తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Parenting Tips: డార్క్ వెబ్, ఫిషింగ్, హ్యాకింగ్… ఈ చెడు డిజిటల్ ప్రపంచం నుంచి మీ పిల్లలను ఇలా రక్షించుకోండి

Parenting Tips: డార్క్ వెబ్, ఫిషింగ్, హ్యాకింగ్… ఈ చెడు డిజిటల్ ప్రపంచం నుంచి మీ పిల్లలను ఇలా రక్షించుకోండి

Haritha Chappa HT Telugu

13 July 2024, 8:00 IST

google News
  • Parenting Tips: డార్క్ వెబ్, ఫిషింగ్, హ్యాకింగ్... డిజిటల్ ప్రపంచానికి చెడు రూపాలు.  ఎవరైనా వీటికి బలైపోవచ్చు. ముఖ్యంగా టీనేజీ పిల్లలు వీటిని బారిన పడే అవకాశం ఉంది. ఇలాంటి డిజిటల్ ప్రపంచం నుంచి మీ పిల్లలను కాపాడుకోండి.

డిజిటల్ ప్రపంచం
డిజిటల్ ప్రపంచం (shutterstock)

డిజిటల్ ప్రపంచం

కొంతకాలం క్రితం ఓ అబ్బాయి ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ తన తండ్రి ఫోన్లోని వేల రూపాయలను పొగొట్టాడు. డబ్బులు చెల్లించేందుకు రహస్యంగా తండ్రి డెబిట్ కార్డును ఉపయోగించి తండ్రి బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులన్నీ పోయే వరకు ఆటను కొనసాగించాడు. తండ్రికి దాదాపు మూడు లక్షల రూపాయల నష్టం వాటిల్లింది.

మరొక కేసులో 13 ఏళ్ల బాలుడు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి తన ఫొటోను పోస్ట్ చేశాడు. ఈ ఫొటోకు లైకులు తగ్గడం, నెగిటివ్ కామెంట్లు రావడంతో ఆ అబ్బాయి క్రమంగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. మూడు నెలల కౌన్సిలింగ్ అనంతరం ఈ పరిస్థితి నుంచి బయటపడ్డాడు.

ఇలాంటి ఘటనలు డిజిటల్ ప్రపంచంలో అడుగుపెట్టిన ప్రతి పిల్లాడికి ఎదురుపడుతుంది. సైబర్ మోసం బారిన వారు పడకుండా , ఇంటర్నెట్ మోసాలకు గురి కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. 10 నుండి 18 సంవత్సరాల మధ్య పిల్లలకు కుతూహలం, మొండితనం, తిరుగుబాటు, భావోద్వేగాలు అధికంగా కనిపిస్తాయి. అటువంటి పరిస్థితిలో, పిల్లల చేతిలో మొబైల్ ను అప్పగించడం మంచిది కాదు.

పిల్లలు ఎలా టార్గెట్ అవుతారు?

నేరస్థులకు పిల్లలు ఎల్లప్పుడూ సులభంగా చిక్కిపోతారు. ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన కేసుల్లో సైబర్ వేధింపులు, ఆన్‌లైన్ చీటింగ్, అశ్లీలత, డేటింగ్ మోసాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీన్ని నివారించాలంటే ముందుగా తల్లిదండ్రులే వాటి గురించి బాగా తెలుసుకోవాలి. దీని తరువాత, పిల్లలకు మంచి, చెడుల మధ్య వ్యత్యాసాన్ని వివరించాలి. అలాగే వారిపై ఒక కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉంది. సైబర్ సెక్యూరిటీ నిపుణుడు సచిన్ గుప్తా మాట్లాడుతూ ఫోన్లు, ఇంటర్నెట్ నేటి పిల్లల అవసరాల్లో భాగమైపోయాయని చెప్పారు. వారు ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టేటప్పుడు దాని చీకటి కోణాన్ని కూడా తెలుసుకోవాలి.

ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్: తల్లిదండ్రుల్లో ఒకరు ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేసి తమ పిల్లల ఖాతాకు లింక్ చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా పిల్లలు ఇంటర్నెట్లో ఏంచేస్తున్నారు తెలుసుకోవాలి.

మార్ఫింగ్: పిల్లల ఫోటోలను మార్ఫింగ్ చేయడం, మెసేజులు పంపడం ద్వారా అతన్ని వేధించవచ్చు, బ్లాక్ మెయిల్ చేయవచ్చు. ఈ పని కూడా రేటింగ్ యాప్ తోనే జరుగుతుంది. కాబట్టి పిల్లలు తమ ఫోటోలు ఎక్కడ బయటపెట్టకుండా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

ఆన్లైన్ వేధింపులు: పిల్లల స్నేహితులు తమ వ్యక్తిగత పగను ఆన్ లైన్లో వ్యక్తం చేయవచ్చు. అటువంటి పరిస్థితిలో, పిల్లలు మానసికంగా కుంగిపోతారు. వారు అలా కాకుండా కాపాడాల్సిన బాధ్యత మీదే.

ఆన్లైన్ గేమింగ్: సైబర్ క్రైమ్ చేసే వారు పిల్లలను లక్ష్యంగా చేసుకుంటారు. ఇందులో వారిని కొన్ని గేమ్స్ ఆడేందుకు అనుమతించిన తర్వాత ఆ ఆటకు బానిసలుగా మార్చేస్తారు. ఆ ఆటలో పిల్లలు ఓడిపోతే అధిక డబ్బులు చెల్లించాల్సి వస్తుంది.

ప్రలోభపెట్టే ప్రకటనలు: గేమింగ్ యాప్స్ లేదా వీడియో యాప్స్ లో పిల్లలకు ఆకర్షణీయమైన ప్రకటనలు చూపించి మోసం చేస్తారు. లింక్‌లు పంపడం ద్వారా వారు డబ్బును కాజేసేందుకు ప్రయత్నిస్తారు. డిజిటల్ ప్రపంచంలోని ప్రమాదాల గురించి పిల్లలకు చెప్పడం చాలా ముఖ్యం. అదే సమయంలో, పిల్లలు ఇంటర్నెట్ ను దుర్వినియోగం చేయకుండా మీరు పర్యవేక్షించాలి.

ఇలా కాపాడుకోండి

పిల్లలకు నిజంగా అవసరమైనప్పుడు మాత్రమే ఫోన్ ఇవ్వాలి. అవసరమైనప్పుడు మాత్రమే ఇంటర్నెట్ వాడేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల ఫోన్ ను మీ గూగుల్ అకౌంట్ కు లింక్ చేసుకోవచ్చు. ఇది పిల్లవాడు ఇంటర్నెట్లో ఏమి వెతుకుతున్నాడో, ఎంత సమయం గడుపుతున్నాడో మీకు తెలియజేస్తుంది. అలాగే, యూట్యూబ్ కిడ్స్ వంటి యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుంటే పిల్లలు అవాంఛిత వీడియోలు చూడలేరు. అలాగే, గూగుల్ లింక్ ద్వారా, పిల్లవాడు ఎలాంటి వీడియోలు చూస్తున్నాడో మీ ఫోన్లో తెలుసుకోవచ్చు. పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచడం మంచిది.

సైబర్ క్రైమ్ గురించి చెప్పండి

సైబర్ క్రైమ్ గురించి పిల్లలకు చెప్పడం చాలా ముఖ్యం. ఇంట్లోని ఒక గదిలో కూర్చున్నప్పుడు అతను మోసానికి గురవుతాడని అతనికి వివరించండి. అయితే ఇందులో పిల్లల వయసును బట్టి వారికి వివరించాలి.

తదుపరి వ్యాసం