తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Rice Dosa Recipe : కేవలం బియ్యంతోనే.. అదిరే దోశలను చేసేయండిలా..

Rice Dosa Recipe : కేవలం బియ్యంతోనే.. అదిరే దోశలను చేసేయండిలా..

17 December 2022, 7:15 IST

google News
    • Ghavan Dosa Recipe : మినపప్పుతో చేసే దోశలు గురించి అందరికీ తెలుసు. అయితే కేవలం బియ్యంతోనే దోశలు చేయవచ్చు తెలుసా? మహారాష్ట్రలో దీనిని సాంప్రదాయ అల్పాహారంగా సేవిస్తారు. ఇది నీర్ దోసలాగే ఉంటుంది.
బియ్యంతోనే దోశలు
బియ్యంతోనే దోశలు

బియ్యంతోనే దోశలు

Rice Dosa Recipe : కేవలం బియ్యంతో దోశలు వేయడం గురించి ఎప్పుడైనా విన్నారా? అయితే మీరు మహారాష్ట్రలో చేసే ఘవన్ గురించి తెలుసుకోవాల్సింది. కేవలం బియ్యంతోనే.. తయారు చేసే ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. దీనిని తయారు చేసుకోవడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. అయితే వీటిని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో.. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* బియ్యం - మీకు దోశ బ్యాటర్ కావాల్సినంత

* ఉప్పు - రుచికి తగినంత

* నూనె - సరిపడినంత

తయారీ విధానం

బియ్యాన్ని 5 గంటలు నానబెట్టుకోవాలి. అనంతరం దానిని మెత్తగా రుబ్బి.. ఉప్పు, నీళ్లు పోసి.. పిండిలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు నాన్ స్టిక్ తవాను వేడి చేసి.. దానిపై దోశపిండిని వేయాలి. అంచులకు నూనె వేసి.. నెమ్మదిగా ఉడకనివ్వండి. మీకు నచ్చిన చట్నీతో.. హ్యాపీగా దోశలు లాగించేయవచ్చు.

తదుపరి వ్యాసం