తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Meditation | ధ్యానం జీవిత అర్థాన్ని తెలుసుకునే ఒక సాధనం.. ఇలా అభ్యసించండి!

Meditation | ధ్యానం జీవిత అర్థాన్ని తెలుసుకునే ఒక సాధనం.. ఇలా అభ్యసించండి!

HT Telugu Desk HT Telugu

07 April 2022, 22:13 IST

google News
    • ధ్యానం - యోగా మధ్య తేడా ఏమిటి? ధ్యానంలో రకాలు ఉన్నాయా? వాటిని ఎలా అభ్యసించాలి? తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీ చదవండి. 
Meditation Budha
Meditation Budha (Pixabay)

Meditation Budha

అయోమయంలోనూ స్పష్టత కోసం, మెదడులో తీవ్రమైన గందరగోళ పరిస్థితులు ఉన్నపుడు కూడా ఏకాగ్రత సాధించడం కోసం, పరిపూర్ణమైన వ్యక్తిత్వం కోసం, వ్యక్తిగతంగా సంపూర్ణమైన శ్రేయస్సు కోసం ఏకైక పరిష్కారం ధ్యానం.

యోగా, ధ్యానం ఈ రెండు ఒకదానివెంట ఒకటి నడుస్తాయి. యోగా ఒక ఆచరణ అయితే ధ్యానం ఒక ప్రేరణ.

యోగాసనాలు శరీరానికి ఒక స్థిరత్వాన్ని కల్పిస్తే, ధ్యానం మనస్సుకు కల్పిస్తుంది. యోగాలో ధ్యానం ఒక ప్రత్యేకమైన ఉద్దేశ్యాన్ని కలిగి ఉంది. ప్రజలు తమ బాధలను అధిగమించడానికి, జీవితంలో లోతైన అర్థాన్ని కనుగొనడానికి అలాగే వాస్తవికతతో కనెక్ట్ అవ్వడానికి ధ్యానం ఒక ఆయుధంలా పనిచేస్తుంది.

హెచ్‌టి డిజిటల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డాక్టర్ చౌదరి ధ్యానంలో వివిధ రకాలు, వాటిని సాధన చేసే దశల గురించి తెలియజేశారు.

మనో ధ్యానం

- వాస్తవికతను తెలియజేస్తుంది. ఇది మీ శరీరం, మీ ఆలోచనల ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడంతో ప్రారంభమవుతుంది

- మీ ఆలోచనలను గమనించండి. అది మంచైనా, చెడైనా మీకు వచ్చే ప్రతీ ఆలోచనను గుర్తించండి.

- శ్వాస తీసుకుంటూ, రిలాక్స్ అవుతుండటం చేయండి. అన్నీ మరిచిపోయి ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించండి.

మంత్ర ధ్యానం

మంత్ర ధ్యానం లేదా జపం అనేది మన భారతీయ సంస్కృతి- సంప్రదాయాలలో ఎప్పట్నించో ఉంది. ఈ అభ్యాసంలో శబ్దాలను, పదాలను ఒక సరైన ఆరోహణ క్రమంలో బిగ్గరగా జపించాలి. మనస్సును ధ్వని, రాగంపై కేంద్రీకరించాలి.

- సౌకర్యవంతంగా కూర్చొని, మీ వీపును నిటారుగా ఉంచి చేతులు ముందుభాగంలో రిలాక్స్‌గా ఉంచాలి.

- రాగం, శబ్దంపై మనస్సు కేంద్రీకరించి పదబంధాన్ని పదే పదే గట్టిగా జపించండి.

- ఈ అభ్యాసం చేసేటపుడు వేరే ఏ ఆలోచనలు రాకూడదు. పూర్తి ఏకాగ్రతతో జపించాలి.

త్రాటక ధ్యానం

ఈ రకం ధ్యానం మీ మనస్సును పరధ్యానం నుంచి వాస్తవిక లోకంలోకి తీసుకురావడానికి, దృష్టిని ఒక చోట ఎలా కేంద్రీకరించడానికి సహాయపడుతుంది. కంటి కండరాలను బలోపేతం చేస్తుంది.

- కొవ్వొత్తిని వెలిగించి మీకు సరిగ్గా కనిపించే స్థాయిలో ఉంచండి.

- సౌకర్యవంతమైన ధ్యాన భంగిమలో కూర్చోండి, తొడలపై చేతులు సడలించండి. కొవ్వొత్తి వెలిగే మంట మధ్యలో చూడండి.

- రెప్పవేయకుండా కళ్లను స్థిరంగా ఉంచడానికి ప్రయత్నించండి. వీలైనంత ఎక్కువసేపు చూస్తూ, ఆపై మీకు అవసరమైనప్పుడు కళ్లు మూసుకోండి. ఇలా చేస్తూ ఉంటే ఫలితం మీకే తెలుస్తుంది.

ఇవే కాకుండా మరిన్ని ధ్యానంకు సంబంధించి ఇంకా రకాలు ఉన్నాయి. నిరంతర అభ్యాసం చేస్తే ఎన్నో మంచి ఫలితాలు ఉంటాయి.

టాపిక్

తదుపరి వ్యాసం