తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Masala Puri: మైదాతో చేసే పూరీ ఆరోగ్యానికి హానికరం, అందుకే బియ్యప్పిండితో ఇలా మసాలా పూరీ చేసేయండి

Masala Puri: మైదాతో చేసే పూరీ ఆరోగ్యానికి హానికరం, అందుకే బియ్యప్పిండితో ఇలా మసాలా పూరీ చేసేయండి

Haritha Chappa HT Telugu

23 September 2024, 17:48 IST

google News
    • Masala Puri: బియ్యప్పిండితో చేసే పూరీలు టేస్టీగా ఉంటాయి. మైదాతో చేసే పూరీలు ఆరోగ్యానికి హానికరం. బియ్యం పిండితో మసాలా పూరీ రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
మసాలా పూరీ రెసిపీ
మసాలా పూరీ రెసిపీ

మసాలా పూరీ రెసిపీ

Masala Puri: పూరీలు ఎక్కువమందికి ఇష్టమైన ఫుడ్. అయితే దీన్ని ఎక్కువగా మైదాతోనే చేస్తారు. మైదాలో అనేక రసాయనాలు కలపడం వల్ల ఇది ఆరోగ్యానికి హాని చేస్తుంది. కాబట్టి మైదాతో మానేసి బియ్యప్పిండితో చేసుకొని చూడండి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. గోధుమపిండితో కూడా పూరీలు చేయవచ్చు. బియ్యప్పిండితో చేసే పూరీలు కాస్తా క్రిస్పీగా పిల్లలకు నచ్చేలా ఉంటాయి. వీటిలో అనేక రకాల పదార్థాలు వేసి స్పైసీగా మసాలా పూరీ తయారు చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో తెలుసుకోండి.

మసాలా పూరీ రెసిపీకి కావలసిన పదార్థాలు

బియ్యప్పిండి - రెండు కప్పులు

అల్లం ముక్క - ఒకటి

వెల్లుల్లి రెబ్బలు - ఏడూ

ఉల్లిపాయ - ఒకటి

పచ్చిమిర్చి - ఐదు

నెయ్యి - ఒక స్పూను

కరివేపాకులు - గుప్పెడు

జీలకర్ర - ఒక స్పూను

సోంపు - అర స్పూను

నువ్వుల గింజలు - రెండు స్పూన్లు

ఉప్పు - రుచికి సరిపడా

మసాలా పూరీ రెసిపీ

1. రెండు కప్పుల బియ్యం పిండిని ఒక గిన్నెలో వేయండి.

2. మిక్సీ జార్ లో పచ్చిమిర్చి, ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి.

3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయండి.

4. అవసరమైతే నూనె కూడా వేసుకోవచ్చు. ముందుగా రుబ్బుకున్న పేస్టును ఆ నూనెలో వేసి వేయించండి.

5. ఒక నిమిషం పాటు వేయించాక సన్నగా తరిగిన కరివేపాకులను, రెండు కప్పుల నీటిని జీలకర్ర, సోంపు, నువ్వులు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి.

6. ఆ నీటిలో బియ్యప్పిండిని మెల్లగా వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండండి.

7. ఈ మిశ్రమం గట్టిగా దగ్గరకు వచ్చేవరకు చిన్న మంట మీద ఉడికిస్తూ ఉండండి. గరిటెతో కలుపుతూ ఉండండి.

8. అంతా గట్టి మిశ్రమంలో అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పైన మూత పెట్టండి.

9. పది నిమిషాల తర్వాత దాన్ని చేతితోనే చపాతీ పిండిలాగా బాగా కలపండి.

10. నూనె లేదా నెయ్యి వేసి బాగా కలుపుకోండి.

11. ఇప్పుడు చేతులు కూడా కాస్త నూనె రాసుకొని చిన్న ముద్దను అందులోంచి తీసి పూరీలాగా ఒత్తుకోండి. చేత్తో ఒత్తుకున్నా సరిపోతుంది. ః

12. ఇప్పుడు స్టవ్ మీద పడి కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేయండి.

13. ఆ నూనెలో ఈ పూరీలను వేసి వేయించండి. రెండు వైపులా ఎర్రగా అయ్యేవరకు వేయించాక స్టవ్ ఆఫ్ చేయండి.

14. అంతే టేస్టీ మసాలా పూరి రెడీ అయిపోతుంది.

15. దీన్ని ఏ కూర పచ్చడి లేకుండా కూడా తినొచ్చు, లేదా కొబ్బరి పచ్చడితో తినవచ్చు. చికెన్ కర్రీతో తిన్నా కూడా టేస్టీగా ఉంటుంది.

16. ఒకసారి దీన్ని వండుకొని చూడండి మీకు నచ్చడం ఖాయం.

టాపిక్

తదుపరి వ్యాసం