తెలుగు న్యూస్  /  Lifestyle  /  Results Are From 2022 April To 2023 March For Pisces Horoscope

Pisces Horoscope | మీనరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఎలా ఉంటుందంటే..

HT Telugu Desk HT Telugu

01 April 2022, 18:21 IST

    • మీన రాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం నందు ఎలా ఉండబోతుంది. కొత్త సంవత్సరంలో ఈ రాశివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? వారి ఆర్థికపరిస్థితి, ఆరోగ్య స్థితి ఎలా ఉంటుంది. శ్రీ శుభకృత్​ నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా మీన రాశి గురించి తెలుసుకుందాం.
మీన రాశి
మీన రాశి

మీన రాశి

Ugadi Panchangam | పూర్వాభాద్ర - 4వ పాదము, ఉత్తరభాద్ర - 1,2,3,4 పాదములు, రేవతి- 1,2,3,4 పాదములు

* ఆదాయం - 2

* వ్యయం - 8

* రాజ్యపూజ్యం - 1

* అవమానం - 7

శ్రీ శుభకృత్ నామసంవత్సరం నందు చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా ఈ సంవత్సరం బృహస్పతి 1వ స్థానమందు సంచరించుట, శని 12వ స్థానము, వక్రియై 11వ స్థానమునందు సంచరించుట, రాహువు ధన స్థానమగు 2వ స్థానమునందు సంచరించుట, కేతువు 8వ స్థానమునందు సంచరించుట చేత మీనరాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ నుంచి శుభ ఫలితములు ఉన్నవి. మీనరాశి వారికి రాహువు కేతువు ప్రభావం చేత ఈ సంవత్సరం ఉద్యోగంలో మధ్యస్థ పరిస్థితులు ఏర్పడటం, వ్యాపారములందు చికాకులు, గొడవలు అధికముగా ఉండటం జరుగును. 2వ ఇంట రాహువు ప్రభావముచేత కుటుంబంలో భేదాభిప్రాయములు, ఉద్యోగము నందు కలహములు, అనారోగ్య సమస్యలు కలుగును.

ఏప్రిల్ నుంచి డిసెంబర్ సమయంలో శని పరంగా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడును. బృహస్పతి 1వ స్థానములో సంచరించుట వల్ల అనారోగ్యసమస్యలు, మానసిక ఆందోళనలు అధికమగును. 1వ స్థానమునందు బృహస్పతి ప్రభావం చేత మీనరాశి వారికి ఈ సంవత్సరం ధన విషయంలో ఖర్చులు అధికముగా అవ్వడం, అనారోగ్య సమస్యలు, మానసిక ఆందోళనలు అధికమగును. అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈ సంవత్సరం మీనరాశి వారికి ఉద్యోగ, వ్యాపారములలో మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. కుటుంబము నందు ఘర్షణలు ఉంటాయి.

<p>చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ</p>

మీన రాశివారికి ఏప్రిల్ 2022 నుంచి డిసెంబర్ 2022 వరకు అనుకూలముగా ఉన్నది. జనవరి 2023 నుంచి ఏప్రిల్ 2023 మధ్య ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం కన్నా వ్యయం అధికముగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది. వ్యాపారస్తులకు ఇబ్బందితో కూడినటువంటి కాలం. మీనరాశి ఉద్యోగస్తులకు మధ్యస్థ ఫలితములు ఉన్నవి. విద్యార్థులు కష్టపడాల్సిన సమయం. స్త్రీలకు మధ్యస్థ సమయం, అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. మీనరాశి వారికి అనారోగ్య సూచనలున్నాయి. వాహనాల మీద ప్రయాణించేప్పుడు జాగ్రత్త వహించవలెను. ప్రమాదములకు లోనయ్యే పరిస్థితి ఉంది. రైతులకు, సినీరంగం వారికి మధ్యస్థ ఫలితములు ఏర్పడును. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అనుకూలంగా లేదు. మీన రాశి వారు మరింత శుభఫలితాలు పొందాలి అనుకుంటే.. శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రము పఠించండం, గురువారం దత్తాత్రేయుని పూజించడం, శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించడం మంచిది.

మాసవారి ఫలితములు

ఏప్రిల్ - ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. అనవసర గొడవలు, దూర ప్రయాణములు చేస్తారు. ఆర్థిక విషయాలు బాగుంటాయి. నూతన వస్తు వాహన, వస్త్రాభరణ లాభములు.

మే - ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. బంధు మిత్రులతో విరోధములు, ఆదాయం తగ్గుదల, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రతికూలము. సంతానమునకు అభివృద్ధి. గృహెపకరణాలు కొనుగోలు, విలాస జీవితం, శారీరక, మానసిక కోరికలు తీరుతాయి.

జూన్ - ఈ మాసం అనుకూలంగా మీకు ఉంది. సంతానమునకు, సోదరులకు శుభములు. వృధా ఖర్టులు, ఆత్మీయుల ఎడబాటు, మానసిక ఆందోళన, పోటీల్లో విజయం సాధిస్తారు.

జూలై - ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. శారీరక, మానసిక అలసట, అయినవారితో చికాకులు. పాత పనులు పూర్తి చేస్తారు.

ఆగస్టు - ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. మానసిక ఆందోళన, సంతానానికి, తల్లిదండ్రులకు చెడు కాలము. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. మాసం చివరలో పరిస్థితులు మెరుగుపడును.

సెప్టెంబర్ - ఈ మాసంలో మధ్యస్థ ఫలితములు ఉన్నవి. సంఘంలో గౌరవం, శారీరక సౌఖ్యం, సంతాన విషయంలో అనుకూల పరిస్థితులు, వస్త్రాభరణ లాభములుండును. చేయి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధి ఉండను.

అక్టోబర్ - ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. గృహమునందు శుభకార్యములు జరుగును. స్త్రీ మూలకంగా గొడవలు, సుఖశాంతులు లేకపోవుట. పనులకు ఆటంకములు కలుగును. తీవ్ర కష్టనష్టాలకు లోనవుతారు.

నవంబర్ - ఈ మాసం మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. కష్టాలు తొలగి కోరికలు ఫలిస్తాయి. బంధుమిత్రుల సహాయం అందిస్తారు. అనారోగ్య తీవ్రత తగ్గుతుంది. ఆర్థికంగా తృప్తికరంగా ఉంటుంది. మానసిక సుఖము కలుగును.

డిసెంబర్ - ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. ధనవంతుల సహాయము అందుతుంది. గృహమునందు శుభకార్యములు జరుగును. శ్రమ అధికముగా, ఫలితము తక్కువగా ఉండును.

జనవరి - ఈ మాసం అనుకూలంగా ఉంది. ధనాదాయం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనుట. నూతన వస్త్రాభరణములు కొనుగోలు, సోదరుల నుంచి లాభముండును.

ఫిబ్రవరి - ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం, చేయు వృత్తి, ఉద్యోగాలలో అభివృద్ధి. ఇంటిలో శుభకార్యములు, ఖరీదైన వాహనాల్లో ప్రయాణించుట, సకాలంలో పనులన్నీ పూర్తి చేస్తారు.

మార్చి - ఈ మాసం అంత అనుకూలంగా లేదు. ప్రభుత్వ అధికారుల నుండి వేధింపులు, ఇంట బయట గొడవలు, అధిక ఖర్చు, స్నేహితులతో చికాకులు, కుటుంబమునందు బాధ్యతలు పెరుగుతాయి.

టాపిక్