తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Masala Wada: బండి మీద దొరికే మసాలా వడలు.. సులువుగా చేసుకోండిలా..

masala wada: బండి మీద దొరికే మసాలా వడలు.. సులువుగా చేసుకోండిలా..

30 April 2023, 15:50 IST

google News
  • masala wada: సాయంత్రం పూట వేడివేడిగా లాగించే ఈ శనగపప్పు మసాలా వడల తయారీవిధానం ఏంటో తెలుసుకుందాం.

మసాలా వడ
మసాలా వడ (pexels)

మసాలా వడ

బయట బండీ మీద దొరికే మసాలా వడలు చాలా మంది ఇష్టపడతారు. వాటిని కూడా సులభంగా ఇంట్లోనే రుచిలో ఎలాంటి మార్పు లేకుండా చేసుకోవచ్చు.

కావాల్సిన పదార్థాలు:

శనగ పప్పు - సగం కప్పు

ఎండు మిర్చి - 2

ధనియాలు - సగం టీస్పూను

జీలకర్ర - సగం టీస్పూను

మిరియాలు - పావు టీస్పూను

సన్నగా తరగిన ఉల్లిపాయ ముక్కలు - పావు కప్పు

పచ్చిమిర్చి - 1 టీస్పూను

సన్నగా తరిగిన అల్లం - 1 టీస్పూను

కరివేపాకు - ఒక రెమ్మ

కొత్తిమీర -కొద్దిగా

ఇంగువ - చిటికెడు

ఉప్పు - తగినంత

నూనె - డీప్ ఫ్రై కి సరిపడా

తయారీ విధానం:

step1 : శనగపప్పును నీళ్లలో రెండు మూడు సార్లు కడిగేసి మంచి నీళ్లలో రెండు నుంచి మూడు గంటల పాటు నానబెట్టుకోండి

step 2 : మిక్సీలో ఎండుమిర్చి ముక్కలు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు వేసుకుని కాస్త గరుకుగానే మిక్సీ పట్టుకోవాలి.

ఇందులో నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసి మరోసారి గరుకుగా మిక్సీ పట్టుకోవాలి. అక్కడక్కడా పప్పు అలాగే ఉన్నా పరవాలేదు.

step 3 : నీళ్లు లేకుండానే మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే రెండు మూడు చెంచాల నీళ్లు పోసుకోవచ్చు.

ఈ మిశ్రమాన్ని ఒక గిన్నె లోకి తీసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, ఇంగువ, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి.

step 4 : ఒక కడాయిలో నూనె పోసుకొని వేడెక్కాక, పప్పు మిశ్రమాన్ని ఉండలుగా చేసి కాస్త ఒత్తుకుంటూ వడల్లాగా వేసుకోవాలి.

మీడియం మంట మీద వడలు వేసుకోవాలి. రంగు మారి కరకరలాడే లాగా వేయించుకోవాలి. అంతే మసాలా వడలు సిద్ధం. వీటిని సాయత్రం స్నాక్ లాగా తినొచ్చు. కొబ్బరి చట్నీతో తింటే వీటి రుచి బాగుంటుంది.

టాపిక్

తదుపరి వ్యాసం