Samsung నుంచి A-సిరీస్‌లో మరో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు-samsung launched galaxy a13 a23 smartphones ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Samsung Launched Galaxy A13 & A23 Smartphones

Samsung నుంచి A-సిరీస్‌లో మరో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

HT Telugu Desk HT Telugu
Mar 27, 2022 01:11 PM IST

Samsung తాజాగా Galaxy A13, A23 అనే స్మార్ట్‌ఫోన్‌లను భారత మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది. కొద్ది పాటి మార్పులు మినహా ఈ రెండు ఫోన్లలో ఫీచర్లు దాదాపు ఒకేరకంగా ఉన్నాయి. రూ. 14,999 నుంచి ధరలు ప్రారంభమవుతున్నాయి

Samsun Galaxy A13 & A23 Smartphones
Samsun Galaxy A13 & A23 Smartphones (Samsung)

Samsung ఇటీవల ఆవిష్కరించిన Galaxy A13, A23 లను భారత మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది. డిజైన్ పరంగా ఒకే విధంగా ఉన్న ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు మధ్య-శ్రేణి ధరల విభాగంలో రూ. 20 వేల బడ్జెట్లో ఉన్నాయి. A13, A23 రెండూ కూడా 5,000mAh బ్యాటరీలు మరియు 50MP ప్రైమరీ సెన్సార్‌లను కలిగి ఉన్నాయి.

ర్యామ్ స్టోరేజ్ ఆధారంగా A13 మోడెల్ స్మార్ట్‌ఫోన్‌ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉండగా, A23 మోడెల్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

మరి ఈ రెండు ఫోన్ల మధ్య తేడాలు ఏమున్నాయి? వాటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఇక్కడ చూడండి.

Samsung A13 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

6.6 అంగుళాల ఫుల్ HD డిస్‌ప్లే

ర్యామ్- స్టోరేజ్ కాన్ఫిగరేషన్స్: 4GB/64GB, 4GB/128 GB అలాగే 6GB/128GB

ఎగ్జినోస్ 850 ప్రాసెసర్

వెనకవైపు 50 మెగా పిక్సెల్ కెమెరా + 2MP డెప్త్ సెన్సార్; ముందు భాగంలో 8MP సెల్ఫీ షూటర్‌

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్

5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 25W ఫాస్ట్ ఛార్జర్

ధర రూ. 14,999/- నుంచి ప్రారంభం

4GB/64GB వేరియంట్ ధర రూ. 14,999/-

 4GB/128GB వేరియంట్ ధర రూ. 15,999/-

6GB/128GB వేరియంట్ ధర రూ. 17,499/-

Samsung A23 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

6.6 అంగుళాల ఫుల్ HD డిస్‌ప్లే

ర్యామ్- స్టోరేజ్ కాన్ఫిగరేషన్స్: 6GB/128GB & 8GB/128GB

స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్

వెనకవైపు 50 మెగా పిక్సెల్ కెమెరా, 4K వీడియో, ముందు భాగంలో 8MP సెల్ఫీ షూటర్‌

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్

5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 25W ఫాస్ట్ ఛార్జర్

ధర రూ. 19,499/- నుంచి ప్రారంభం

6GB/128GB వేరియంట్ ధర రూ. 19,499/-

8GB/128GB వేరియంట్ ధర రూ. 20,999/-

ఈ స్మార్ట్‌ఫోన్లు బ్లాక్, వైట్, లైట్ బ్లూ, ఆరెంజ్ కలర్ ఛాయిస్ లలో లభిస్తున్నాయి. ముఖ్య విషయం ఏంటంటే ఈ రెండు ఫోన్లు 5G సపోర్ట్ చేయవు.

WhatsApp channel

సంబంధిత కథనం