తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  రూ.10 వేల దిగువకు పడిపోయిన Samsung Galaxy A03 స్మార్ట్‌ఫోన్‌ ధర!

రూ.10 వేల దిగువకు పడిపోయిన Samsung Galaxy A03 స్మార్ట్‌ఫోన్‌ ధర!

HT Telugu Desk HT Telugu

25 August 2022, 22:51 IST

    • శాంసంగ్ తాజాగా Galaxy A04 అనే సరికొత్త ఫోన్ విడుదల చేసింది, ఈ క్రమంలో Galaxy A03 ధరను తగ్గించింది. ఎంతవరకు తగ్గింది, ఇందులోని ఫీచర్లు తెలుసుకోండి.
Samsung Galaxy A03
Samsung Galaxy A03

Samsung Galaxy A03

ఏదైనా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసే ముందు ఆ సెగ్మెంట్లోని ఇతర హ్యాండ్‌సెట్ల ధరలను శాంసంగ్ కంపెనీ తగ్గిస్తూ వస్తోంది. కొత్త మోడల్స్ ను పరిచయం చేస్తూనే, పాత మోడల్స్ సేల్స్ పడిపోకుండా ఈ టెక్ కంపెనీ ఇటీవల కాలంగా ఈ వ్యూహాన్ని అనుసరిస్తూ వస్తోంది. ఇప్పటికే చాలా మోడల్స్ ధరలను తగ్గించింది. ప్రత్యేకంగా A-సిరీస్‌లో ఎక్కువగా ఈ తగ్గుదల కనిపిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Night Time Ice Cream : రాత్రిపూట ఐస్‌క్రీమ్ తినడం రొమాంటిక్ అనుకోకండి.. మెుత్తం ఆరోగ్యం మటాష్!

Walking Without Footwear : కొంతమంది చెప్పులు లేకుండా నడుస్తారు.. ఎందుకని ఆలోచించారా?

Cucumber Lassi Benefits : దోసకాయ లస్సీ.. 5 నిమిషాల్లో రెడీ.. శరీరాన్ని చల్లబరుస్తుంది

International Tea Day : ఇంటర్నేషనల్ టీ డే.. టీ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసుకోండి

శాంసంగ్ కొత్తగా Samsung Galaxy A04 స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో అంతకుముందు మోడల్ అయినటువంటి Galaxy A03 ధరను తగ్గించింది. ఇప్పుడు ఈ ఫోన్ రూ. 10 వేలలోపు ధరకే లభిస్తోంది.

Samsung Galaxy A03 ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ఒక బడ్జెట్ ఫోన్. ఇది రెండు కాన్ఫిగరేషన్లలో విడుదలైంది. విడుదల సమయంలో 3GB RAM వేరియంట్ ధర రూ. 10,499/- ఉండగా.. ఇప్పుడు ఇది రూ. 9,514/-కే లభిస్తుంది. అలాగే 4GB RAM అసలు ధర రూ. 11,999 కాగా, ఇప్పుడు ఇది రూ. 11,014/- కే లభిస్తుంది. అంటే ఒక్కో వేరియంట్ మీద రూ. 1000 వరకు తగ్గింపునిచ్చింది అదనంగా బ్యాంక్ ఆఫర్లు ఉంటాయి. ఇప్పుడు Galaxy A03 ఫోన్‌ను తగ్గింపు ధరకే కొనుగోలు చేయటానికి అందుబాటులో ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయో మరోసారి ఇక్కడ తెలుసుకోండి.

Samsung Galaxy A03 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 60Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగిన 6.5-అంగుళాల HD+ డిస్‌ప్లే
  • 3GB RAM/4GB RAM, 32GB/64GB ఇంటర్నల్ స్టోరేజ్+ 1TB
  • ఆక్టా-కోర్ యునిసోక్ T606 ప్రాసెసర్
  • వెనకవైపు 48MP+2MP డ్యుఎల్ కెమెరా, ముందు భాగంలో 5MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000mAh బ్యాటరీ సామర్థ్యం

ఇది బ్లూ, బ్లాక్, రెడ్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. శాంసంగ్ కంపెనీ తమ Samsung Galaxy A53 స్మార్ట్‌ఫోన్‌ ధరను కూడా రూ. 3వేల వరకు తగ్గించింది. ఇది మిడ్-రేంజ్ ఫోన్, ట్రెండ్ ప్రకారం ఈ సెగ్మెంట్లో కూడా త్వరలో కొత్త మోడల్ పరిచయం చేసే అవకాశం ఉంది.

టాపిక్

తదుపరి వ్యాసం