Weight gain: మీరు తినేస్తున్న ఈ 5 ఆహారాలే, మీ బరువు పెంచేస్తున్నాయ్ జాగ్రత్త
04 October 2024, 12:30 IST
Weight gain: ఫ్రై చేసిన మాంసాలు, ఫ్రెంచ్ ఫ్రైస్, పానీయాలు.. ఇవన్నీ అధిక బరువుకు కారణం. ఇవి బరువు మీద ఎలా ప్రభావితం చూపుతాయో, బరువు తగ్గాలంటే తినకూడని ఆహారాలేంటో చూడండి.
బరువు పెంచే ఆహారాలు
ఎప్పుడో ఒకసారి మీకిష్టమైన ఆహారం ఆలోచించకుండా తింటే బరువు పెరిగిపోరు. ఆరోగ్యకరమైన ఆహారం తింటూ బరువు తగ్గొచ్చు. తినకుండా కడుపు మార్చుకోనక్కర్లేదు. కానీ కొన్ని రకాల ఆహారాలు మాత్రం మీ బరువును విపరీతంగా పెంచడంలో పాత్ర పోషిస్తాయి. అవేంటో చూసి మీ ఆహారంలో చేర్చుకోకండి.
జంక్ ఫుడ్:
చిప్స్, కుకీలు, ఫాస్ట్ ఫుడ్ లాంటివి వాటికి దూరంగా ఉండకపోతే బరువు పెరిగిపోవడం ఖాయం. వీటిలో అనారోగ్యకర కొవ్వులు విపరీతంగా ఉంటాయి. షుగర్స్ ఉంటాయి. ఇవన్నీ నేరుగా బరువు పెంచేవే.
2011 లో చేసిన స్టడీ ప్రకారం పొటాటో చిప్స్ ముఖ్యంగా అధిక బరువుకు మిగతా వాటితో పోలిస్తే కారణం అవుతాయట. కాబట్టి ఇవి కాస్త తినడం తగ్గించడమే మంచిది.
పానీయాలు:
చక్కెరలుండే పానీయాలు.. ముఖ్యంగా సోడా లాంటివి ఎక్కువ పంచదార ఉండే పానీయాలు అధిక బరువుకు కారణం అవుతాయి. 2022 లో చేసిన పరిశోధన ప్రకారం ఇవి బరువు పెంచడంలో గణనీయమైన పాత్ర పోషిస్తాయి. ఇవి ఆకలి తీర్చవు. కానీ కేలరీలు పెంచుతాయి. ఇవే కాక పంచదారలు కలిపిన రసాలు, పిప్పి తీసేసిన పండ్ల రసాలూ మంచివి కావు. పండ్లను అలాగే పూర్తిగా తినడం మేలు.
ఫ్రై చేసిన ఆహారాలు
ఫ్రెంచ్ ఫ్రైలు, ఫ్రె చేసిన చికెన్, లేదా ఇలాగే వేయించిన మరి కొన్ని ఆహారాల్లో కేలరీలు విపరీతంగా ఉంటాయి. అనారోగ్యకరమైన కొవ్వులూ ఎక్కువే. ఇవన్నీ బరువును పెంచేసే అనారోగ్య కారకాలు.
2016 లో చేసిన ఒక పరిశోధన ప్రకారం ఫ్రెంచ్ ఫ్రైస్, ఆలూ చిప్స్ కేవలం కేలరీలు, కొవ్వులో ఎక్కువుండటమే కాకుండా అధిక బరువుకు కారణం అవుతాయని తెలుస్తోంది.
బ్రెడ్, పాస్తా:
ఇవి రెండూ ప్రాసెస్ చేసిన ఆహారాలు. వీటిలో పంచదార కూడా ఎక్కువే ఉంటుంది. 2014 లో చేసిన ఒక పరిశోధన ప్రకారం రోజుకు రెండు బ్రెడ్ స్లైసులు అంటే 120 గ్రాముల దాకా తినడం వల్ల అధిక బరువు అవకాశం 40 శాతం పెరుగుతుందట. ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రోట్లు రక్తంలో చక్కెర స్థాయుల్ని కూడా అమాంతం పెంచేస్తాయి. కాబట్టి వీటికి బదులుగా పీచు ఎక్కువగా ఉండే గింజలతో చేసిన ఆహారాలు, ప్రాసెస్ చేయని రకాలు ఎంచుకోవాలి.
అధిక కొవ్వు ఆహారాలు:
మాంసాన్ని నూనెలో వేయించి చేసిన ఆహారాల్లో శ్యాచురేటెడ్ కొవ్వులు, కేలరీలు ఎక్కువుంటాయి. దీంతో బరువు తగ్గే ప్రక్రియ మరింత ఆలస్యం అవుతుంది. బరువు పెరగడానికి, మాంసం తినడానికి మధ్య సంబంధం ఉందని 2019 లో ప్రచురితమైన ఓ నివేదిక చెబుతోంది.
టాపిక్