తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Doogee S89 Pro । 12000mah భారీ బ్యాటరీతో వచ్చిన కఠినమైన డూగీ స్మార్ట్‌ఫోన్‌..!

Doogee S89 Pro । 12000mAh భారీ బ్యాటరీతో వచ్చిన కఠినమైన డూగీ స్మార్ట్‌ఫోన్‌..!

HT Telugu Desk HT Telugu

24 August 2022, 15:20 IST

    • డూగీ మొబైల్స్ నుంచి భారీ బ్యాటరీ సామర్థ్యం కలిగిన Doogee S89 Pro అనే స్మార్ట్‌ఫోన్‌ విడుదలైంది. ఇది మొదట బుక్ చేసుకున్న కస్టమర్లకు ఈ ఫోన్ ధరపై 50 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. మరిన్ని వివరాలు చూడండి.
Doogee S89 Pro
Doogee S89 Pro

Doogee S89 Pro

చైనాకు చెందిన రగ్గ్‌డ్ స్మార్ట్‌ఫోన్‌ మేకర్ డూగీ మొబైల్స్ తాజాగా Doogee S89 Pro అనే సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ కఠినమైన కవచంతో దృఢమైన డిజైన్ కలిగి ఉంది. ఇది 12000mAh సామర్థ్యం కలిగిన భారీ బ్యాటరీ అలాగే 65W ఫాస్ట్ ఛార్జర్‌తో వచ్చిన మొట్టమొదటి రగ్గ్‌డ్ స్మార్ట్‌ఫోన్‌. మామూలుగా వాడితే ఈ ఫోన్ బ్యాటరీ 3 రోజుల వరకు బ్యాకప్ అందిస్తుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 16 గంటలపాటు గేమింగ్‌ను కొనసాగించవచ్చు లేదా 18 గంటలపాటు నిరంతరాయమైన వీడియో స్ట్రీమింగ్‌ను ఆనందించవచ్చునని కంపెనీ తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు

Soya matar Curry: సోయా బఠాని కర్రీ వండారంటే మటన్ కీమా కర్రీ కన్నా రుచిగా ఉంటుంది, ఇలా వండేయండి

Fruits in Refrigerator: ఈ పండ్లను ఫ్రిజ్‌లో పెట్టకూడదు, అయినా వాటిని పెట్టి తినేస్తున్నాం

Egg Kofta: ఎగ్ కోఫ్తా వండుకుంటే సాయంత్రం స్నాక్స్‌గా అదిరిపోతుంది, పిల్లలకు నచ్చడం ఖాయం

Periods: పీరియడ్స్ డేట్ కన్నా ముందే రావాలనుకుంటున్నారా ఈ ఇంటి చిట్కాలను పాటించండి

ఈ సరికొత్త Doogee S89 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను ఆన్‌లైన్‌లో AliExpress అలాగే Doogemal వెబ్‌సైట్లలో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటుంది. ప్రమోషనల్ ఆఫర్‌ కింద ఆగస్టు 26 లోపు కొనుగోలు చేసే వారికి ఫోన్ ధరలో ఏకంగా 50 శాతం తగ్గింపును కంపెనీ ప్రకటించింది. అయితే ఇది ఆర్డర్ చేసిన మొదటి 200 మంది కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ప్రస్తుతం Doogee S89 Pro స్మార్ట్‌ఫోన్‌ ధరను $459.98 (దాదాపు రూ. 36,800)గా కంపెనీ నిర్ణయించింది. మొదటి 200 కస్టమర్లు ఈ ఫోన్‌ను సగం ధరకే అనగా $229.99 (సుమారు రూ. 18,400) కే పొందవచ్చు.

మరి ఈ ఫోన్లలో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకోండి.

Doogee S89 Pro స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 6.3 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లే
  • 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్
  • ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో P90 ప్రాసెసర్
  • వెనుకవైపు 64MP+ 20MP + 8MP ట్రిపుల్ కామ్ సెటప్‌, ముందువైపు 16MP సెల్ఫీ షూటర్
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 12000mAh బ్యాటరీ సామర్థ్యం, 65W ఫాస్ట్ ఛార్జర్‌

కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.1, FM రేడియో, OTG, గ్లోనాస్, గెలీలియో, బీడౌ సపోర్ట్‌తో GPS వంటి ఫీచర్లు ఉన్నాయి.

టాపిక్

తదుపరి వ్యాసం