తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mokkajonna Garelu: మొక్కజొన్న గారెలను క్రిస్పీగా ఇలా చేసేయండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది

Mokkajonna Garelu: మొక్కజొన్న గారెలను క్రిస్పీగా ఇలా చేసేయండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది

Haritha Chappa HT Telugu

31 December 2023, 6:00 IST

google News
    • Mokkajonna Garelu: ఎప్పుడూ మినప్పప్పుతో చేసే గారెలు తింటే బోర్ కొట్టేస్తుంది, ఒకసారి మొక్కజొన్న గారెలు తిని చూడండి.
మొక్కజొన్న గారెలు
మొక్కజొన్న గారెలు (Unsplash)

మొక్కజొన్న గారెలు

Mokkajonna Garelu: మొక్కజొన్న నుంచి తీసిన గింజలతో చేసే మొక్కజొన్నగారెలు చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటాయి. వీటిని తయారు చేయడం చాలా సులువు. మొక్కజొన్న గారెలు ఎలా చేయాలో ఒకసారి చూద్దాం.

మొక్కజొన్న గారెలు రెసిపీకి కావాల్సిన పదార్థాలు

మొక్కజొన్న గింజలు - రెండు కప్పులు

పచ్చిమిర్చి - రెండు

అల్లం - చిన్న ముక్క

వెల్లుల్లి రెబ్బలు - ఐదు

జీలకర్ర - అర స్పూను

శెనగపిండి - ఒక స్పూను

కరివేపాకు - గుప్పెడు

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

ధనియాల పొడి - అర స్పూను

గరం మసాలా - పావు స్పూను

పసుపు - పావు స్పూను

ఉల్లిపాయ - ఒకటి

నూనె - సరిపడినంత

ఉప్పు - రుచికి సరిపడా

మొక్కజొన్న గారెల రెసిపీ

1. మొక్కజొన్న గింజలను ముందుగానే నీటిలో వేసి నానబెట్టుకోవాలి.

2. వాటిని వడకట్టి మిక్సీ జార్లో వేయాలి. వాటితో పాటు పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చి రుచికి సరిపడా ఉప్పు వేసి రుబ్బుకోవాలి.

3. మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా రుబ్బుకోవాలి.

4. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేయాలి.

5. ఆ గిన్నెలో బియ్యప్పిండి, సెనగపిండి, కొత్తిమీర, పుదీనా, తరిగిన ఉల్లిపాయలు, గరం మసాలా, పసుపు అన్ని వేసి బాగా కలుపుకోవాలి.

6. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

7. నూనె వేడెక్కాక పిండిని గారెలుగా ఒత్తుకొని నూనెలో వేసి వేయించాలి.

8. అవి రెండు వైపులా ఎర్రగా వేగాక తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి.

9. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. దీన్ని బ్రేక్ ఫాస్ట్ టైంల నైనా తినవచ్చు లేదా స్నాక్స్‌గా తినవచ్చు.

తదుపరి వ్యాసం