తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Paneer Sandwich: పనీర్ శాండ్‌విచ్ రెసిపీ, ఇంట్లోనే ఇలా పిల్లలకు చేసి పెట్టండి

Paneer sandwich: పనీర్ శాండ్‌విచ్ రెసిపీ, ఇంట్లోనే ఇలా పిల్లలకు చేసి పెట్టండి

Haritha Chappa HT Telugu

14 April 2024, 6:00 IST

google News
    • Paneer sandwich: ఎప్పుడూ సాంప్రదాయమైన అల్పాహారాలే కాదు, ఒకసారి పనీర్ శాండ్విచ్ వంటి బ్రెడ్ బ్రేక్ ఫాస్ట్ లు కూడా పిల్లలకు పెడుతూ ఉండండి. వీటి రెసిపీ చాలా సులువు.
పనీర్ శాండ్ విచ్
పనీర్ శాండ్ విచ్

పనీర్ శాండ్ విచ్

Paneer sandwich: పనీర్‌తో చేసే రెసిపీలు ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ లో ప్రోటీన్ తో నిండిన ఆహారాన్ని తినమని చెబుతారు పోషకాహార నిపుణులు. పనీర్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. పనీర్ సాండ్విచ్ ను చేయడం చాలా సులువు. దీన్ని అప్పుడప్పుడు పిల్లలకు చేసి పెడితే వారికి ఇది నచ్చడం ఖాయం. పనీరు సాండ్ విచ్ రెసిపీ ఎలాగో ఇప్పుడు చూద్దాం.

పనీర్ సాండ్విచ్ రెసిపీకి కావలసిన పదార్థాలు

పనీర్ తురుము - ఒక కప్పు

క్యారెట్ తురుము - రెండు స్పూన్లు

క్యాప్సికం తురుము - రెండు స్పూన్లు

ఉడికించిన మొక్కజొన్న గింజలు - రెండు స్పూన్లు

కొత్తిమీర తరుగు - ఒక స్పూను

కారంపొడి - పావు స్పూను

జీలకర్ర పొడి - పావు స్పూను

ఉప్పు - పావు స్పూను

టమోటో సాస్ - రెండు స్పూన్లు

బ్రెడ్ - నాలుగు స్లైసులు

గ్రీన్ చట్నీ - రెండు స్పూన్లు

బటర్- రెండు స్పూన్లు

పనీర్ సాండ్విచ్ రెసిపీ

1. ఒక గిన్నె తీసుకొని అందులో తురిమిన పనీర్ వేయాలి.

2. ఆ పనీర్ లోనే క్యారెట్, క్యాప్సికం, మొక్కజొన్న గింజలు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకోవాలి.

3. అలాగే కారం, జీలకర్ర పొడి, టమోటో సాస్ కూడా వేసి బాగా కలపాలి.

4. ఇవన్నీ బాగా కలిసాక బ్రెడ్ స్లైస్ తీసుకొని దానిపై గ్రీన్ చట్నీ రాయాలి.

5. ఇప్పుడు ముందు కలుపుకున్న పనీర్ మిశ్రమాన్ని దానిపై చల్లాలి.

6. మరొక బ్రెడ్ స్లైస్ పై గ్రీన్ చట్నీ రాసి ఈ పనీర్ మిశ్రమంపై పెట్టాలి.

7. ఇప్పుడు పెనంపై బటర్ రాసి ఈ బ్రెడ్ ను రెండువైపులా కాల్చుకోవాలి. అంతే టేస్టీ పనీర్ శాండ్విచ్ రెడీ అయినట్టే. గ్రిల్ పాన్ మీద ఈ బ్రెడ్ ని కాలిస్తే బాగుంటుంది.

టాపిక్

తదుపరి వ్యాసం