తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Rudraksha | రుద్రాక్షలు ధరించినప్పుడు ఈ నియమాలు పాటిస్తున్నారా?

Rudraksha | రుద్రాక్షలు ధరించినప్పుడు ఈ నియమాలు పాటిస్తున్నారా?

28 February 2022, 17:40 IST

google News
  • హిందూ సనాతన ధర్మంలో రుద్రాక్షకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. రుద్రాక్షను శివునిలో భాగంగా భావిస్తారు. ఆధ్యాత్మిక, దైవిక శక్తులతో నిండి ఉన్నదిగా పరిగణిస్తారు. రుద్రాక్ష శివుని కన్నీటి నుంచి ఉద్భవించిందని విశ్వసిస్తారు.

రుద్రాక్ష మాల
రుద్రాక్ష మాల (unsplash)

రుద్రాక్ష మాల

పవిత్రమైన రుద్రాక్ష ధరించడం ద్వారా శివుని అనుగ్రహం లభిస్తుందని, ప్రతికూల శక్తులు దూరమవుతాయని విశ్వాసం.  అయితే ఎప్పుడు రుద్రాక్షను ధరించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

- రుద్రాక్ష ధరించి అంత్యక్రియలు, శవ ఊరేగింపు లేదా దహన సంస్కారాలు లాంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదని పురాణాలు చెబుతున్నాయి. తప్పనిసరిగా పాల్గొనాల్సి వస్తే మీ వద్ద ఉన్న రుద్రాక్షను తీసేయండి. శివుడు జనన, మరణాలకు అతీతుడు. ఆయన భాగమైన రుద్రాక్షను జీవన, మరణాలకు సంబంధించిన ప్రదేశాల్లో ధరించకూడదని అంటారు.

- రుద్రాక్షను ధరించిన వ్యక్తి మాంసం, మద్యం తీసుకోకూడదు. లేదంటే ప్రతికూల ప్రభావం కలుగుతుందని నమ్మకం.

- నిద్రపోయే ముందు రుద్రాక్షను తీసేయాలి. ఈ సమయంలో శరీరం బలహీనంగా, అపవిత్రంగా ఉంటుందని నమ్ముతారు. రుద్రాక్షను దిండు కింద ఉంచుకుని పడుకోవడం వల్ల ప్రశాంతత లభిస్తుందని, చెడు కలలు రావని నమ్మకం.

- మరొకరు ధరించిన రుద్రాక్షను ఎప్పుడూ ధరించవద్దు. ఇతరులకు మన రుద్రాక్ష ఇవ్వకూడదు. 

- ఎప్పుడూ నల్ల దారంతో రుద్రాక్షను ధరించకూడదు. ఎరుపు లేదా పసుపు దారంతో రుద్రాక్షను ధరించాలి.

ఎవరు ఎటువంటి రుద్రాక్షలు ధరించాలి?

రుద్రాక్షలు 21 రకాలు. ఒక్కొక్క నక్షత్రాన్ని బట్టి వారు ఒక్కో రకం రుద్రాక్షను ధరించాల్సి ఉంటుంది.

నక్షత్రము - ధరించవలసిన రుద్రాక్ష

అశ్వని - నవముఖి

భరణి - షణ్ముఖి

కృత్తిక - ఏకముఖి, ద్వాదశముఖి

రోహిణి - ద్విముఖి

మృగశిర - త్రిముఖి

ఆరుద్ర - అష్టముఖి

పునర్వసు - పంచముఖి

పుష్యమి - సప్తముఖి

ఆశ్లేష - చతుర్ముఖి

మఖ - నవముఖి

పుబ్బ - షణ్ముఖి

ఉత్తర - ఏకముఖి, ద్వాదశముఖి

హస్త - ద్విముఖి

చిత్త - త్రిముఖి

స్వాతి - అష్టముఖి

విశాఖ - పంచముఖి

అనురాధ - సప్తముఖి

జ్యేష్ఠ - చతుర్ముఖి

మూల - నవముఖి

పూర్వాషాఢ - షణ్ముఖి

ఉత్తరాషాఢ - ఏకముఖి, ద్వాదశముఖి

శ్రవణం - ద్విముఖి

ధనిష్ట - త్రిముఖి

శతభిషం - అష్టముఖి

పూర్వాభాద్ర - పంచముఖి

ఉత్తరాభాద్ర - సప్తముఖి

రేవతి - చతుర్ముఖి

రుద్రాక్ష ధరించే ముందు "ఓం, క్ష్రీం హ్రీం క్షాం వ్రీం ఓం' అనే మంత్రాన్ని పదకొండుసార్లు పఠించాలి.

తదుపరి వ్యాసం