తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ridge Gourd Benefits । బీరకాయ తింటే ఎంత ఆరోగ్యకరమో తెలుసా? కానీ ఇలా వండాలి!

Ridge Gourd Benefits । బీరకాయ తింటే ఎంత ఆరోగ్యకరమో తెలుసా? కానీ ఇలా వండాలి!

HT Telugu Desk HT Telugu

09 May 2023, 13:37 IST

    • Ridge Gourd Health Benefits: పోషకాహార నిపుణురాలు సాక్షి లాల్వానీ హెచ్‌టి డిజిటల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బీరకాయ తింటే కలిగే అనేక ప్రయోజనాలను వివరించింది. ఇక్కడ తెలుసుకోండి.
Ridge Gourd Health Benefits
Ridge Gourd Health Benefits (stock pic)

Ridge Gourd Health Benefits

Summer Foods: వేసవిలో కూరగాయలను ఎక్కువగా తింటూ ఉండాలి. ఇందులో బీరకాయను మీ ఆహారంలో చేర్చుకోవడం చాలా ఆరోగ్యకరం. ఈ వేడికాలంలో బీరకాయను ( Ridge Gourd in Summer) తినడం ద్వారా మిమ్మల్ని చల్లగా ఉంచుకోవచ్చు. బీరకాయ నీటిశాతం అధికంగా ఉండే కూరగాయ (Water-rich veggie). ఇందులో క్యాలరీలు తక్కువ ఉంటాయి, పొషకాలు ఎక్కువ ఉంటాయి. ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి6, పొటాషియం, సోడియం, జింక్, కాపర్ , సెలీనియం వంటి ముఖ్యమైన పోషకాలకు బీరకాయ పవర్‌హౌస్.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

బీరకాయలోని అధిక ఫైబర్, నీటి కంటెంట్‌ కారణంగా ఇది మీ మలబద్ధకం సమస్యలను కూడా తగ్గించగలదు. మీ రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. ఇంకా ఇది శరీరంలో పేరుకుపొయిన విషపూరిత వ్యర్థాలు, ఆల్కహాల్ అవశేషాలను తొలగించడానికి తోడ్పడుతుంది. కొవ్వు పేరుకుపోవడాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది. కాబట్టి ఇది కాలేయ పనితీరుకు అద్భుతమైన కూరగాయగా పరిగణించవచ్చు. ఇవే కాదు ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

పోషకాహార నిపుణురాలు సాక్షి లాల్వానీ హెచ్‌టి డిజిటల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బీరకాయ తింటే కలిగే అనేక ప్రయోజనాలను వివరించింది. అవేంటో చూద్దాం.

Ridge Gourd Health Benefits- బీరకాయ తింటే కలిగే అనేక ప్రయోజనాలు

- ఎండాకాలంలో అధిక శరీర వేడిని తగ్గించడం మొదలుకొని వాపును తగ్గించడం, బరువు నియంత్రించడం వరకు బీరకాయ అనేక విధాలుగా మీ ఆరోగ్యానికి సహాయాపడుతుంది. ఈ కూరగాయలలో విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, రిబోఫ్లావిన్, థయామిన్, జింక్ వంటి మూలకాలు ఉన్నాయి ఉంటుంది, ఇవి శరీరంలోని వాపును తగ్గించడంలో సహాయపడతాయి.

- బీరకాయలో ఐరన్ , మాంగనీస్ వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, బీటా-కెరోటిన్‌ లక్షణాలను కలిగి ఉంటుంది కాబట్టి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

- ఇది కాలేయ ఆరోగ్యాన్ని (Liver Health)మెరుగుపరుస్తుంది, ఆల్కహాల్ మత్తు నుండి కాలేయాన్ని నిర్విషీకరణ (Detoxing) చేయడానికి కూడా పనిచేస్తుంది.

- ఇది గుండెకు మంచిది, ప్రమాదకర వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షించడానికి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది.

Ridge Gourd Cooking Tips: బీరకాయ వండటంలో చిట్కాలు

కూరగాయలలో కొన్నింటిని పచ్చిగా తిన్నప్పుడు, మరికొన్నింటిని ఉడికించి తిన్నప్పుడు క్రియాశీల పోషకాలు సులభంగా లభిస్తాయని, అప్పుడే శరీరంలో బాగా శోషణ చెందుతాయని సాక్షి చెప్పారు.

బీరకాయను సలాడ్‌లు, కూరలు, పప్పు లాగా వండుకొని తినవచ్చు. అయితే, ఎక్కువ నీరు ఉపయోగించి బీరకాయను వండకూడదు, ఎక్కువసేపు వండకూడదు. ఎందుకంటే కొన్ని నీటిలో కరిగే విటమిన్లను కోల్పోవచ్చు అని న్యూట్రిషనిస్ట్ సాక్షి తెలిపారు.

తదుపరి వ్యాసం