తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Paneer Fried Rice Recipe : లంచ్ కోసం.. హెల్తీ, టేస్టీ పనీర్ ఫ్రైడ్ రైస్..

Paneer Fried Rice Recipe : లంచ్ కోసం.. హెల్తీ, టేస్టీ పనీర్ ఫ్రైడ్ రైస్..

10 January 2023, 12:44 IST

google News
    • Paneer Fried Rice Recipe : రోజూ అన్నం, కూర తినాలంటే కాస్త బోర్ కొడుతుంది. మనసు ఏదైనా టేస్టీగా తినాలని కోరుకుంటుంది. అయితే వండిన అన్నం వేస్ట్ కాకుండా.. ఆరోగ్యాన్ని అందించే కూరగాయలు, పనీర్​తో మీరు మంచి పనీర్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోండి. దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు.
పనీర్ ఫ్రైడ్ రైస్
పనీర్ ఫ్రైడ్ రైస్

పనీర్ ఫ్రైడ్ రైస్

Paneer Fried Rice Recipe : ఈ రుచికరమైన, టేస్టీ వంటకంలో పనీర్ మెయిన్​గా కనిపిస్తుంది. మీ మధ్యాహ్న భోజనానికి ఇది పరెఫెక్ట్ అని చెప్పవచ్చు. ప్రోటీన్, విటమిన్లు, ఇతర పోషకాలతో నిండిన పనీర్ ఫ్రైడ్ రైస్ మీకు రుచితో పాటు.. ఆరోగ్యాన్ని అందిస్తుంది. దీనిని తయారు చేసుకోవడానికి తెగ కష్టపడాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్​గా, టేస్టీగా ఇంట్లోనే దీనిని తయారు చేసుకోవచ్చు. మరి దీనిని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* అన్నం - 1/2 కప్పు

* పనీర్ క్యూబ్స్ - 8-10

* అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్

* కారం - 1/2 టీస్పూన్

* పెప్పర్ - 1/2 టీస్పూన్

* సోయా సాస్ - 1 స్పూన్

* ఉప్పు - తగినంత

* ఉల్లిపాయ - 1 తరిగినది

* క్యారెట్ - 1 తరిగినది

* క్యాప్సికమ్ - 1/2 తరిగినది

* మష్రూమ్ - 1/4 కప్పు

పనీర్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం

పనీర్ ఫ్రైడ్ రైస్ తయారు చేసేందుకు ముందుగా ఉడికించిన అన్నం తీసుకోండి. అనంతరం పనీర్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, మొక్కజొన్న పిండిలో టాసు చేసి.. క్రిస్పీగా వేయించి పక్కన పెట్టుకోండి. పూర్తయిన తర్వాత ఒక పాన్ తీసుకుని దానిలో నూనె వేసి వేడి చేయండి. దానిలో అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి.. ఆపై వేయించిన పనీర్ క్యూబ్స్ వేయండి. బాగా కలిపి ఇప్పుడు దానిలో ఉల్లిపాయలు, కూరగాయలు, మష్రూమ్స్ వేసి ఫ్రై చేయండి. అవి బాగా వేగిన తర్వాత.. దానిలో కారం, పెప్పర్ వేయండి. అనంతరం సోయా సాస్ వేసి మళ్లీ కలపండి. చివర్లో ఉప్పు వేసి.. వండిన అన్నం వేసి అన్నీ కలిసేలా బాగా కలపండి. అంతే పనీర్ ఫ్రైడ్ రైస్ రెడీ. వేడివేడిగా సర్వ్ చేసుకుని తినేయండి.

తదుపరి వ్యాసం