Skin Care Tips | మొటిమలు లేని, గ్లోయింగ్ స్కిన్ కావాలంటే వీటిని ట్రై చేయండి..
25 May 2022, 13:36 IST
- ఉష్ణోగ్రతల్లోని మార్పుల వల్ల చాలా మందికి ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే చర్మం కూడా రకారకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫలితంగా మొటిమలు, బొబ్బలు వంటివి వస్తాయి.
స్కిన్ కేర్ టిప్స్
Skin Care in Summer | చాలా మంది తమ చర్మం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. చర్మం శుభ్రంగా, చక్కగా, కోమలంగా ఉండాలనుకుంటారు. కానీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు సహజంగా ఉండే చర్మ కాంతిని నాశనం చేస్తాయి. మచ్చలు, మొటిమలతో చర్మం నిర్జీవంగా మారుతుంది. మరి ఈ సమస్య నుంచి బయటపడి, చర్మాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం.
పసుపు
పసుపులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ముఖంపై పొక్కులు, మొటిమలు తగ్గడానికి.. ఒకటిన్నర టీస్పూన్ పసుపు తీసుకుని.. పాలల్లో కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. దీనిని మొటిమలు లేదా పొక్కులపై రాయండి. ఇలా కొన్నిరోజులు చేస్తే.. దాని సానుకూల ప్రభావాలు మీ ముఖంపై కనిపిస్తాయి.
చాలా మంది పొడి, జిడ్డు చర్మంతో బాధపడుతుంటారు. దీనివల్ల వారి ముఖం నల్లబడే అవకాశం ఉంది. ఇలా ఇబ్బంది పడేవారు ముఖంపై పసుపుతో స్క్రబ్ చేయాలి. ఇది ముఖం జిడ్డుగా మారకుండా కాపాడుతుంది. అంతేకాకుండా చర్మానికి గ్లో ఇస్తుంది.
కలబంద గుజ్జు
ముఖంపై పొక్కులు లేదా మొటిమలు ఉంటే.. కలబంద గుజ్జును దానిపై అప్లై చేయాలి. ఇది వాటిని నివారించడమే కాకుండా.. ముఖం ముడతలు పడకుండా సహాయం చేస్తుంది.
బేకింగ్ సోడా
బేకింగ్ సోడా చర్మానికి, ముఖ ఆరోగ్యానికి కూడా మంచిది. ఇందులో క్రిమినాశక గుణాలు ఉండడం వల్ల ముఖంపై బొబ్బలు, మొటిమలు రావు. కాబట్టి బేకింగ్ సోడాను రోజుకు రెండుసార్లు ముఖానికి రాసుకుని.. చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
తులసి
ముఖ్యంగా ముఖంపై బ్యాక్టీరియా పెరుగుదలను నివారించడానికి తులసిని ఉపయోగించండి. పొక్కులు లేదా మొటిమల నుంచి చర్మాన్ని రక్షించడానికి తులసిని ఉపయోగించడం ప్రయోజనకరంగా ఉంటుంది.
టాపిక్