Mediterranean diet: సంతానోత్పత్తికి బెస్ట్ డైట్ ఇదేనంటున్న పరిశోధన
20 December 2022, 14:31 IST
- Mediterranean diet: సంతానోత్పత్తి సామర్థ్యం పెరగడానికి మెడిటరేనియన్ డైట్ బెస్ట్ అంటున్నారు పరిశోధకులు. మధ్యధర సముద్ర ప్రాంతంలోని గ్రీస్, ఇటలీ తదితర దేశాలు తినే ఆహారాన్ని మెడిటరేనియన్ డైట్ అంటారు. ఈ డైట్‌లో భాగమైన పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు వంటి వాటి బహుళ ఆరోగ్య ప్రయోజనాలు గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తున్న జంటలకు సహాయపడతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. అలాగే ఫిష్, పౌల్ట్రీ వంటి ఉత్పత్తులను ఓ మోతాదులో తీసుకోవడం మంచిదేనని, రెడ్ మీట్, స్వీట్స్ అరుదుగా తీసుకోవచ్చని అధ్యయనం తేల్చింది. మోనాష్ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ సన్‌షైన్ కోస్ట్, యూనివర్శిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా జరిపిన అధ్యయనంలో ఈ డైట్ పురుషుల స్పెర్మ్ నాణ్యత, సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుందని కనుగొన్నారు. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు జంటల గర్భధారణ అవకాశాలను మెరుగుపరుస్తాయని పరిశోధకులు గుర్తించారు.