Saturday Motivation : నమ్మినవాళ్లను ఫూల్ చేస్తే.. ఫీల్ అయ్యేది మీ రిలేషన్షిప్!
01 April 2023, 4:30 IST
- April Fools Day : మిమ్మల్ని ఎవరైనా అతిగా నమ్మితే.. వాళ్లే ఫూల్ అయ్యేది. అయితే ఫూల్ చేయడం అనేది ఇద్దరికీ ఆనందాన్ని ఇవ్వాలి. కానీ కొంతమంది జీవితాంతం గుర్తుండేలా ఫూల్ చేస్తారు. ఇక్కడ దెబ్బతిని.. ఫీల్ అయ్యేది మీ బంధం.
ప్రతీకాత్మక చిత్రం
మీరు ఎవరినైనా.. ఈజీగా మోసం చేస్తున్నారంటే.. మీ అంత గొప్పొళ్లు లేరని అస్సలు ఫీల్ కాకండి. ఎదుటివ్యక్తి మిమ్మల్ని ఎంతగా నమ్మితే.. అంత ఈజీగా ఫూల్ అవుతారు. ఎదుటి వ్యక్తి ఏం తెలియనివాడు కాదు.. మీ మీద ఉన్న నమ్మకం వారిని ఫూల్ అయ్యేలా చేసింది. ఇద్దరికీ ఆనందాన్ని ఇచ్చే విషయాల మీద ఫూల్స్ చేసుకోండి. అది కాసేపు కామెడీగా ఉంటుంది. కానీ మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం బలయ్యేలా మాత్రం చేయకండి.
ఫ్రెండ్ర్ ను, ఇంట్లో వాళ్లను ఫూల్ చేసి.. ఆడుకోవడం ఓ సరదా. నీ ఒంటిపై ఏదో పడింది.. చూస్కో, నీ మెడలోని గోల్డ్ చెయిన్ ఏది, అమ్మో బల్లీ నీ పక్కనే ఉంది అంటూ.. ఫూల్స్ చేసుకోవడం ఓకే. అవి ఫన్నీగా ఉంటాయి. ఇద్దరూ కూర్చొని నవ్వుకొవచ్చు. కానీ జీవితాన్ని తలకిందులు చేసేలా.. మిమ్మల్ని నమ్మిన వారిని ఫూల్స్ చేస్తే.. మాత్రం.. కొన్నిరోజులు గడిచాక.. మిమ్మల్ని మీరు కూడా క్షమించుకోలేరు.
ఓ వ్యక్తిని నమ్మిస్తేనే మోసం చేస్తాం.. ఆ వ్యక్తి మనల్ని ఎంతగా నమ్మితే మీ చేతిలో మోసపోయి ఉంటారో ఒక్కసారి ఆలోచించుకోవాలి. మీరు తనకి హాని చేస్తున్నారని తెలిసినా తెలియకపోయినా మీ వల్ల వారికి హాని ఉందని తెలియక.. మీపైన నమ్మకంతో లేదా మీ మాటకు కట్టుబడి ఉంటారు. ఓ వ్యక్తిని మీరు మోసం చేస్తున్నారంటే.. మీపై వారు పెట్టుకున్న నమ్మకానికి మీరు అర్హులు కారు అని అర్థం.
కొందరు తమ జీవితంలో ఎదగాలని మోసం చేస్తే, మరికొందరు తప్పనిసరి పరిస్థితుల్లో మోసం చేస్తారు. కొందరు ప్రేమలో మోసం చేస్తారు. మోసం ఎలా చేసినా.. తప్పే. ఓ వ్యక్తి మీకున్న అర్హత కంటే ఎక్కువగా మిమ్మల్ని నమ్మితే వారి నమ్మకాన్ని నిలబెట్టుకోకపోయినా పర్లేదు. వారిని మాత్రం ఫూల్ చేసి.. ముంచకండి. దీని ద్వారా ఓ ముఖ్యమైన బంధానికి మీరు దూరమవుతారు. అంటే.. మిమ్మల్ని.. మిమ్మల్నిగా ఇష్టపడిన వ్యక్తికి మీరు దూరమవుతారు. ఇక ఆ వ్యక్తి జీవితంలో ఎవరినీ నమ్మలేరు.
నువ్వు ఎవరినైనా మోసం చేయగలిగావంటే.. దాని అర్థం మోసపోయినవారు.. చేతగాని వారు అని అర్థం కాదు.. మీ స్థాయికి మించి మిమ్మల్ని నమ్మారని అర్థం.
తెలియని వాళ్లు మోసం చేస్తే.. తెలియకుండానే మర్చిపోతాం.. మనసుకి నచ్చినవాళ్లు మోసం చేస్తే.. మరణించేదాక మర్చిపోలేం..
అందుకే.. ఏ బంధంలోనైనా.. జీవితకాలం ఉండేది నమ్మకం. ఆ నమ్మకాన్ని పొగొట్టేలా మోసం చేస్తే.. మీ బంధం నాశనం అవుతుంది. బంధానికి మించి విలువైనది ఏదీ లేదు. ఏ విషయంలోనైనా.. మీరు ఫూల్ చేస్తే.. ముందుగా ఫీల్ అయ్యేది బంధమే. ఆ బంధం ఫీల్ అయితే.. ఆ వ్యక్తి మీకు జీవితంలో దగ్గరకు రాకుండా ఉంటారు. అందుకే బంధాన్ని నాశనం చేసేలా ఫూల్స్ చేయకండి.