Nita Ambani Sarees: నీతా అంబానీ కట్టిన ఖరీదైన చీరలు చూడండి, మహారాణులు గుర్తు రావడం ఖాయం
01 November 2024, 19:00 IST
Nita Ambani Sarees: నీతా అంబానీ తన 60వ పుట్టినరోజును పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఆమె ట్రెండింగ్ లో ఉంది. ఆమె ప్రతిసారి ఎంతో అందంగా, ట్రెడిషనల్‌గా రెడీ అవుతుంది. ఆమె కట్టిన చీరల్లో అందమైన, ఖరీదైనవి ఇవిగో.
అందమైన చీరల్లో నీతా అంబానీ
నీతా అంబానీ తన 60వ పుట్టినరోజును నవంబర్ 1న నిర్వహించుకున్నారు. వ్యాపారవేత్తగా, విద్యావేత్తగా, పరోపకారిగా ఆమె ఎందరికో మార్గనిర్ధేశకురాలు. ఆమె ఫ్యాషన్ ప్రేమికులు కూడా. ఆమెకు చీరలపై అమిత ప్రేమ. ఎలాంటి ఈవెంట్ అయిన ఖరీదైన, అందమైన చీరలో మెరిసిపోతుంది నీతా. సంప్రదాయ కంజీవరం చీరల నుంచి సిల్కు చీరల వరకు నీతా అంబానీ వందల చీరలను వాడుతూ ఉంటుంది. ఆమె కట్టిన అందమైన చీరల్లో కొన్నింటిని ఎంపిక చేసి ఇక్కడ మేము ఇచ్చాము.
ప్రకాశవంతమైన ఎరుపు చీర
నీతా అంబానీ ఎరుపు రంగు ప్రకాశవంతమైన చీరలో అందంగా మెరిసిపోతోంది. ఆమె ఈ చీర కట్టులో భుజం మీద నుండి పల్లు సొగసుగా పడిపోయేలా వేసుకుంది. దానికి సరిపోయే షిమ్మర్ బ్లౌజ్, డైమండ్ జువెలరీ, మెరిసే ఎరుపు రంగు క్లచ్ ధరించి చక్కని గ్లామర్ ను ప్రదర్శించింది.
ఊదారంగు అలంకరించిన బందానీ చీర
పర్పుల్ బంధని చీరలో నీతా అంబానీ సంప్రదాయ వస్త్రాలను మోడ్రన్ గ్లామర్ తో ఎలా మిళితం చేయాలో ప్రదర్శించారు. అనేక రంగుల మిళితమై చేసిన ఎంబ్రాయిడరీతో అలంకరించిన బ్లౌజ్ ఎంతో అందంగా ఉంది. ఆమె తన రూపాన్ని పూర్తి చేయడానికి అనేక లేయర్ ముత్యాల నెక్లెస్ తో జత చేసింది.
సొగసైన తెల్ల చీర
నీతా అంబానీ కట్టుకున్న తెల్లని చీర హుందాతనానికి ప్రతీకలా ఉంది. సంక్లిష్టమైన పూల నమూనాలతో, మంత్రముగ్ధులను చేసే బంగారు అంచులతో అలంకరించిన ఈ చీరలో మహారాణిని గుర్తుకు తెస్తుంది. భుజం మీద నుంచి పల్లును అందంగా జారవిడిచినట్టు ఉంది. మోచేయి వరకు పొడవు స్లీవ్స్ తో కూడిన సొగసైన తెల్లటి బ్లౌజ్ తో నీతా చాలా అందంగా కనిపించింది.
మనీష్ మల్హోత్రా బనారసి
ఖరీదైన బనారసీ వస్త్రంతో తయారు చేసిన కస్టమ్ మనీష్ మల్హోత్రా చీరలో ఆమె రాయల్టీని ప్రదర్శించారు. ఈ చీరలో సంక్లిష్టమైన ఊదా, బంగారు పూల ఎంబ్రాయిడరీ ఉంది, అద్భుతమైన బంగారు అంచులతో పూలతో ఈ చీర కళ్లు తిప్పుకోలేని విధంగా ఉంది. సొగసైన స్టేట్మెంట్ ఆభరణాలతో అలంకరించిన పర్పుల్ బ్లౌజ్తో జత చేసిన ఆమె లుక్ ఆకట్టుకునేలా ఉంది.
చేనేత కాంచీపురం చీర
స్వదేశ్ డిజైన్ చేసిన నీతా అంబానీ చీరలో నిపుణులైన కళాకారులు కష్టం కనిపిస్తుంది. ఎరుపు-గులాబీ రంగు మిళితమైన ఈ చీర సంప్రదాయ కాంచీపురం పట్టుచీర ఆకృతులను కలిగి, భారతదేశ ఆధ్యాత్మిక వైభవానికి చిహ్నంలా నిలిచింది.
పింక్ బనారసి చీర
మాస్టర్ ఆర్టిజన్ ఇక్బాల్ అహ్మద్ తయారు చేసిన బనారసి బ్రోకేడ్ చీరలో నీతా అంబానీ చాలా అందంగా కనిపిస్తుంది. అద్భుతమైన లావెండర్ ఫ్యాబ్రిక్ దాని క్లిష్టమైన రోజ్-గోల్డ్ జరీ డిజైన్తో వారణాసికి చెందిన శతాబ్దాల పురాతన కళానైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఖరీదైన ముత్యాల నెక్లెస్, మెరిసే మేకప్ ఆమెకు ఎథ్నిక్ లుక్ ను అందించాయి.
టాపిక్