తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  మీ గోళ్లు ఇలా ఉంటున్నాయా.. అయితే జాగ్రత్త.. ఈ వ్యాదులకు సంకేతం కావొచ్చు!

మీ గోళ్లు ఇలా ఉంటున్నాయా.. అయితే జాగ్రత్త.. ఈ వ్యాదులకు సంకేతం కావొచ్చు!

HT Telugu Desk HT Telugu

14 May 2022, 22:47 IST

google News
    • శరీరంలోని వివిధ భాగాలలో ఏర్పడే అసాధరణ రంగులు పలు వ్యాధులకు సంకేతాలుగా వైద్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా గోళ్లపై వచ్చే రంగును బట్టి కూడా అనేక వ్యాధుల లక్షణాలని చెబుతున్నారు.
Nails
Nails

Nails

సాధారణంగా శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ అనేక రకాల వ్యాధులకు కారణమవుతుంది. అయితే ఇది గోళ్లపై కూడా ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణుల అభిప్రాయం. గోళ్లపై ఏర్పడే రంగు తీవ్రమైన అనారోగ్యానికి సంకేతంగా చెప్పవచ్చు. కాబట్టి గోళ్లపై మార్పును గమనించినట్లయితే జాగ్రత్తగా ఉండాలి. గోర్లపై వచ్చే మార్పులు ఎలాంటి వ్వాధులకు సంకేతాలో ఇప్పుడు చూద్దాం.

పసుపు గోర్లు

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, గోర్లు పసుపు రంగులోకి మారితే అది శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయనే సంకేతం.దీని వల్ల రక్త ప్రసరణలో ఇబ్బందులు ఏర్పడుతాయి. అలాగే ఈ సమస్య ఉన్న వారిలో గోర్లు పగలడం లేదా పెరగుదల ఆగిపోవడం కానీ ఉంటుంది.

ఆకుపచ్చ, నలుపు గోర్లు

ఆకుపచ్చ , నలుపు గోర్లు సూడోమోనాస్ అనే బ్యాక్టీరియా అధికంగా పెరగడం వల్ల ఏర్పడతాయి.

తెల్లటి గోర్లు

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, గోర్లు తెల్లబడటం హెపటైటిస్ లేదా కాలేయ వ్యాధికి దారి తీస్తుంది. అదే సమయంలో, గోర్లు ఇలా రంగు మారడం వల్ల బలహీనత, కాలేయ వ్యాధి, పోషకాహారలోపానికి సంకేతం అని చెప్పవచ్చు.

లేత నీలం, గులాబీ గోర్లు

మీ గోర్లు లేత నీలం లేదా గులాబీ రంగులో కనిపిస్తే, శరీరానికి తగినంత ఆక్సిజన్ అందడం లేదని అర్థం. ఇది ఊపిరితిత్తులకు, గుండె సమస్యలను సూచిస్తుంది. అలాగే, పింక్ గోర్లు తీవ్రమైన అనారోగ్యానికి కారణంగా ఉంటుంది. గుండె జబ్బులు, తీవ్రమైన ఇన్ఫెక్షన్ మొదలైనవాటిని సూచిస్తుంది.

నివారణ పద్ధతులు

గోర్లపై ఇలాంటి మార్పులు కనిపిస్తే జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. ఆహారంలో ఆకుకూరలు తీసుకోవాలి. మీరు గోరు రంగులో మార్పులు లేదా ఏవైనా ఇతర మార్పులను గమనించినట్లయితే, ముందుగా మీ వైద్యుడిని సంప్రదించండి. ప్రతిరోజూ ఎక్కువ పండ్లు తినండి, ఇది శరీరంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. అలాగే రోజూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. ఇది మీ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుతుంది.

టాపిక్

తదుపరి వ్యాసం