తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Monday Motivation | కలలు నెరవేర్చుకోండి.. జీవితాన్ని జ్ఞాపకాలతో నింపేసుకోండి..

Monday Motivation | కలలు నెరవేర్చుకోండి.. జీవితాన్ని జ్ఞాపకాలతో నింపేసుకోండి..

HT Telugu Desk HT Telugu

04 May 2022, 11:00 IST

google News
    • మనం బాధ్యత వహించేవారిపట్ల మన కర్తవ్యాలు నిర్వహించడం ముఖ్యం. కానీ మన సొంత మార్గంలో ప్రపంచాన్ని అన్వేషించడం కూడా అంతే ముఖ్యం. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం కచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. కలలు కనాలి. వాటిని సాకారం చేసుకునేందుకు కృషి చేయాలి.
కలలు సాకారం చేసుకోండి
కలలు సాకారం చేసుకోండి

కలలు సాకారం చేసుకోండి

Monday Motivation | మనలో కొందరు స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు. మరి కొందరు ఒంటరిగా ప్రయాణించి కొత్త ప్రదేలను కనుగొనడానికి ఇష్టపడతారు. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసేవాళ్లు చాలామందే ఉన్నారు. తమవారికి ఏ లోటు రాకుండా చూసుకుంటూ.. తమ లక్ష్యాలను సాధిస్తారు. ప్రతి ఒక్కరికీ ఏదొక డ్రీమ్ ఉంటాది. ఇలా అవ్వాలి. ఫలానాది సాధించాలి. తమ వారిని మంచిగా చూసుకోవాలని కలలు కంటారు. వాటిని సాధించేందుకు చాలా కష్టపడతారు. ఒక్కోసారి తమవారి కోసం వారి కలలను వదిలివేసుకుంటారు. వదిలేయాల్సిన పరిస్థితి కూడా రావొచ్చు. కానీ పరిస్థితుల కోసమో, వేరే వారి కోసమో కలలు కనడం మానేయకూడదు.

జీవితం చాలా చిన్నది. కాబట్టి మనకు లభించే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి క్షణాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలి. ఎదుటివారి అవసరాలు తీర్చడంలోనే మునిగిపోకుండా.. మీ కోసం కొంత సమయాన్ని వెచ్చించండి. మీ కోరికలను తీర్చుకోండి. ఈ జ్ఞాపకాలు జీవితంలో మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. మనకు ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కోవడంలో సహాయపడతాయి. వర్తమానంలో జీవించండి. భవిష్యత్తు కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. కోరుకున్నది చేయట్లేదు, జరగట్లేదని బాధపడకండి. మీ కలలను సాకారం చేసుకోవడానికి మీ వంతు కృషి చేయండి.

టాపిక్

తదుపరి వ్యాసం