Samsung Galaxy A04 । శాంసంగ్ నుంచి మరొక బడ్జెట్ ఫోన్, ఫీచర్లు ఇలా ఉన్నాయి!-samsung galaxy a04 smartphone unveiled check price details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Samsung Galaxy A04 Smartphone Unveiled, Check Price Details

Samsung Galaxy A04 । శాంసంగ్ నుంచి మరొక బడ్జెట్ ఫోన్, ఫీచర్లు ఇలా ఉన్నాయి!

HT Telugu Desk HT Telugu
Aug 24, 2022 06:07 PM IST

శాంసంగ్ కంపెనీ తాజాగా Samsung Galaxy A04 అనే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీనిలో ఫీచర్లు ఎలా ఉన్నాయో? ఇక్కడ తెలుసుకోండి.

Samsung Galaxy A04
Samsung Galaxy A04

దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ తమ A-సిరీస్‌లో మరొక సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. Samsung Galaxy A04 పేరుతో విడుదలైన ఈ ఫోన్‌లో 50MP ప్రైమరీ సెన్సార్ కలిగిన డ్యుఎల్-రియర్ కెమెరా సెటప్, పెద్ద బ్యాటరీ వంటివి ప్రధాన హైలైట్లుగా ఉన్నాయి. ఈ ఫోన్ గతేడాది విడుదలైన Galaxy A03కి సక్సెసర్. మళ్లీ కొన్ని నెలల తర్వాత శాంసంగ్ కంపెనీ నిశ్శబ్దంగా సరికొత్తగా Galaxy A04ను తీసుకొచ్చింది. ఇందులో కూడా దాదాపు అవే రకమైన ఫీచర్లు కనిపిస్తున్నాయి. అయితే కొద్దిగా అప్డేట్ అయింది.

కాగా, శాంసంగ్ తమ Galaxy A04కు సంబంధించిన కొన్ని వివరాలను అస్పష్టంగా ఉంచింది. ఈ ఫోన్ పేరులేని ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది Exynos 850 SoC వలె కనిపిస్తుంది. Samsung Galaxy A04 మూడు కాన్ఫిగరేషన్లలో లభించనుంది. గరిష్టంగా 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంది, దీనిని మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు విస్తరించుకోవచ్చు.

Galaxy A04 వైట్, బ్లాక్, గ్రీన్, కాపర్.. ఈ నాలుగు కలర్ ఆప్షన్‌లలో లభ్యమవనుంది. ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి. ధర ఎంత? తదితర వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Samsung Galaxy A04 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 60Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగిన 6.5-అంగుళాల HD+ ఇన్ఫినిటీ-V డిస్‌ప్లే
  • 4GB/6GB/8GB ర్యామ్, 32/64/128 GB ఇంటర్నల్ స్టోరేజ్
  • ఆక్టా-కోర్ ఎగ్జినోస్ 850 ప్రాసెసర్*
  • వెనకవైపు 50MP+2MP డ్యుఎల్ కెమెరా, ముందు భాగంలో 5MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000mAh బ్యాటరీ సామర్థ్యం

కనెక్టివిటీ పరంగా Galaxy A04లో 4G, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, GPS, హెడ్‌ఫోన్ జాక్, USB టైప్-సి పోర్ట్ వంటివి ఉన్నాయి. ఇందులో 5G కనెక్టివిటీ లేదు. శాంసంగ్ దీని ధరను ఇంకా ప్రకటించలేదు. కానీ ఫీచర్లను బట్టి చూస్తే ఇది బడ్జెట్ ధరలోనే లభించే ఫోన్‌ అని అర్థం అవుతుంది. లీక్స్ ప్రకారం సుమారు రూ. 13 వేల ధరలో లభించవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్