తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Orange Halwa: ఆరెంజ్ జ్యూస్‌తో టేస్టీ హల్వా చేసేయండి, పిల్లలకు నచ్చేస్తుంది

Orange Halwa: ఆరెంజ్ జ్యూస్‌తో టేస్టీ హల్వా చేసేయండి, పిల్లలకు నచ్చేస్తుంది

Haritha Chappa HT Telugu

24 January 2024, 15:45 IST

google News
    • Orange Halwa: ఆరెంజ్ జ్యూస్ తో టేస్టీగా హల్వా చేస్తే పిల్లలకు నచ్చుతుంది
ఆరెంజ్ హల్వా రెసిపీ
ఆరెంజ్ హల్వా రెసిపీ (NishaMadhulika/youtube)

ఆరెంజ్ హల్వా రెసిపీ

Orange Halwa: నారింజ పండ్లు టేస్ట్ చాలా మందికి నచ్చుతుంది. వాటిని వాసన చూస్తేనే నోరూరిపోతుంది. అలాంటి నారింజ పండ్లతో హల్వా చేస్తే కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. నారింజ పండ్ల రసంతో హల్వా తయారు చేసుకోవచ్చు. చాలా తక్కువ పదార్థాలతోనే దీన్ని ఇంట్లోనే వండుకోవచ్.చు ఈ ఆరెంజ్ హల్వా సాయంత్రం పూట స్నాక్ గా ఉపయోగపడుతుంది.

ఆరెంజ్ జ్యూస్ హల్వా రెసిపీకి కావలసిన పదార్థాలు

నారింజ పండ్లు - మూడు

కార్న్ ఫ్లోర్ - అరకప్పు

ఆరెంజ్ ఫుడ్ కలర్ - చిటికెడు

బాదం, జీడిపప్పు తరుగు - గుప్పెడు

పంచదార - ఒక కప్పు

దాల్చిన చెక్క పొడి - చిటికెడు

ఆరెంజ్ జ్యూస్ హల్వా రెసిపీ

1. ముందుగా నారింజ పండ్ల తొనలను వలిచి వాటి నుంచి జ్యూస్ తీసి పక్కన పెట్టుకోవాలి.

2. ఒక గిన్నెలో ఆరెంజ్ జ్యూస్ వేసి చిటికెడు ఆరంజ్ ఫుడ్ కలర్ వేయాలి.

3. అందులోనే మొక్కజొన్న పిండిని కూడా వేసి బాగా కలపాలి.

4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి పంచదార, గ్లాసు నీళ్లు వేసి పాకంలా తీయాలి.

5. ఆ పాకంలో దాల్చిన చెక్క పొడి వేసి కలుపుకోవాలి. నిమ్మరసాన్ని కూడా వేయాలి.

6. ఆ మిశ్రమం చిక్కగా అవుతున్నప్పుడు ఆరెంజ్ జ్యూస్ మిశ్రమాన్ని వేసి గరిటతో కలుపుతూ ఉండాలి.

7. అది గట్టిగా అయ్యేదాకా కలుపుతూనే ఉండాలి.

8. అది హల్వాలా చిక్కగా అయ్యాక స్టవ్ కట్టేయాలి.

9. ఇప్పుడు ఒక ప్లేటుకు కింద నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని వేసి పరచాలి.

10. పైన జీడిపప్పు, బాదం తరుగును చల్లుకోవాలి. అవి చల్లారాక ముక్కలుగా కోసుకుంటే హల్వా రెడీ అయినట్టే.

ఇది చాలా టేస్టీగా ఉంటుంది. రుచి ఘుమఘుమలాడిపోతుంది. ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ మీరే చేసుకుని తింటారు. ఫుడ్ కలర్ వేసుకోవాలా వద్దా అనేది మీ ఇష్టం. ఆరెంజ్ రంగులో హల్వా కావాలనుకుంటే ఫుడ్ కలర్ ని కలుపుకోండి లేదా వేసుకోకపోయినా ఎలాంటి తేడా ఉండదు. రంగు కాస్త లేత రంగులో వస్తుంది అంతే.

తదుపరి వ్యాసం