Relationships | మీ భాగస్వామికి దగ్గరవ్వాలా? అయితే ఇలా ట్రై చేయండి
03 March 2022, 16:25 IST
- బంధాలన్నింటిలో భార్యభర్తల బంధం చాలా విలువైనది. ప్రస్తుతం ఉన్న సమయంలో.. బిజీ లైఫ్‌లో మనుషుల మధ్య దూరాలు పెరిగిపోతున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అలకలు, గొడవలు వారిని బంధాలకు దూరం చేస్తున్నాయి. మీ బంధాన్ని బలోపేతం చేసుకోవాలని చూస్తే.. మీ భావాలను కచ్చితంగా వారికి చెప్పాల్సిందే అంటున్నారు మానసిక నిపుణులు.
ప్రియమైన వారికి టైమ్ ఇవ్వండి
Tips For Couples | మీకు నచ్చిన వ్యక్తితో తగినంత సమయం గడపకపోయినా.. మానసికంగా మీకు దూరం అవుతున్నారని భావించినా అది మంచిది కాదు. మీ భాగస్వామితో లోతైన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి మీరు ఇప్పటికైనా ప్రయత్నించాల్సిందే. నచ్చినవారికి దగ్గరవ్వడానికి అనేక మార్గాలు ఉన్నాయి. దానిలో భాగంగా ఒకరు కొత్తగా ఏదైనా ట్రై చేయడం.. రెండో వ్యక్తి సాధారణ అభిరుచిని కొనసాగించడం. అలాగే మీ భావాలు, భయాలను కమ్యూనికేట్ చేయడానికి, చర్చించడానికి ప్రతిరోజూ కొంత సమయాన్ని వెచ్చించండి. ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వకుండా కొన్ని అపార్థాలు మిమ్మల్ని ఆపుతున్నాయని మీరు భావిస్తే, వాటిని క్లియర్ చేయడానికి సమయాన్ని వెచ్చించండి. మిలీనియల్ థెరపిస్ట్‌గా ప్రసిద్ధి చెందిన మనస్తత్వవేత్త సారా కుబురిక్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో లోతైన కనెక్షన్‌లను నిర్మించుకోవడానికి పలు చిట్కాలు వివరించారు.
మీ ఆలోచనలు, భావాలు, కలలు లేదా భయాలను మీ భాగస్వామితో పంచుకోండి. మీరు ఎలా ఉండాలని వారు అనుకుంటున్నారో తెలుసుకోండి. దానికి తగినట్లుగా ఉండేందుకు ప్రయత్నించండి. వారు మీకు ఎలా ఉంటే ఇంకా ఎక్కువ ఇష్టపడతారో తెలపండి.
కలిసి ప్రయాణించండి
మీకంటూ కొంత సమయం వెచ్చించుకుని.. ఆఫీసు పనికి కాస్త విరామం తీసుకోండి. భాగస్వామితో కలిసి ప్రపంచాన్ని అన్వేషించండి. ఇంట్లోనే ఉంటే కలిసి ఆడుకోవడం.. కలిసి పనులు పంచుకోవడం వంటివి చేయండి.
వారి గురించి తెలుసుకోండి..
ఒక వ్యక్తి గురించి తెలుసుకోవలసిన ప్రతిదీ మీకు తెలుసని అనుకోవడం మానేయండి. ఉత్సుకతతో ఉండండి. వారు ఎవరో.. వారి స్వభావం ఏంటో మీకు చూపించడానికి వారిని అనుమతించండి (మీ అంచనాలను దారిలోకి రానివ్వవద్దు).
అర్థం చేసుకోండి..
భాగస్వామికి దగ్గరయ్యేందుకు సానుభూతి, బహిరంగ క్షమాపణ చెప్పడం తప్పమే కాదు. అవతలి వ్యక్తిని అర్థం చేసుకోవడం, కనెక్ట్ చేయడంపై దృష్టి పెట్టండి.
పొగడ్తలు ఇవ్వండి..
అవతలి వ్యక్తిలో మీకు ఏ లక్షణాలు నచ్చాయో.. వేటిని ఆరాధిస్తారో.. వారిలో మీకు నచ్చే, ఇష్టమైన అంశఆలు వారికి తెలియజేయండి.
బాధను పంచుకోండి..
మీ మాటలు, చర్యలకు జవాబుదారీగా ఉండండి. మీరు కలిగించిన బాధను ధృవీకరించండి. పైగా మీ బాధను పంచుకోండి..