తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mosquito Net Tips: దోమల మెష్‌లు కొంటున్నారా.. ఏవి మంచి ఎంపిక?

Mosquito net tips: దోమల మెష్‌లు కొంటున్నారా.. ఏవి మంచి ఎంపిక?

20 December 2023, 16:44 IST

google News
  • Mosquito net tips: ఇంటికోసం మస్కిటో నెట్ కొనుక్కునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అయితేనే దోమలు రాకుండా కాపాడగలం. ఆ టిప్స్ ఏంటో తెల్సుకోండి.

మస్కిటో నెట్ టిప్స్
మస్కిటో నెట్ టిప్స్ (freepik)

మస్కిటో నెట్ టిప్స్

ప్రాంతంతో సంబంధం లేకుండా దోమల బెడద అనేది ఎక్కడైనా ఉండే సాధారణ సమస్య. దోమలు, పురుగుల్లాంటివి ఇంటి లోపలకు వస్తే మనకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఆరోగ్యం దృష్ట్యా కూడా చాలా మంది కిటికీలు, గుమ్మాలకు మస్కిటో మెష్‌లను వేయించుకుంటూ ఉంటారు. కొందరు ఇవి వేయించుకున్నా సరే దోమలతో ఇబ్బందులు పడుతుంటారు. అలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మస్కిటో నెట్‌లు, మెష్‌లు, డోర్లు.. వీటిని ఏ సందర్భంలో ఎలా ఉపయోగించుకోవాలో అవగాహనతో ఉంటే ఈ సమస్య రాదు.

నిర్మాణ సమయంలో ఈ తప్పులొద్దు..

సొంత ఇంటిని నిర్మించుకునే సమయంలోనే దోమల మెష్‌ని ఏర్పాటు చేసుకోవాలని అనుకునే వారు దీనిపై శ్రద్ధ పెట్టాలి. కిటికీలు, తలుపులు చేయించుకునేప్పుడే ఎక్కడా సంధులు, ఖాళీలు రాకుండా లోపల సరిగ్గా సరిపోయే ఫ్రేము సైజులు చేయించుకుని ఇనుప మెష్‌లను తలుపులు చేసి ఏర్పాటు చేసుకోవచ్చు. అప్పుడు మాత్రంమే ఖాళీలు రాకుండా ఉంటాయి. మెష్‌లు పెట్టుకున్నందుకు ఉపయోగకరంగా ఉంటుంది. ఏ మాత్రం ఖాళీలు వచ్చినా దోమలు వాటి నుంచి లోపలికి వచ్చేస్తాయి.

మస్కిటో నెట్ రకాలెన్నో:

అదే కట్టిన ఇల్లు కొనుక్కున్న వారు ఏమాత్రం ఖాళీలు రాకుండా మెష్‌ తలుపులు చేయించుకోవడం కొంత కష్టమైన విషయం. తర్వాత పైన ఏర్పాటు చేసుకోవడం వల్ల ఉన్న దాన్ని బట్టి మెష్‌ తలుపులు చేయించుకోవాల్సిందే తప్ప.. ఎక్కడా ఖాళీ లేకుండా అంటే కొన్ని సార్లు కుదరకపోవచ్చు. ఇలాంటి వారు.. ఇప్పుడు మార్కెట్‌లో అందుబాటులో ఉండే స్లైడింగ్‌ మెష్‌ డోర్లను ఏర్పాటు చేయించుకోవచ్చు. అలాగే మ్యాగ్నటిక్‌ మస్కిటో నెట్‌ స్క్రీన్‌ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.

అద్దె ఇళ్లల్లో ఉండే వారు, కట్టేసిన ఇంటిని తీసుకున్న వారు కూడా గుమ్మాలకు మ్యాగ్నెటిక్‌ నెట్‌ స్క్రీన్లను పెట్టుకుంటే దోమల బెడద చాలా వరకు తగ్గుతుంది. అలాగే కిటికీలకు కూడా ఇలాంటి స్క్రీన్లను సులువుగా అంటించేయవచ్చు.

ఇప్పుడు కిటికీలకు, గుమ్మాలకూ కూడా స్లైడింగ్‌ మాస్కిటో నెట్‌లు వేసే ప్రొఫెషనల్స్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉంటున్నారు. వారు గుమ్మానికీ, స్లైడర్‌కి మధ్య ఏ మాత్రం ఖాళీ రాకుండా చూసి సరిగ్గా సరిపోయేలా వాటిని వేసి వెళతారు. పర్మినెంట్‌గా దోమల సమస్యలకు పరిష్కారం చెప్పాలనే సొంత ఇళ్లు ఉన్న వారు ఇలాంటి వాటిని ఎంచుకోవడం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది

ఇనుప మెష్‌ని తలుపులుగా కట్టి వేసుకోవాలని అనుకునే వారు మాత్రం ఇల్లు కట్టే సమయంలోనే ప్లాన్‌ చేసుకోవాలి తప్ప మిగిలిన సందర్భాల్లో నెట్‌ని మాత్రమే వాడుకోవడం అనేది ఉత్తమమైన నిర్ణయం. కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకుని మీ అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకోండి.

తదుపరి వ్యాసం