తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Monsoon Women Health : వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మహిళలకు ఆ ఇన్ఫెక్షన్లు రావు!

Monsoon Women Health : వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మహిళలకు ఆ ఇన్ఫెక్షన్లు రావు!

HT Telugu Desk HT Telugu

07 August 2023, 14:16 IST

    • Monsoon Women Health : వర్షాకాలంలో చాలా రోగాలు వస్తాయి. ముఖ్యంగా మహిళలు ప్రతీ విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలి. చిన్న ఆరోగ్య సమస్యలే పెద్ద ప్రమాదాన్ని తీసుకొస్తాయి. మహిళ ఆరోగ్యం గురించి వైద్యులు అందించిన కొన్ని చిట్కాలు కింద ఉన్నాయి.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unsplash)

ప్రతీకాత్మక చిత్రం

వర్షాకాలం వచ్చిందంటే వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. దీంతో అప్పటి వరకు విపరీతమైన ఎండల నుంచి విసిగిపోయిన ప్రజలు ఉపశమనం పొందుతారు. చాలా మందికి వర్షంలో తడవడం ఇష్టం. అయితే ఇలా వర్షంలో తడిస్తే సీజనల్ వ్యాధుల బారిన పడాల్సి వస్తుందని విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ హారిక ఉప్పలపాటి అంటున్నారు. ముఖ్యంగా మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఈ సీజన్‌లో మహిళలు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలపై మాట్లాడారు. మహిళలలు వర్షాకాలంలో ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండటానికి కొన్ని విలువైన చిట్కాలను అందించారు.

వర్షాకాలంలో ఆరోగ్య సమస్యలు

వైరల్ ఫీవర్, ఇన్ఫ్లుఎంజా, మలేరియా, డెంగ్యూ, పింక్ ఐ (కండ్లకలక), చికెన్ గున్యా, కలరా, టైఫాయిడ్, లెప్టోస్పిరోసిస్, స్కిన్ ఇన్ఫెక్షన్లు - చర్మం యొక్క ఫంగల్ ఇన్ఫెక్షన్లు, మూత్ర మార్గ అంటువ్యాధులు, విటమిన్-డి లోపం, ఆస్తమా , అలెర్జీలు, నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు, అమీబిక్ విరేచనాలు,

రోగనిరోధక శక్తిని పెంచుకునేందు తినాల్సినవి..

కూరగాయల సూప్‌లు, మొలకలు, మొక్కజొన్న, తేనెతో హెర్బల్ టీ, మసాలా చాయ్, నిమ్మ, పుదీనా ఆకులు, డ్రై ఫ్రూట్స్ & నట్స్, ప్రోబయోటిక్స్ - పెరుగు, మజ్జిగ, పండ్లు, ఉడికించిన కూరగాయలు, ఆకు కూరలు, వెల్లుల్లి, కాకరకాయ, సీసా పొట్లకాయ

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

మలేరియా డెంగ్యూ, లెప్టోస్పిరోసిస్ మరియు చికున్‌గున్యా దోమల ద్వారా వ్యాపిస్తాయి. కాబట్టి మీరు నివసించే ప్రాంతంలో మరియు చుట్టుపక్కల దోమలు వృద్ధి చెందకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. నిండు చేతుల దుస్తులు ధరించాలి. దోమల నివారణ మందులు, దోమ తెరలను ఉపయోగించడం మంచిది.

హెపటైటిస్ ఎ , హెపటైటిస్ ఇ, కలరా, టైఫాయిడ్, గ్యాస్ట్రోఎంటెరిటిస్ వంటి నీటి ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు, సరైన పారిశుధ్యం, పరిశుభ్రత, టైఫాయిడ్ రాకుండా టీకాలను వేసుకోవడం ముఖ్యం. తాజా పండ్లు, కూరగాయలు తినడం, పరిశుభ్రత పాటించడం, తరచుగా చేతులు కడుక్కోవడం మంచిది.

ఇన్ఫ్లుఎంజాను నిరోధించడానికి సంవత్సరానికి ఒకసారి యాంటీఫ్లూ టీకాలు వేసుకోవడం, ఆరోగ్యకరమైన సమతుల్య పోషక ఆహారం తీసుకోవడం మంచిది. శుభ్రమైన కాచి వడగార్చిన నీరు తాగాలి, వీధుల్లోని జంక్ ఫుడ్ మానుకోండి, 7-8 గంటల తగినంత నిద్ర పోవడంతో పాటు, వ్యాయామ నియమాన్ని పాటించండి. సాధ్యమైనంత వరకు వర్షంలో తడవకుండా ఉండండి. పండ్లు మరియు కూరగాయలను శుభ్రాంగా కడగాలి. రోజూ 2-3 లీటర్ల నీరు తాగాలి. రోజువారీ ఆహారంలో విటమిన్ సి ఎక్కువగా కలిగిన పదార్థాలను పెంచండి. పెరుగు, మజ్జిగ వంటి ప్రోబయోటిక్ పదార్థాలను తీసుకోవడం వలన అవి మీ పోషకాలను గ్రహించేలా చేయగలవు.

తడిసిన బూట్లు ధరించవద్దు, మీరు షూలను మళ్లీ ధరించే ముందు సరిగ్గా శుభ్రం చేసి, వాటిని ఆరబెట్టండి. కండ్లకలక నుండి రక్షించడానికి జబ్బుపడిన వ్యక్తులకు దూరంగా ఉండండి. అలెర్జీల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి, తద్వారా మీరు దుమ్ము, ఆవిరి లేదా కాలుష్యానికి అలెర్జీ అయినట్లయితే, మీరు బయటకు వెళ్లినప్పుడు మాస్క్ ధరించండి. మీ గోళ్లను శుభ్రంగా ఉంచుకోండి. గోళ్లపై బ్యాక్టీరియా, ఫంగస్ పేరుకుపోకుండా వాటిని కత్తిరించండి.

ఇన్ఫెక్షన్‌లను నివారించడానికి చిట్కాలు

ఎ) మీ ప్రైవేటు భాగాలను పొడిగా ఉంచండి, బిగుతుగా ఉండే దుస్తులను నివారించండి. గాలి ప్రసరించే విధంగా కాటన్ లోదుస్తులను ధరించండి

బి) యూటీ ఐ మరియు ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడం ద్వారా శరీరం నుండి విసర్జనాలను బయటకు పంపడంలో హైడ్రేషన్ కీలకం.

సి) యోని ఆరోగ్యానికి ప్రోబయోటిక్స్ - యోగర్ట్ అండ్ టెర్మినేటెడ్ ఉత్పత్తులు అధికంగా ఉండే ఆహారాన్ని మీ రోజూవారీ ఆహారంలో చేర్చండి. ఈ ఆహారాలు ఆరోగ్యకరమైనవి. యోనిలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెంచడంలో సహాయపడతాయి. కాండిడా వంటి ఈస్ట్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

ఈ సాధారణ జాగ్రత్తలు పాటించడం ద్వారా మంచి వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను ఏర్పాటు చేసుకోవడం ద్వారా, మహిళలు వర్షాకాలంలో తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వడం, సరైన పారిశుధ్యాన్ని నిర్వహించడం, అవసరమైనప్పుడు సకాలంలో వైద్య సహాయం తీసుకోవడం మంచిది.

తదుపరి వ్యాసం