తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Moto G62 5g । మోటోరోలా నుంచి మరో 5g స్మార్ట్‌ఫోన్‌ విడుదల, డిస్కౌంట్ ఆఫర్స్ ఇవే!

Moto G62 5G । మోటోరోలా నుంచి మరో 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల, డిస్కౌంట్ ఆఫర్స్ ఇవే!

HT Telugu Desk HT Telugu

11 August 2022, 14:43 IST

    • భారతీయ మార్కెట్లో Motorola Moto G62 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదలయింది. దీని ధరలు రూ. 18 వేల నుంచి ప్రారంభమవుతున్నాయి. అయితే వివిధ బ్యాంకులు రూ. 1500 వరకు డిస్కౌంట్స్ ఇస్తున్నాయి. వివరాలు చూడండి.
Moto G62 5G
Moto G62 5G

Moto G62 5G

మోటోరోలా కంపెనీ తమ G-సిరీస్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తోంది. వరుసగా ఫోన్లను విడుదల చేస్తూ దూకుడు మీద ఉంది. తాజాగా Moto G62 పేరుతో మరో 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. అందుబాటు ధరలో ఉత్తమమైన ఫీచర్లను కంపెనీ అందిస్తోంది. Moto G62 5Gలో మెరుగైన 5,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP52 రేటింగ్, 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వంటివి ప్రధాన అంశాలుగా చెప్పవచ్చు.

Moto G62 5G ప్రస్తుతం ఆండ్రాయిడ్ 12 OS ఆధారంగా పనిచేస్తుంది. త్వరలో ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్‌ను కూడా పొందుతుంది.

ర్యామ్ ఆధారంగా ఈ ఫోన్ రెండు కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. అలాగే మిడ్‌నైట్ గ్రే, ఫ్రాస్టెడ్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

ఇంకా ఈ హ్యాండ్‌సెట్లో మిగతా ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర తదితర వివరాలపై ఒక లుక్ వేయండి..

Moto G62 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.6 అంగుళాల OLED FHD+ డిస్‌ప్లే
  • 6GB/8GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 480 ప్లస్ ప్రాసెసర్
  • వెనకవైపు 50 మెగా పిక్సెల్ + 8MP + 2MP ట్రిపుల్ కెమెరా, ముందు భాగంలో 16 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 20W ఛార్జర్

Moto G62 5G ఫోన్ 6GBRAM + 128GB స్టోరేజ్ వేరియంట్ కోసం ధర రూ. 17,999/-

8GBRAM + 128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ధర రూ. 19,999/-

ఈ ఫోన్ ఆగస్టు 19 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది. HDFC బ్యాంక్ కార్డ్ హోల్డర్లు స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ. 1,500 తగ్గింపును పొందవచ్చు. సిటీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డులను కలిగి ఉన్నవారు Moto G62 5G కొనుగోలుపై 10 శాతం తగ్గింపును పొందుతారు.

టాపిక్

తదుపరి వ్యాసం