Nokia C21 Plus । బడ్జెట్ ధరలో నోకియా స్మార్ట్‌ఫోన్, జియో కస్టమర్లకు డిస్కౌంట్!
12 July 2022, 16:39 IST
- నోకియా బ్రాండ్ తో తాజా ఒక బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల అయింది. 'Nokia C21 Plus' పేరుతో లభిస్తున్న ఈ ఫోన్ లోని ఫీచర్స్, ధరతో పాటు ఆఫర్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
Nokia C21 Plus
నోకియా మొబైల్స్ మేకర్ HMD గ్లోబల్ తాజాగా భారత మార్కెట్లో మరొక సరికొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 'Nokia C21 Plus' పేరుతో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ గతంలో వచ్చిన నోకియా C20 ప్లస్ ఫోన్‌కి సక్సెసర్. ఇది బడ్జెట్ ఫోన్ కాబట్టి ఇందులోని ఫీచర్లు అదే స్థాయిలో ఉంటాయి. అయితే నోకియా ఫోన్లు మన్నికనవిగా మార్కెట్లో ఈ బాండ్‌కు మంచి పేరుంది. ఈ సరికొత్త Nokia C21 Plus స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy F12, Redmi 10 Prime మరియు Realme C25s వంటి స్మార్ట్‌ఫోన్‌లకు ప్రత్యామ్నాయంగా ఉంటుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. కొనుగోలుపై ఆసక్తి ఉన్న వినియోగదారులకు HMD గ్లోబల్ పలు లాంచ్ ఆఫర్‌లను కూడా అందిస్తోంది. కొనుగోలుపై ఆసక్తి ఉన్న కొనుగోలుదారులకు HMD గ్లోబల్ కూడా లాంచ్ ఆఫర్‌లను అందిస్తోంది.
మరి ఆ ఆఫర్లు ఏంటి? ఇంకా ఈ సరికొత్త Nokia C21 Plusలో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ధర ఎంత మొదలగు వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Nokia C21 Plus స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
- 6.5 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే
- 3GB/4GB RAM, 32/64 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
- ఆక్టా-కోర్ యునిసోక్ SC9863A ప్రాసెసర్
- వెనకవైపు 13MP + 2MP కెమెరా, ముందు భాగంలో 5 MP సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్
- 5050 mAh బ్యాటరీ సామర్థ్యం, 10W ఛార్జర్
3 GB RAM + 32 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 10,299/-
రెండవ వేరియంట్ 4GB RAM+ 64 GB స్టోరేజ్ ధర రూ.11,299/-
ప్రతి స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై వినియోగదారులకు నోకియా వైర్డ్ బడ్స్‌ను కూడా ఉచితంగా లభించనున్నాయి. అలాగే జియో కస్టమర్లందరికీ ధరపై 10 శాతం స్పెషల్ తగ్గింపుతో పాటు రూ. 4,000 విలువైన ప్రయోజనాలు పొందవచ్చునని కంపెనీ తెలిపింది.
ప్రస్తుతానికి ఈ ఫోన్ నోకియా ఇండియా అధికారిక ఇ-షాప్ ద్వారా మాత్రమే కొనుగోలు చేయటానికి అందుబాటులో ఉంది.