Teachers Day 2024: ఇరవై ఏడు సార్లు నోబెల్ బహుమతికి నామినేట్ అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్
05 September 2024, 9:18 IST
- Teachers Day 2024: సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం . ప్రపంచంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటామో, దాని చరిత్ర ఏంటో తెలుసుకోవాలి. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
సర్వేపల్లి రాధాకృష్ణన్
ఉపాధ్యాయ దినోత్సవం 2024: మనదేశంలో సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటాం. నెల రోజుల తర్వాత అక్టోబర్ 5న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. భారతదేశంలో సెప్టెంబర్ 5న నిర్వహించుకుంటే, ప్రపంచం మాత్రం అక్టోబర్‌లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించుకుంటుంది.
టీచర్స్ డే 2024 చరిత్ర
భారత తొలి ఉపరాష్ట్రపతి, రెండో రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటాం. ఆయన గొప్ప తత్వవేత్త, పండితుడు. 1954 లో భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్న మరియు 1963 లో బ్రిటిష్ రాయల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ గౌరవ సభ్యత్వం పొందారు.
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888 సెప్టెంబర్ 5న మద్రాసు ప్రెసిడెన్సీలో జన్మించారు. కలకత్తా విశ్వవిద్యాలయం, ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ప్రొఫెసర్ గా పనిచేశారు. అతను గొప్ప రచయిత. అమెరికా, ఐరోపా అంతటా తన ఉపన్యాసాల ద్వారా చదువుపై అవగాహన కల్పించారు.
1962లో రాధాకృష్ణన్ రాష్ట్రపతి అయినప్పుడు సెప్టెంబర్ 5న ఆయన జన్మదినాన్ని నిర్వహించుకోవాలని కొందరు విద్యార్థులు ఆయనను కలిశారు. అయితే విద్యార్థులకు ఉపాధ్యాయులకు అంకితం చేయాలని ఆయన సూచించారు. దీంతో సెప్టెంబర్ 5వ తేదీని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటారు.
ఉపాధ్యాయ దినోత్సవం 2024 ప్రాముఖ్యత
భారతీయ సంస్కృతిలో గురు శిష్యుల అనుబంధం గొప్పది. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించడమే కాకుండా ఉపాధ్యాయుల అంకితభావాన్ని, కృషిని కూడా ఈరోజ గౌరవిస్తుంది. విద్యార్థులు తమ కృతజ్ఞతను వ్యక్తం చేసే అవకాశం ఈ రోజు వారికి దక్కుతుంది. ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండేలా చూసేందుకు కూడా ఈ ప్రత్యేక దినోత్సవం ఉపయోగపడుతుంది.
టీచర్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి?
దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు. విద్యార్థులు ప్రసంగాలు, పాటలు, సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా ఉపాధ్యాయులకు ధన్యవాదాలు చెబుతారు. పాఠశాలల్లో సీనియర్ విద్యార్థులు టీచర్లుగా వేషాలు ధరించి జూనియర్ క్లాసులు నిర్వహించడం సర్వసాధారణం. విద్యార్థులు తమ ఉపాధ్యాయులకు బహుమతులు, కార్డులు, పూలను ప్రశంసా సూచకంగా అందజేస్తారు.
రాధాకృష్ణన్ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు ఆయనను వరించాయి. ఇప్పటివరకు ఆయన ఎన్నోసార్లు నోబెల్ బహుమతికి నామిన్ అయ్యారు. అతను సాహిత్యంలో నోబెల్ బహుమతికి 27 సార్లు నామినేట్ అయ్యారు. అందులో 16 సార్లు సాహిత్య విభాగంలో, 11 సార్లు నోబెల్ శాంతి విభాగంలో నామినేట్ అయ్యారు.
టాపిక్