తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Decorate Large Walls: ఖాళీ గోడల్ని అదిరేలా అలంకరించుకునే ఆరు ఐడియాలు..

Decorate Large Walls: ఖాళీ గోడల్ని అదిరేలా అలంకరించుకునే ఆరు ఐడియాలు..

HT Telugu Desk HT Telugu

30 October 2023, 17:40 IST

  • Decorate Large Walls: ఇంట్లో పెద్దగా, ఖాళీగా ఉన్న గోడల్ని ఎలా అలంకరించుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ బెస్ట్ టిప్స్ మీకోసమే. వాటిని చదివి మీ ఇంటి గోడల్ని హుందాగా తీర్చిదిద్దేయండి. 

గోడల్ని అలంకరించుకునే మార్గాలు
గోడల్ని అలంకరించుకునే మార్గాలు (pexels)

గోడల్ని అలంకరించుకునే మార్గాలు

Decorate Large Walls:

ట్రెండింగ్ వార్తలు

Mango Fruit Bobbatlu: మామిడిపండు బొబ్బట్లు చేసి చూడండి, రుచి అదిరిపోతుంది

Pregnancy Tips : గర్భంతో ఉన్నప్పుడు బొప్పాయి ఎందుకు తినకూడదో అసలైన కారణాలు

Ashwagandha powder: ప్రతిరోజూ అశ్వగంధ చూర్ణాన్ని ఇలా తీసుకోండి, ఎలాంటి ఆరోగ్య సమస్యలే రావు

Ivy gourd and Diabetes: డయాబెటిస్ అదుపులో ఉండాలంటే ప్రతిరోజూ దొండకాయలు తింటే చాలు, వాటితో ఎన్నో అద్భుత ప్రయోజనాలు

ఇంటిని నిర్మించుకోవడం, దాన్ని మనకు నచ్చినట్లుగా తీర్చిదిద్దుకోవడం అనేది చాలా పెద్ద పనే అని చెప్పాలి. మన అభిరుచులను బట్టి ఇంటి డిజైనింగ్‌ తీరు మారిపోతూ ఉంటుంది. ఇంట్లో ఖాళీగా ఉన్న పెద్ద గోడల్ని క్రియేటివ్‌గా తీర్చి దిద్దుకునే ఆరు ఐడియాలు ఇక్కడున్నాయి. ఓ సారి చదివేసి నచ్చిన వాటిని ఆచరించే ప్రయత్నం చేసేయండి.

1. గోడంతా మన ఆర్ట్‌:

కొంతమంది మన కుటుంబ సభ్యుల పెయింటింగ్స్‌ని చాలా అద్భుతంగా చిత్రీకరిస్తూ ఉంటారు. అలాంటి వారు ఎవరైనా తెలిసుంటే ఆ గోడపైనే పెయింటింగ్‌ వేయించుకోండి. అవి మన వ్యక్తిగతమైనవి కాబట్టి చూసినప్పుడల్లా ఆనందాన్ని పంచుతాయి. మంచి వింటేజ్‌ లుక్‌ని ఇంటికి తీసుకొస్తాయి. లేదంటే మీకు డీఐవైలు చేసే అలవాటు ఉంటే మంచి మంచి ఆర్ట్‌ పీస్‌లను స్వయంగా తయారు చేసి అలంకరించండి. బయట నుంచి ఎన్ని రూపాయిలు పోసి కొని తెచ్చి పెట్టుకున్నా ఆ సాటిస్ఫేక్షన్‌ రాదు.

2. మిర్రర్‌ స్టిక్కర్లు:

ఇప్పుడు రకరకాల ఆకారాల్లో మిర్రర్‌ స్టిక్కర్లు దొరుకుతున్నాయి. పెద్ద పెద్ద స్టిక్కర్లు మీ గోడకు సరిపోతాయి అనుకునేవి దొరికితే ప్రయత్నించండి. ఇవి ఆ ప్రాంతాన్ని మరింత ఖాళీగా ఎలివేట్‌ చేస్తాయి. మీ గోడకు కొత్త అందాన్ని తెచ్చి పెడతాయి.

3. ఫోకల్‌ పాయింట్‌:

మీ గోడను చూడగానే అందరి దృష్టి ఎక్కడ పడుతోందో ముందు గుర్తించండి. సరిగ్గా అదే చోట మంచి ఆబ్‌స్ట్రాక్ట్‌ వాల్ పెయింటింగ్‌ని ఎంచుకుని పెట్టండి. ఇంట్లోకి వచ్చిన వారంతా ముందు అదే గోడను తప్పకుండా చూస్తారు.

4. గేమ్‌ వాల్‌:

మీ ఇంట్లో ఆడుకునే పిల్లలు ఉన్నట్లయితే ఓ పెద్ద గోడను గేమ్‌ వాల్‌గా చేసి చూడండి. అక్కడ చెస్‌, పజిల్‌ గేమ్స్‌ లాంటి వాటిని ఆడుకోవడానికి వీలుగా ఏర్పాటు చేయండి. మీ క్రియేటివిటీతో వీటిని మరింత ఆకర్షణీయంగా ఏర్పాటు చేయండి.

5.లైటింగ్‌ వాల్‌:

ఇప్పుడు రకరకాల ఆకారాల్లో, పేర్ల ఆకారాల్లో లైట్లు అందుబాటులో ఉంటున్నాయి. ఇంట్లో పెద్ద గోడ ఖాళీగా ఉంది అనుకున్నప్పుడు మధ్యలో మీ పేర్లతో లైటింగ్‌ వాల్‌ని ఏర్పాటు చేసుకోండి. ఇంటికి పార్టీ లుక్‌ వచ్చేస్తుంది.

6. సీలింగ్‌తో కలిపి:

పెద్ద గోడ ఉంటే దాన్ని ఇంటి సీలింగ్‌తో రన్నింగ్‌ అయ్యే డిజైన్‌ వచ్చేలా చేసుకోండి. అంటే పైన సీలింగ్‌ నుంచి కింద గోడ వరకు ఒకటే థీమ్‌ రన్నింగ్‌ అవుతుంది. అప్పుడు ఆ గది లుక్కే మారిపోతుంది.

తదుపరి వ్యాసం