తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  భారీగా తగ్గిన Samsung Galaxy A53 5g స్మార్ట్‌ఫోన్‌ ధరలు, ఇప్పుడు ధర ఎంతంటే?!

భారీగా తగ్గిన Samsung Galaxy A53 5G స్మార్ట్‌ఫోన్‌ ధరలు, ఇప్పుడు ధర ఎంతంటే?!

HT Telugu Desk HT Telugu

24 August 2022, 23:17 IST

    • శాంసంగ్ కంపెనీ తమ పాపులర్ మోడల్ Galaxy A53 5G స్మార్ట్‌ఫోన్‌ ధరను భారీగా తగ్గించింది. కొత్త ధరలు ఎలా ఉన్నాయి, ఈ ఫోన్లో ఫీచర్లు ఏమున్నాయో తెలుసుకోండి.
Samsung Galaxy A53 5G
Samsung Galaxy A53 5G

Samsung Galaxy A53 5G

శాంసంగ్ కంపెనీ వరుసగా తమ బ్రాండ్ నుంచి విడుదలైన కొన్ని పాత ప్రొడక్టుల ధరలను తగ్గిస్తూ వస్తోంది. కొన్ని నెలల క్రితం మార్కెట్లో Galaxy A53 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇప్పుడు ఈ ఫోన్‌ ధరలను కంపెనీ భారీగా తగ్గించింది. Samsung Galaxy A53 5G స్మార్ట్‌ఫోన్‌ RAM, స్టోరేజ్ ఆధారంగా రెండు కాన్ఫిగరేషన్‌లలో లాంచ్ అయింది. ఇందులో బేస్ వేరియంట్ అయిన 6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 34,499 /- , అలాగే రెండో వేరియంట్ అయిన 8GB + 128GB ధర రూ. 35,999గా ఉండేది. ప్రస్తుతం ఈ రెండు వేరియంట్లపై ఏకంగా రూ. 3000 డిస్కౌంట్ ప్రకటించింది. ఈ తగ్గింపుతో Samsung Galaxy A53 5G వేరియంట్‌ల ధరలు వరుసగా ఇప్పుడు రూ. 31,499 అలాగే రూ. 32,999కు పడిపోయాయి.

ట్రెండింగ్ వార్తలు

Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ రోజున బంగారం ఎందుకు కొంటారు?

Mothers day 2024 Gift Ideas: మదర్స్ డే రోజు మీ అమ్మకు మర్చిపోలేని ఇలాంటి అందమైన బహుమతిని ఇవ్వండి

Carrot Milkshake: మండే ఎండల్లో టేస్టీ క్యారెట్ మిల్క్ షేక్ ఇది, ఎంతో ఆరోగ్యం కూడా

World lupus day 2024: శరీరంలోని అన్ని అవయవాలపై దాడి చేసే వ్యాధి లూపస్, ఇదొక విచిత్రమైన ఆరోగ్య సమస్య

ఈ స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, క్రోమాతో పాటు శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్ నుంచి డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేయవచ్చు. Samsung Galaxy A53 5G ఆసమ్ బ్లాక్, ఆసమ్ వైట్, ఆసమ్ పీచ్, ఆసమ్ బ్లూ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. అద్భుతమైన పనితీరు కారణంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ మధ్య-శ్రేణి స్మార్ట్‌ఫోన్ విభాగంలో బాగా ప్రాచుర్యం పొందింది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో మరోసారి పరిశీలించండి.

Samsung Galaxy A53 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.5-అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లే
  • 6GB/8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్
  • ఎక్సినోస్ 1280 ప్రాసెసర్
  • వెనకవైపు 64MP+12MP+5MP+5M క్వాడ్ కెమెరా, ముందు భాగంలో 32MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 25W ఫాస్ట్ ఛార్జర్

Samsung Galaxy A53లో ఇంకా అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ , కనెక్టివిటీ కోసం5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్, GPS/ A-GPS, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి తదితర ఫీచర్లు ఉన్నాయి.

టాపిక్