తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bread Rasgulla: మిగిలిపోయిన బ్రెడ్‌తో టేస్టీ రసగుల్లా ఇలా చేసేయండి

Bread Rasgulla: మిగిలిపోయిన బ్రెడ్‌తో టేస్టీ రసగుల్లా ఇలా చేసేయండి

Haritha Chappa HT Telugu

07 August 2024, 17:30 IST

google News
  • Bread Rasgulla: రసగుల్లా పేరు చెబితేనే నోరూరిపోతుంది. దీన్ని ప్రతిసారి కొనుక్కునే కన్నా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. ఇంట్లో మిగిలిపోయిన బ్రెడ్‌తో రసగుల్లా చేయడం ఎలాగో తెలుసుకోండి.

బ్రెడ్ రసగుల్లా రెసిపీ
బ్రెడ్ రసగుల్లా రెసిపీ

బ్రెడ్ రసగుల్లా రెసిపీ

ఉదయం అల్పాహారంలో శాండ్ విచ్‌లు, టోస్ట్ చేసేందుకు బ్రెడ్‌ను అధికంగా వాడుతారు. బ్రెడ్ మిగిలిపోవడం సాధారణంగా ప్రతి ఇంట్లో జరుగుతుంది. ఈ కారణంగా మిగిలిపోయిన రొట్టెను చాలా ఇళ్లలో పడేస్తారు. మీరు మిగిలిపోయిన బ్రెడ్ ను పడేయకుండా టేస్టీ తీపి వంటకం రసగుల్లా చేయచ్చు. ఈ రుచికరమైన డెజర్ట్ రెసిపీ పేరు బ్రెడ్ రసగుల్లా. బ్రెడ్ రసగుల్లాను చేయడం చాలా సులువు. ఈ రసగుల్లా చాలా రుచిగా ఉంటుంది. ఈ రసగుల్లా తయారు చేయడం చాలా సులభం. దీన్ని పిల్లలకు చేసి పెట్టండి వారికి కచ్చితంగా నచ్చుతుంది.

బ్రెడ్ రసగుల్లా రెసిపీకి కావలసిన పదార్థాలు

బ్రెడ్ ముక్కలు - అయిదు

పాలు - ఒక కప్పు

పంచదార - ఒక కప్పు

నీరు - ఒక కప్పు

యాలకుల పొడి - అర స్పూను

నట్స్ - పావు కప్పు

నిమ్మరసం - ఒక స్పూను

బ్రెడ్ రసగుల్లా రెసిపీ

  1. ఇంట్లో మిగిలిపోయిన బ్రెడ్ ముక్కల అంచులను కత్తిరించి చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
  2. స్టవ్ మీద కళాయి పెట్టి బాణలిలో పాలు వేసి వేడి చేయాలి.
  3. అందులో నిమ్మరసం వేసి పాలను విరగ్గొట్టాలి.
  4. పాలు విరిగాక నీళ్లను వడకట్టి పనీర్ మిశ్రమాన్ని వేరు చేసి పక్కన పెట్టాలి.
  5. చల్లటి నీటిలో ఆ పనీర్‌ను వేసి తీసి పక్కన పెట్టాలి.
  6. ఇప్పుడు ఒక గిన్నెలో ఆ పనీర్ మిశ్రమాన్ని, బ్రెడ్ ముక్కలు వేసి బాగా కలపాలి.
  7. ఈ మిశ్రమాన్ని ఒకసారి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకుని తీసి పక్కన పెట్టుకోవాలి.
  8. ఆ మిశ్రమాన్ని తీసి ఒక గిన్నెలో వేసి చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి.
  9. ఈలోపు రసగుల్లా సిరప్ తయారు చేసుకోవాలి.
  10. ఒక కళాయిలో నీరు, పంచదార వేసి మరిగించాలి. అందులో యాలకుల పొడిని వేయాలి.
  11. మరుగుతున్న పంచదార సిరప్ లో ముందుగా సిద్ధం చేసుకున్న లడ్డూలు వేసి 15 నిమిషాలు ఉడికించాలి.
  12. అంతే టేస్టీ బ్రెడ్ రసగుల్లాలు రెడీ. పైన నట్స్ ను తరిగి చల్లుకుంటే ఇవి మరింత రుచిగా ఉంటాయి.

తదుపరి వ్యాసం