తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  No Smoking Day 2022 | స్మోకింగ్ ఆకస్మికంగా మానేస్తే ఏమవుతుంది?

No Smoking Day 2022 | స్మోకింగ్ ఆకస్మికంగా మానేస్తే ఏమవుతుంది?

09 March 2022, 12:46 IST

google News
    • జాతీయ ధూమపాన రహిత దినోత్సవంగా మార్చి 9వ తేదీని జరుపుకుంటాము. 2022లో నో స్మోకింగ్ డే సందర్భంగా నికోటిన్ వ్యసనం మానేసి.. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోమంటున్నారు వైద్యులు. స్మోకింగ్ కంటిన్యూ చేస్తే.. ఇప్పుడు బాగానే ఉన్నా రాబోయే రోజుల్లో ఆరోగ్యపరమైన ఇబ్బందులు తప్పంటున్నారు.
నో స్మోకింగ్ డే 2022
నో స్మోకింగ్ డే 2022

నో స్మోకింగ్ డే 2022

No Smoking Day 2022 | మీరు ధూమపానం మానేయాలని ఆలోచిస్తున్నా.. లేదా ఇటీవల మానేసినా.. మీరు మీ ఆరోగ్యం విషయంలో ఓ అడుగు ముందుకు వేసినట్లే. ధూమపానం మానేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు ఇప్పటికే తెలిసి ఉండవచ్చు. స్మోకింగ్ మానేశాక ఊపిరితిత్తుల సమస్యలు నిజంగానే తగ్గుతాయా? అని మీరు ఎప్పుడైనా ఆలోచించే ఉండవచ్చు. మీరు ధూమపాన అలవాటుతో విడిపోయిన తర్వాత మీ ఊపిరితిత్తులు నిజంగా నయం అవుతుందా అని కూడా మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. అయితే తప్పక నయం అవుతుంది అంటున్నారు వైద్యులు. స్మోకింగ్ మానేశాక మీరు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని వెల్లడిస్తున్నారు. కాబట్టి ఎవరైనా మానని వాళ్లు ఉంటే.. త్వరగా మానేయడం చాలా ముఖ్యం. ఇది మీ ఊపిరితిత్తులను రక్షించడంలో సహాయం చేస్తుంది.

సిగరెట్ మీ ఊపిరితిత్తులను ఎలా ప్రభావితం చేస్తుంది?

సరైన మెదడు పనితీరు, మంచి మానసిక స్థితి, శక్తి కోసం, ఆక్సిజన్ అవసరం. ఇది మీకు బలాన్ని ఇచ్చి రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడానికి, ఆందోళనను, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. మీ ఊపిరితిత్తులు మీ మొత్తం శరీరానికి ఆక్సిజన్‌ను పంపిణీ చేస్తాయి. ఇది మీ అన్ని అవయవాలు, కణాలకు అవసరం. మీకు పరిశుభ్రమైన, తగినంత ఆక్సిజన్ అందుబాటులో లేకుంటే.. మీరు క్యాన్సర్, అనారోగ్యం బారిన పడే అవకాశముంది. ధూమపానం మీ ఊపిరితిత్తుల కణజాలాలను నాశనం చేస్తుంది. మీ శ్వాసకోశ వ్యవస్థను పూర్తిగా ప్రభావితం చేసి.. వాటిని సరిగ్గా పనిచేయకుండా నాశనం చేస్తుంది.

ఒక సిగరెట్​లో 7,000 కంటే ఎక్కువ హానికరమైన సమ్మేళనాలు ఉంటాయి. ఈ పదార్ధాలు ఊపిరితిత్తులకు హాని కలిగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇది మీ ఊపిరితిత్తుల వాయుమార్గాలను తగ్గిస్తుంది. సిగరెట్ పొగ ఊపిరితిత్తుల క్యాన్సర్ సహా.. శరీరంపై అనేక రకాల దుష్ప్రభావాలను కలిగి ఉంటుంది. భారతదేశంలోని పురుషులు, మహిళలు ఇద్దరిలో క్యాన్సర్ సంబంధిత మరణాలలో 9.3 శాతం ఉన్నాయి. ధూమపానం చేయని వారి కంటే ధూమపానం చేసేవారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఇరవై రెట్లు ఎక్కువ.

ఊపిరితిత్తుల క్యాన్సరే కాకుండా.. ఎంఫిసెమా, దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ ఊపిరితిత్తుల వ్యాధి, సిఓపిడి (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్) సంభవించవచ్చు. ఇది శ్వాసలోపం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. ఇది అల్వియోలీ అని పిలువబడే ఊపిరితిత్తులలోని ఒక విభాగాన్ని చంపుతుంది. అక్కడే ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ మార్పిడి జరుగుతుంది.

మొత్తం రికవరీ కష్టమే..

ఒక వ్యక్తి యొక్క ఊపిరితిత్తులు ఎంఫిసెమా స్థాయికి సోకినప్పుడు వాయుమార్గాల గోడలు వాటి రూపాన్ని కోల్పోతాయి. తద్వారా ఊపిరితిత్తుల నుంచి గాలిని బయటకు నెట్టడం కష్టమవుతుంది. ఊపిరితిత్తులలో ఈ మార్పులు శాశ్వతమైనవి. అంతేకాకుండా ఇవి తిరిగిపొందలేము కూడా. ఒక వ్యక్తి ధూమపానం ప్రారంభించిన కొన్ని సంవత్సరాల తర్వాత ఎంఫిసెమా లక్షణాలు కనిపిస్తాయని.. అయితే 20 నుంచి 30 సంవత్సరాల వరకు లక్షణాలు కనిపించకపోయే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

ఊపిరితిత్తుల కణాలు, కణజాలాలకు ధూమపానం వల్ల కలిగే నష్టాన్ని మానవ శరీరం నయం చేయగలిగినప్పటికీ... మొత్తం రికవరీ అవుతుందని మాత్రం చెప్పలేం. ఊపిరితిత్తులకు నష్టం, ఊపిరితిత్తుల పనితీరులో క్షీణత అనేది రోజుకు ఎన్ని సిగరెట్​లు తాగుతున్నారు అనేదానిపై డిపెండ్ అయి ఉంటుంది. దీనిని "ప్యాక్-ఇయర్స్" అని పిలుస్తారు. ధూమపానం వల్ల ఊపిరితిత్తుల కణజాలం చికాకు, మచ్చలు ఏర్పడతాయి. అంతేకాకుండా అవి ఆక్సిజన్‌ను మార్పిడి చేయలేవు.

ధూమపానం మానేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

సిగరెట్ మానేయడం అంటే ఊపిరితిత్తులను రక్షించుకోవడమే. స్మోకింగ్ మానేస్తే.. దెబ్బతిన్న ఊపిరితిత్తులు కూడా క్రమంగా నయం అవుతాయి. స్వతంత్రంగా పునరుత్పత్తి జరుగుతుంది. గతంలో ధూమపానం వల్ల జరిగిన నష్టాన్ని రివర్స్ చేయవచ్చు.

ఎఫ్డీఏ ప్రకారం.. మీ రక్తంలో కార్బన్ మోనాక్సైడ్ స్థాయిలు మీ చివరి సిగరెట్ నుంచి 12 గంటలలోపు సాధారణ స్థితికి వస్తాయి. ఇది ఆక్సిజన్-రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. ధూమపానం మానేసిన ఒక సంవత్సరంలో... మీరు గుండెపోటుకు గురయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. రెండు నుంచి ఐదు సంవత్సరాలలో.. మీరు మీ స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు. మీ రక్త, ఆక్సిజన్ ప్రసరణ మెరుగుపడుతుంది. మీ ఊపిరితిత్తుల పనితీరు పెరుగుతుంది.

తదుపరి వ్యాసం