తెలుగు న్యూస్  /  Lifestyle  /  Most Effective And Quick Weight Loss Tips Are Here

Weight Loss Tips | వేగంగా బరువు తగ్గేందుకు.. వీటిని ట్రై చేయాల్సిందే..

25 March 2022, 8:13 IST

    • బరువు తగ్గడమనేది మనలో చాలా మందికి ఉన్న ఓ పెద్ద పని. దీని కోసం జిమ్​లకు వెళ్లి కష్టపడతారు. నోరు కట్టుకుని కడుపు మాడ్చుకుంటూ ఉంటారు. అయినా కొన్నిసార్లు ఎక్కడో జరిగే లోపం వల్ల బరువు తగ్గడం కూడా జరగదు. అలాంటప్పుడు కొందరు ఫ్యాట్ బర్నర్​లను ఆశ్రయిస్తారు. ఇవి ఆరోగ్యానికి మంచివి కాదు అని తెలిసినా.. బరువు తగ్గాలనే కోరికతో వీటిని వాడతారు. అలాంటివారికి సహజ మార్గాల్లోనే బరువు తగ్గేందుకు కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. వీటితో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి.. మీరు వీటిని వాడి బరువు తగ్గవచ్చు.
బరువు తగ్గేందుకు చిట్కాలు
బరువు తగ్గేందుకు చిట్కాలు

బరువు తగ్గేందుకు చిట్కాలు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోషకాహార నిపుణులు ఆరోగ్యకరమైన జీవనం కోసం బరువు తగ్గాలని ప్రజలకు సూచిస్తున్నారు. చాలా మంది నిపుణులు జిమ్‌లో గంటలు గడపడానికి బదులుగా శరీరంలోని కొవ్వును విచ్ఛిన్నం చేయడానికి సహజ మార్గాలను పంచుకుంటున్నారు. ఎటువంటి సప్లిమెంట్లు లేదా ఫ్యాట్ బర్నర్‌లను ఉపయోగించకుండా బరువు తగ్గడానికి మార్గాలు ఉన్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. చాలా వేగంగా బరువు తగ్గడానికి ఇక్కడ కొన్ని సహజ మార్గాలను సూచిస్తున్నారు. ఈ పద్ధతులు ఎటువంటి దుష్ప్రభావాలను చూపించవు కాబట్టి.. సందేహం లేకుండా వాటిని ప్రయత్నించవచ్చని తెలుపుతున్నారు.

ఈ సహజమైన మార్గాలలో మీరు కొన్ని ఆహారాలను కలిపి తీసుకోవాలి. ఇలా ఆహార పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల కూడా మీరు బరువు వేగంగా తగ్గవచ్చు. పైగా వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవు. అంటున్నారు నిపుణులు.. మరి ఆ కాంబినేషన్​లు ఏంటో ఓ లుక్కేద్దాం.

ఓట్ మీల్, వాల్నట్

ఓట్ మీల్​లో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. వాల్‌నట్ మంచి కొవ్వు, ప్రోటీన్, ఫైబర్‌ని అందిస్తుంది. ఇవి రెండూ కలిపి తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన సమతుల్య పోషణను లభిస్తుంది. అంతే కాకుండా ఇది బరువును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది.

పీనట్ బటర్, అరటి

చాలా మంది అరటిపండు తింటే లావు అవుతారని భావిస్తారు. ఇందులో మంచి పిండి పదార్థాలు, ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. పీనట్ బటర్​తో పాటు తినడం వల్ల ఆరోగ్యంతో పాటు రుచిని పొందవచ్చు. ఇది ప్రోటీన్​కు మంచి మూలం. మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే.. మీరు ఖచ్చితంగా దీనిని ప్రయత్నించాల్సిందే.

గుడ్డు, క్యాప్సికమ్

గుడ్లు ఉత్తమ జీవక్రియ బూస్టర్లు. ప్రోటీన్-రిచ్ ఫుడ్, విటమిన్-సి రిచ్ ఉండే క్యాప్సికమ్‌తో తీసుకుంటే ఎక్కువ కాలం ఆకలి బాధలను అరికట్టవచ్చు. ఇది శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు మొత్తాన్ని కూడా తగ్గిస్తుంది.

ఆకుకూరలు, అవకాడో

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ విటమిన్లు, మినరల్స్​తో నిండి ఉంటాయి. అవకాడోతో కలిపి వీటిని తీసుకుంటే అవి మంచి కొవ్వుకు మూలంగా ఉంటాయి. ఇవి ఆకలిని నియంత్రించడంలో మీకు సహాయపడతాయి.

డార్క్ చాక్లెట్, బాదం

అవును అండి.. డార్క్ చాక్లెట్ బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది. డార్క్ చాక్లెట్​లో మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లను కలిగి ఉంటాయి. ఇది జీవక్రియను పెంచుతుంది. అంతే కాకుండా కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది.

బాదంలో ప్రోటీన్, ఫైబర్ ఉంటుంది. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. డార్క్ చాక్లెట్‌తో కలిసి తీసుకుంటే.. ఇవి వేగంగా బరువు తగ్గడానికి సహాయం చేస్తాయి.

టాపిక్