తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Krishna Janmashtami 2022 : కృష్ణాష్టమి జరుపుకోవడానికి శుభముహూర్తం ఇదే..

Krishna Janmashtami 2022 : కృష్ణాష్టమి జరుపుకోవడానికి శుభముహూర్తం ఇదే..

16 August 2022, 15:29 IST

google News
    • శ్రావణమాసంలో వచ్చే మరో ముఖ్యమైన పండుగ జన్మాష్టమి. ఈసారి కృష్ణాష్టమి ఆగష్టు 18, 19వ తేదీలలో జరుపుకుంటున్నారు. భాద్రపద మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. అందుకే ప్రతి సంవత్సరం జన్మాష్టమి నాడు శ్రీకృష్ణుని బాల రూపాన్ని పూజిస్తారు. శ్రీకృష్ణుని పూజించడానకి శుభముహూర్తం ఎప్పుడో తెలుసుకుందాం.
కృష్ణ జన్మాష్టమి 2022
కృష్ణ జన్మాష్టమి 2022

కృష్ణ జన్మాష్టమి 2022

Krishna Janmashtami 2022 : కృష్ణుడి జన్మదినాన్ని జరుపుకోవడాన్నే కృష్ణ జన్మాష్టమి అంటారు. జన్మాష్టమిని గోకులాష్టమి అని, కృష్ణాష్టమి అని కూడా అంటారు. దీనిని హిందూ మతంలో అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. శ్రావణమాసంలో జరిపే ఏ పండుగలకైనా ఓ ప్రత్యేకత ఉంటుంది. ఈ కృష్ణాష్టమిలో భాగంగా.. కృష్ణ భక్తులందరూ ఈ పండుగను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున విష్ణువు తన ఎనిమిదవ అవతారంగా శ్రీకృష్ణుడి రూపంలో జన్మించాడు. అందుకే ఈ పండుగను అద్భుతమైన ఉత్సాహంతో భక్తులు చేసుకుంటారు. పండుగను పురస్కరించుకుని దేవాలయాలు, నివాసాలు, ఇతర బహిరంగ ప్రదేశాలను అలంకరించారు. పిల్లలను కృష్ణుడిల్లా, గోపికల్లా తయారు చేస్తారు.

జన్మాష్టమి పూజ ఆచారాలు

ఎంతో ఉత్కంఠగా సాగే కృష్ణ జన్మాష్టమి రోజున కృష్ణుని ఊయలలో ఏర్పాటు చేసి పూజలు చేస్తారు. వెన్న, పంచదార కలిపి కృష్ణునికి ప్రసాదంగా సమర్పిస్తారు. ఈక్రమంలో భక్తులు ఉపవాసాన్ని పాటిస్తారు. సాయంత్రం పూజ తర్వాత ప్రసాదంతో ఉపవాసాన్ని విరమిస్తారు. కృష్ణుని జన్మదిన వేడుకల్లో.. ప్రజలు ఆర్తి, కీర్తన, భజన కూడా చేస్తారు. పిల్లలు శ్రీకృష్ణుని పాటలు పాడతారు. ప్రజలు దహీ-హండికి ప్రదర్శనలు ఇస్తారు. అన్ని కృష్ణ దేవాలయాలలో శ్రీకృష్ణుడు 56 రకాల భోగ్ ప్రసాదాలను అందిస్తారు. శ్రీకృష్ణుడు అర్ధరాత్రి వస్తాడని.. తన భక్తులు తయారుచేసిన భోగ్ ప్రసాదాన్ని భుజిస్తాడని గట్టిగా నమ్ముతారు.

కృష్ణ జన్మాష్టమిని జరుపుకోవడానికి శుభ ముహూర్తం

* ఆగస్టు 18వ తేదీ గురువారం రాత్రి 09:20 గంటలకు అష్టమి తిథి ప్రారంభమవుతుంది.

* ఆగస్టు 19వ తేదీ శుక్రవారం రాత్రి 10:59 గంటలకు అష్టమి తిథి ముగుస్తుంది.

* రోహిణి నక్షత్రం ఆగస్టు 20వ తేదీ శనివారం ఉదయం 01:53 గంటలకు ప్రారంభమవుతుంది.

* రోహిణి నక్షత్రం ఆగష్టు 21వ తేదీ ఆదివారం ఉదయం 04:40 గంటలకు ముగుస్తుంది.

తదుపరి వ్యాసం