితం.. నువ్వే ప్రయత్నించాలి.., నువ్వే పోరాడాలి.., నువ్వే గెలవాలి.

తదుపరి వ్యాసం