తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Naivedya Recipes : రాముడికి సమర్పించేందుకు ఈ నైవేద్యాలు చేయండి

Naivedya Recipes : రాముడికి సమర్పించేందుకు ఈ నైవేద్యాలు చేయండి

Anand Sai HT Telugu

22 January 2024, 11:30 IST

google News
    • Naivedya Recipes : దేశమంతా రామమందిర ప్రారంభోత్సవం చూస్తోంది. అయితే ఇంట్లో కొందరు రాముడికి పూజ చేస్తూ ఉంటారు. శ్రీరాముడికి సమర్పించేందుకు మూడు రకాల నైవేద్యాలు తయారు చేయండి.
నైవేద్యం
నైవేద్యం

నైవేద్యం

జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవం. ఈ రోజున అన్ని దేవాలయాలలో పూజలు అందిస్తారు. హిందువులు తమ ఇళ్లలో రాముడికి పూజ చేస్తారు. రాముడిని పూజించేటప్పుడు వీటిని నైవేద్యంగా సమర్పించవచ్చు. ఈ నైవేద్యాలు తయారు చేసేందుకు టైమ్ కూడా ఎక్కువగా పట్టదు. ఈజీగానే తయారు చేయెుచ్చు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

నైవేద్యం రెసిపీ 1 తయారీ విధానం

కావాల్సిన పదార్థాలు : బాస్మతి బియ్యం 1/2 కప్పు, బాదం 6-8, పిస్తాపప్పులు 6-8, ఎండు ద్రాక్షలు 8-10, పాలు 1 లీటర్, చక్కెర 3/4 కప్పు, ఏలకులు 3-4, చిటికెడు కుంకుమపువ్వు,

తయారీ విధానం : బియ్యాన్ని కడిగి 15 నిమిషాలు నానబెట్టి, వడకట్టి, నీరు పూర్తిగా పోనివ్వాలి. తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి. బాదం, పిస్తాలను చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత మందపాటి అడుగున ఉన్న పాత్రలో పాలు వేడి చేయండి. దానికి బియ్యప్పిండి, పంచదార వేసి, యాలకులు, ఆపై పైన పిస్తా, బాదంపప్పులతో గార్నిష్ చేయాలి. అంతే నైవేద్యం రెడీ.

నైవేద్యం రెసిపీ 2 తయారీ విధానం

కావాల్సిన పదార్థాలు : 1/2 కప్పు శెనగపిండి, 1 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ తురిమిన కొబ్బరి, 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు, రుచికి ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం,

తయారీ విధానం : పప్పును గంటసేపు నానబెట్టి, తర్వాత నీటిని బాగా వడపోసి, మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి. గ్రైండ్ చేసుకుని.. ఆపై 1 స్పూన్ నిమ్మరసం వేసి కలపండి. శ్రీరాముడికి నైవేద్యంగా సమర్పించండి.

నైవేద్యం రెసిపీ 3 తయారీ విధానం

కావాలసిన పదార్థాలు : 1/4 కిలోల కాలే, ఉడికించిన కొత్తిమీర 1-2 టేబుల్ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2-3 టేబుల్ స్పూన్లు, కొద్దిగా అల్లం పొడి, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, పసుపు పొడి 1/4 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి 1/ 4 tsp, రుచికి ఉప్పు.

తయారీ విధానం : మొదలు కాలే ఆకు కూరకు రుచికి సరిపడా ఉప్పు వేసి ఉడికించాలి. తర్వాత బాణలిలో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర వేసి వేయించాలి. ఉడికించిన కాలే ఇతర పదార్థాలను వేసి 5 వేయించాలి. తర్వాత కొత్తిమీర తరుగు వేసి కలపాలి. ఇది పూజ కోసం వచ్చేవారికి ప్రసాదంగా చేయవచ్చు.

తదుపరి వ్యాసం